ఓటీటీలో భారీ యాక్షన్‌ సినిమా స్ట్రీమింగ్‌ | Kill Movie OTT Streaming Date Locked | Sakshi
Sakshi News home page

ఓటీటీలో భారీ యాక్షన్‌ సినిమా స్ట్రీమింగ్‌

Aug 30 2024 3:25 PM | Updated on Aug 30 2024 6:58 PM

Kill Movie OTT Streaming Date Locked

బాలీవుడ్‌లో సూపర్‌ హిట్‌ అందుకున్న 'కిల్‌' సినిమా ఓటీటీలోకి రానుంది.   లక్ష్‌ లాల్వానీ , తాన్య మనక్తిలా జంటగా నటించిన ఈ సినిమా జులై 5న విడుదలైంది. ఆ సమయంలో కల్కి 2898 ఏడీ సినిమాతో గట్టి పోటీని తట్టుకుని బాక్సాఫీస్‌ వద్ద సత్తా చాటింది. అయితే, ఈ సినిమా ఓటీటీలో ఎప్పుడు వస్తుందా అని ఎదురుచేస్తున్న ప్రేక్షకులకు హాట్‌స్టార్‌ గుడ్‌న్యూస్‌ చెప్పింది.

ధర్మా ప్రొడక్షన్స్‌పై నిఖిల్‌ నగేశ్‌ భట్‌ దర్శకత్వం వహించిన కిల్‌  గతేడాదిలో నిర్వహించిన టొరంటో ఇంటర్నేషనల్‌ ఫిల్మ్‌ ఫెస్టివల్‌లో ప్రదర్శితమైంది. యూకే, అమెరికా వంటి దేశాల్లో ఈ సినిమా ఇప్పటికే అమెజాన్‌ ప్రైమ్‌లో స్ట్రీమింగ్‌ అవుతుంది. అయితే, తాజాగా డిస్నీ+హాట్‌ స్టార్‌ వేదికగా సెప్టెంబర్‌ 6న భారత్‌లో విడుదల కానున్నట్లు ప్రకటన వెలువడింది. ప్రస్తుతం హిందీలో మాత్రమే అందుబాటులోకి రానుందని తెలిపారు. తెలుగు,తమిళ్‌, కన్నడ, మలయాళం వంటి భాషలలో ఎప్పుడు విడుదలకానుంది అనేది క్లారిటీ ఇవ్వలేదు. ఈ సినిమాలోని యాక్షన్‌ సీక్వెన్స్‌కు ప్రేక్షకులు ఫిదా కావాల్సిందే. అంతలా ఆడియన్స్‌ను కట్టిపడేస్తాయి.

కథేంటి..?
అమిత్ రాథోడ్ (లక్ష్య లల్వానీ) ఆర్మీలో ఎన్ఎస్‌జీ కమాండర్. తులికా (తన్య మనిక్తలా) అనే అమ్మాయితో ప్రేమలో ఉంటాడు. ప్రేయసి మరొకరితో నిశ్చితార్థం చేసుకుని రాంచీ నుంచి ఫ్యామిలీతో కలిసి ట్రైన్‌లో ఢిల్లీ వెళ్తుంటుంది. ఆమెని సర్‌ప్రైజ్ చేద్దామని హీరో కూడా అదే ట్రైన్‌ ఎక్కుతాడు. ఓ స్టేషన్‌లో ఇదే ట్రైన్‌లోకి 40 మంది బందిపోట్లు ఎక్కుతారు. వీళ్ల వల్ల తులికా కుటుంబానికి ఊహించని చిక్కులు! తర్వాత ఏమైంది? తులికా ఫ్యామిలీతో పాటు మిగతా వాళ్లని అమిత్ కాపాడాడా లేదా అనేది స్టోరీ.
 

Advertisement
 
Advertisement
Advertisement