
బాలావుడ్ నటి, కొరియోగ్రాఫర్, దర్శకురాలు ఫరా ఖాన్ తన యూట్యూబ్ ఛానల్ ద్వార సినీ సెలబ్రిటీల హోమ్‌టూర్ చేస్తుంటారనే విషయం తెలిసిందే. ఈ క్రమంలో తాజాగా ఆమె బాలీవుడ్ నటుడు సోనూసూద్ (Sonu Sood) ముంబైలోని ఇంటికి వెళ్లారు. వారితో సందడిగా గడిపారు. వీడియోలో సోనూసూద్ సతీమణి సోనాలితో పాటు వారి కుమారులు కూడా కనిపించారు. విలాసవంతమైన వారి ఇంట్లో ఉన్న కొన్ని వస్తువులను చూసిన ఫరాఖాన్ చాలా ఆశ్చర్యపోయారు. సోనూ వద్ద పనిచేస్తున్న స్టాప్ను కూడా పరిచయం చేశారు.