ప్రముఖ బాలీవుడ్ నటుడు నానా పటేకర్ మృతిపై యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. భారతీయ సినిమా రంగానికి నానా పటేకర్ చేసిన సేవలను గుర్తు చేసుకుంటూ సోషల్ మీడియా వేదికగా సంతాపం తెలిపారు.
నటన తరతరాల పాటు గుర్తుండిపోతాయి..
‘భారతీయ సినిమా రంగంలోని అత్యుత్తమ నటులలో ఒకరైన నానా పటేకర్ గారి మరణ వార్త విని తీవ్రంగా విచారిస్తున్నాను. ఆయన పోషించిన ప్రతి పాత్రలోనూ స్పష్టమైన నిజాయితీ, తీవ్రత కనిపించేవి. ఆయన నటన ఎప్పుడూ నటనలా అనిపించేది కాదు. తెరపై ఆవిష్కృతమవుతున్న జీవంలా ఉండేది’ అంటూ నానా పటేకర్ నటనా ప్రతిభను ఎన్టీఆర్ కొనియాడారు. భారతీయ సినిమాకు ఆయన చేసిన సేవలు, ఆయన అందించిన అద్భుతమైన నటన తరతరాల పాటు గుర్తుండిపోతాయని పేర్కొన్నారు. నానా పటేకర్ కుటుంబ సభ్యులకు, ఆత్మీయులకు జూనియర్ ఎన్టీఆర్ ప్రగాఢ సానుభూతి తెలిపారు.
Deeply saddened by the passing of Nana Patekar sir, one of Indian cinema’s finest actors. There was an unmistakable honesty and intensity in every character he portrayed. His performances never felt like acting, but life unfolding on screen. A remarkable artist whose contribution to Indian cinema will be remembered for generations. Heartfelt condolences to his family and loved ones. Om Shanti 🙏
— Jr NTR (@tarak9999) October 8, 2026


