బూజు దులపనున్నారా.. తెరపైకి సీక్వెల్‌ సినిమా | Indian 3 Movie Will Shortly Begin Shooting | Sakshi
Sakshi News home page

బూజు దులపనున్నారా.. తెరపైకి సీక్వెల్‌ సినిమా

Jul 25 2025 6:55 AM | Updated on Jul 25 2025 6:55 AM

Indian 3 Movie Will Shortly Begin Shooting

కమలహాసన్‌ కథానాయకుడిగా శంకర్‌ దర్శకత్వం వహించిన చిత్రం ఇండియన్‌ (భారతీయుడు). 1996లో విడుదలైన ఈ చిత్రం ఘన విజయం సాధించింది. ఆ తర్వాత అదే కాంబినేషన్లో ఇండియన్‌ 2 చిత్రాన్ని రూపొందించారు. లైకా ప్రొడక్షన్స్‌ సంస్థ నిర్మించిన ఈ చిత్రం పలు ఆటంకాలను ఎదుర్కొంటూ దాదాపు నాలుగేళ్ల పాటు నిర్మాణాన్ని జరుపుకుంది. 2024 లో భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ చిత్రం డిజాస్టర్‌గా నిలిచింది. కాగా దీనికి సీక్వెల్‌ను నిర్మించనున్నట్లు ఇండియన్‌ 2 చిత్ర నిర్మాణ దశలోనే పేర్కొన్నారు. అయితే ఇండియన్‌ 2 చిత్రం ఘోర పరాజయం పొందడంతో ఇండియన్‌ 3 రావడం అసాధ్యమేనే ప్రచారం జరిగింది. 

ఆ చిత్రం గురించి అందరూ మరిచిపోతున్న తరుణంలో మళ్లీ ఇప్పుడు వార్తల్లోకెక్కడం విశేషం. ఇండియన్‌ 3 చిత్రాన్ని రూపొందించడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయనే వార్త సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ అవుతోంది ఈచిత్ర షూటింగ్‌ వచ్చే నెలలో ప్రారంభం కానుందనే వార్తలు వినిపిస్తున్నాయి. ఈ విషయమై దర్శకుడు శంకర్‌ వర్గాలను సంప్రదించగా ఇండియన్‌ 3 చిత్ర నిర్మాణానికి సంబంధించిన చర్చలు జరుగుతున్నట్లు పేర్కొన్నారు. అయితే దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన ఇంకా వెలువడలేదు. కాగా ఈ చిత్రాన్ని అయినా శంకర్‌ ప్రేక్షకులను రంజంపజేసే విధంగా తెరకెక్కిస్తారా..? అన్న చర్చ జరుగుతోంది.

 ఎందుకంటే ఇటీవల ఈయన దర్శకత్వం వహించిన తెలుగు చిత్రం గేమ్‌ చేంజర్, తమిళ చిత్రం ఇండియన్‌ 2 పూర్తిగా నిరాశపరిచాయి. అదే విధంగా కమలహాసన్‌ కూడా ఇండియన్‌ 2, థక్‌ లైఫ్‌ చిత్రాలతో ఫ్లాపుల్లో ఉన్నారు. ఇక లైకా ప్రొడక్షన్స్‌ సంస్థ మంచి విజయాన్ని చూసి చాలా కాలమే అయ్యింది. ఈ ముగ్గురికి ఇప్పుడు హిట్‌ చాలా అవసరం కావడం గమనార్హం. అందుకే ఇండియన్‌3 ప్రాజెక్ట్బూజు దులుపేందుకు సిద్ధం అవుతున్నారట.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement