
బాలీవుడ్ ‘క్రూ’లోకి మళ్లీ తిరిగొచ్చారట హీరోయిన్ కరీనా కపూర్. టబు, కరీనా కపూర్, కృతీ సనన్ లీడ్ రోల్స్‌లో నటించిన చిత్రం ‘క్రూ’. రాజేశ్ ఎ. కృష్ణన్ దర్శకత్వం వహించిన ఈ కామెడీ డ్రామా చిత్రం 2024లో విడుదలై, సూపర్ హిట్‌గా నిలిచింది. ఈ చిత్రనిర్మాతల్లో ఒకరైన ఏక్తా కపూర్ ‘క్రూ’కు సీక్వెల్‌ను ప్లాన్ చేస్తున్నారని సమాచారం. ఈ సన్నాహాల్లో భాగంగానే కరీనా కపూర్‌ను మేకర్స్ సంప్రదించగా ఆమె గ్రీన్ సిగ్నల్ ఇచ్చారట.
‘క్రూ’ సినిమాలో మాదిరిగానే ‘క్రూ 2’లోనూ ముగ్గురు హీరోయిన్లు ఉంటారట. కాక పోతే తొలి భాగంలో నటించిన టబు, కృతీ సనన్ రెండో భాగంలో ఉండరనే విషయంపై చర్చలు జరుగుతున్నాయని బాలీవుడ్ టాక్. ఈ ఇద్దరి స్థానంలో ప్రస్తుతం ట్రెండింగ్‌లో ఉన్న ఇద్దరు కొత్త హీరో యిన్లు అయితే బాగుంటుందని మేకర్స్ అనుకుంటున్నారట. మరి... ఫైనల్‌గా ‘క్రూ 2’లో కరీనాతో పాటు నటించే ఆ ఇద్దరు హీరోయిన్లు ఎవరు అనేది తెలియాలంటే మరికొన్ని రోజులు ఎదురు చూడక తప్పదు.