కన్నడ భాష వివాదం వేళ.. తమిళంలో కమల్ హాసన్‌ ట్వీట్‌ వైరల్! | Kamal Haasan tweet Viral controversy about Kannada Language comments | Sakshi
Sakshi News home page

Kamal Haasan: కర్ణాటకలో వివాదం.. ఆయన సేవలను గుర్తు చేసుకున్న కమల్ హాసన్‌!

Jun 3 2025 6:49 PM | Updated on Jun 4 2025 6:48 AM

Kamal Haasan tweet Viral controversy about Kannada Language comments

కమల్ హాసన్‌ చేసిన కామెంట్స్‌తో కర్ణాటక వ్యాప్తంగా పెద్దఎత్తున వ్యతిరేకత వచ్చింది. తమిళం నుంచే కన్నడ భాష పుట్టిందని కమల్ అనడంపై కన్నడిగులు ఆగ్రహంగా ఉన్నారు. ఈ నేపథ్యంలోనే కమల్‌ లేటేస్ట్ మూవీ థగ్‌ లైఫ్‌పై ఏకంగా బ్యాన్ విధించారు. కర్ణాటక ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్‌ థగ్ లైఫ్‌ను నిషేధిస్తూ ప్రకటన విడుదల చేసింది. కమల్ క్షమాపణ చెబితేనే రిలీజ్ గురించి ఆలోచిస్తామని స్పష్టం చేశారు.

అయితే కమల్‌ హాసన్‌ తన వ్యాఖ్యలపై తగ్గేదే లేదని అన్నారు. తాను ఎలాంటి తప్పు చేయలేదని.. తప్పు చేస్తేనే క్షమాపణ చెబుతానని స్పష్టం చేశారు. అంతేకాకుండా తన మూవీని కర్ణాటకలో విడుదల చేయడం లేదంటూ వెల్లడించారు. భాషా వివాద నేపథ్యంలో.. కన్నడ ప్రజలకు క్షమాపణ చెప్పమన్న కర్ణాటక హైకోర్టు కమల్‌ హాసన్‌ను ఆదేశించింది.

అయితే ఈ వివాదం నేపథ్యంలో కమల్‌ మరోసారి చేసిన ట్వీట్‌ హాట్‌ టాపిక్‌గా మారింది. తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి, దివంగత ఎం.కరుణానిధి జయంతి సందర్భంగా ఆయన సేవలను గుర్తు చేసుకుంటూ పోస్ట్ చేశారు. 'ఆయన తన జీవితాంతం తమిళ భాష, తమిళ కళలకు, తమిళనాడు అభివృద్ధికి, తమిళ కళల సంక్షేమానికి అంకితం చేసిన అసమాన నాయకుడు కలైంగర్ జయంతి సందర్భంగా ఆయనకు నివాళులు అర్పించడానికి నేను సంతోషిస్తున్నా'  అంటూ కరుణానిధితో దిగిన ఫోటోను పంచుకున్నారు.

(ఇది చదవండి: కమల్ హాసన్‌ థగ్‌ లైఫ్‌లో మీర్జాపూర్‌ నటుడు.. క్లారిటీ ఇదే!)

థగ్‌ లైఫ్‌ వివాదం వేళ కమల్‌ హాసన్‌ చేసిన ట్వీట్‌ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. కర్ణాటకలో థగ్ లైఫ్‌ నిషేధించాలని కోరుతూ కర్ణాటక ఫిల్మ్‌ ఛాంబర్‌ ఆఫ్‌ కామర్స్‌ హైకోర్టును ఆశ్రయించగా.. ఉన్నత న్యాయస్థానం కమల్‌పై ఆగ్రహం వ్యక్తం చేసింది.  క్షమాపణ చెబితే సరిపోయేది కదా ఆంటూ వ్యాఖ్యానించింది. ఆ తర్వాత తన వ్యాఖ్యలను తప్పుగా అర్థం చేసుకున్నారని కేఎఫ్‌సీసీకి కమల్‌ లేఖ రాశారు కానీ క్షమాపణ మాత్రం చెప్పకపోవడం విశేషం.

Advertisement
 
Advertisement
Advertisement