కొన్ని గంటల్లో 'కల్కి' ట్రైలర్‌.. ప్రీ రిలీజ్ ఈవెంట్ అక్కడేనా..? | Kalki AD 2898 Movie Trailer Release Date And Pre Release Event Details Inside | Sakshi
Sakshi News home page

Kalki AD 2898 Pre Release: కొన్ని గంటల్లో 'కల్కి' ట్రైలర్‌.. ప్రీ రిలీజ్ ఈవెంట్ అక్కడేనా..?

Jun 9 2024 8:11 AM | Updated on Jun 9 2024 2:34 PM

Kalki AD 2898 Pre Release Event

ప్రభాస్‌ హీరోగా నటించిన సైన్స్ ఫిక్షన్  అండ్‌ ఫ్యూచరిస్టిక్‌ ఫిల్మ్‌ ‘కల్కి 2898 ఏడీ’. అమితాబ్‌ బచ్చన్ , కమల్‌ హాసన్ , దీపికా పదుకొనె, దిశా పటానీ ఇతర పాత్రల్లో నటించారు. నాగ్‌ అశ్విన్  దర్శకత్వంలో అశ్వినీదత్‌ నిర్మించిన ఈ చిత్రం జూన్  27న విడుదల కానుంది. ఈ చిత్రంలో భైరవ పాత్రలో ప్రభాస్‌ నటిస్తున్నారు. ఇందులో బుజ్జి వాహనం చాలా ప్రత్యేకంగా ఉండనుంది. అయితే, మరికొన్ని గంటల్లో కల్కి ట్రైలర్‌ విడుదల కానుంది. ఈ క్రమంలో ఫ్యాన్స్‌ భారీ అంచనాలు పెట్టుకున్నారు.

కల్కి ట్రైలర్‌ జూన్‌ 10న విడుదల చేస్తున్నట్లు ఇప్పటికే మేకర్స్‌ ప్రకటించారు. దేశవ్యాప్తంగా భారీ సంఖ్యలో థియేటర్స్‌లలో కూడా కల్కి ట్రైలర్‌ను విడుదల చేసే ఛాన్స్‌ ఉంది. అందుకు ఇప్పటికే ఆ థియేటర్స్‌ లిస్ట్‌ను కూడా మేకర్స్‌ రెడీ చేసినట్లు సమాచారం.

కల్కి సినిమా జూన్‌ 27న విడుదల కానున్నడంతో భారీ ఎత్తున ప్రీ రిలీజ్ ఈవెంట్ కార్యక్రమాన్ని నిర్వహించేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. ఈ ఈవెంట్‌ను ఆంధ్రప్రదేశ్‌లో నిర్వహించనున్నట్లు తెలుస్తుంది. ఈ వేడుక కోసం పెద్ద ఎత్తున​ నిర్వహిస్తుండటంతో దేశవ్యాప్తంగా ఉన్న ప్రముఖలను ఆహ్వానించే పనిలో కల్కి టీమ్‌ ఉందట. జూన్‌ 23న కల్కి ప్రీ రిలీజ్ ఈవెంట్ జరగనున్నట్లు సోషల్‌ మీడియాలో ఒక వార్త వైరల్‌ అవుతుంది.

Advertisement
 
Advertisement
Advertisement