తండ్రి కాబోతున్న తెలుగు కమెడియన్.. ఫొటోలు వైరల్ | Bigg Boss 3 Fame Actor Mahesh Vitta Wife Pregnancy | Sakshi
Sakshi News home page

Mahesh Vitta: ప్రెగ్నెన్సీతో టాలీవుడ్ కమెడియన్ భార్య

Jun 2 2025 12:23 PM | Updated on Jun 2 2025 12:32 PM

Bigg Boss 3 Fame Actor Mahesh Vitta Wife Pregnancy

రాయలసీమ కుర్రాడిగా యూట్యూబ్ వీడియోలతో ఫేమస్ అయిన మహేశ్ విట్టా.. తర్వాత తర్వాత సినిమా నటుడిగా మారాడు. బిగ్‌బాస్ షోకి కూడా రెండుసార్లు వెళ్లొచ్చాడు. ప్రస్తుతం పలు చిత్రాలు, ఓ వెబ్ సిరీస్ చేస్తున్న ఇతడు.. త్వరలో తాను తండ్రి కాబోతున్న విషయాన్ని ప్రకటించాడు. తన భార్య ప్రెగ్నెన్సీతో ఉందని, తొందరలో గుడ్ న్యూస్ చెప్పబోతున్నామని క్లారిటీ ఇచ్చేశాడు.

ఫన్ బకెట్ వీడియోలతో పాపులారిటీ తెచ్చుకున్న మహేశ్.. బిగ్‌బాస్ 3వ, ఓటీటీ సీజన్‌లో పాల్గొన్నాడు. కొన్ని వారాలు మాత్రమే అలరించాడు తర్వాత ఎలిమినేట్ అయిపోయాడు. ఇక బిగ్‌బాస్ హౌసులో ఉండగానే తన ప్రేమ గురించి బయటపెట్టిన మహేశ్.. త్వరలో పెళ్లి ఉండొచ్చని చెప్పాడు. చెప్పినట్లుగానే 2023 సెప్టెంబరులో శ్రావణి రెడ్డి అనే అమ్మాయితో కొత్త జీవితం ప్రారంభించాడు.

(ఇదీ చదవండి: స్టేజీపై రాజేంద్ర ప్రసాద్ 'బూతు' పురాణం.. అలీని ఏకంగా)

మహేశ్ విట్టా చెల్లెలి ఫ్రెండే శ్రావణి. దాదాపు ఐదేళ్ల పాటు ప్రేమించుకున్న వీళ్లిద్దరూ.. పెద్దల్ని ఒప్పించి పెళ్లి చేసుకున్నారు. ఇప్పుడు తల్లిదండ్రులు కాబోతున్న విషయాన్ని బయటపెట్టారు. ఈ క్రమంలోనే తాజాగా శ్రావణి రెడ్డి బేబీ బంప్‌తో ఉన్న ఫొటోలని మహేశ్ తన ఇన్ స్టాలో పోస్ట్ చేశాడు. దీంతో తోటి నటీనటులు శుభాకాంక్షలు చెబుతున్నారు.

మహేశ్ విట్టా సినిమాల విషయానికొస్తే.. కృష్ణార్జున యుద్ధం, కొండపొలం, జాంబీరెడ్డి, ఏ1 ఎక్స్‌ప్రెస్ తదితర సినిమాల్లో కమెడియన్‌గా చేశాడు. నిజానికి 'పుష్ప' మూవీలో కేశవ పాత్ర కోసం కూడా ఆడిషన్ ఇచ్చాడు. కానీ చివరి నిమిషంలో మహేశ్ విట్టా బదులు జగదీశ్ ప్రతాప్‌కి అవకాశం దక్కింది.

(ఇదీ చదవండి: ఓటీటీల్లో ఈ వారం ఏకంగా 22 చిత్రాలు)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement