ఎన్టీఆర్‌ ఫ్యాన్స్‌కు కమిషనర్‌ సజ్జనార్‌ బిగ్‌ వార్నింగ్‌.. | Jr NTR Fans In Spotlight As Sajjanar Raises Concern Over AI Fake Image | Sakshi
Sakshi News home page

ఎన్టీఆర్‌ ఫ్యాన్స్‌పై అసంతృప్తి.. తారక్‌ గమనించాలంటూ..: సజ్జనార్‌

Oct 9 2026 4:09 PM | Updated on Oct 9 2026 4:15 PM

Jr NTR Fans In Spotlight As Sajjanar Raises Concern Over AI Fake Image

జూనియర్‌ ఎన్టీఆర్‌ అభిమానుల తీరుపై హైదరాబాద్‌ పోలీస్‌ కమిషనర్‌ సజ్జనార్‌ అసంతృప్తి వ్యక్తం చేశారు.  దేవర సినిమాలోని ‘చుట్టమల్లే’ పాటకు సంబంధించిన వివాదం నేపథ్యంలో ఓ వ్యక్తిని అరెస్టు చేసినట్లు సోషల్‌ మీడియాలో ఓ ఫొటో ప్రచారంలోకి వచ్చింది.  అయితే, ఆ ఫొటో ఏఐతో సృష్టించిన నకిలీ చిత్రమని సజ్జనార్‌ స్పష్టం చేశారు. దీనిపై స్పందిస్తూ నేరుగా ఎన్టీఆర్‌ను ట్యాగ్‌ చేసి ట్వీట్‌ చేయడం చర్చనీయాంశంగా మారింది. ‘

 గుడ్డిగా నమ్మకుండా
‘ఏఐతో రూపొందించే నకిలీ చిత్రాలు అసలైన ఫొటోలగే కనిపిస్తున్నాయి.  ఇలాంటి ఫోటోలు చూసి ప్రజలు మోసపోవద్దు. వాటి నిజానిజాలను తెలుసుకోకుండా ఇతరులకు పంపించవద్దు. సోషల్‌ మీడియాలో కనిపించే ప్రతి సమాచారాన్ని గుడ్డిగా నమ్మకుండా, వాస్తవాలను పరిశీలించిన తర్వాతే స్పందించాలి.  ఫ్యాక్ట్‌ చెక్‌ చేయకుండా కంటెంట్‌ను షేర్‌ చేయడం వల్ల తప్పుడు సమాచారం వ్యాప్తిచెందుతోంది. 

నా ఫొటోను మార్ఫింగ్‌ చేసి ప్రచారం చేస్తున్న విషయాన్ని జూనియర్‌ ఎన్టీఆర్‌ గమనించాలి. ఈ తరహాలో నా ఫొటోను దుర్వినియోగం చేస్తున్న  మీ అభిమానుల తీరును మీ దృష్టికి తీసుకువస్తున్నాను. ఏఐతో మార్ఫింగ్‌ చేసిన చిత్రాలు, వీడియోల ద్వారా వ్యక్తుల ప్రతిష్ఠకు భంగం కలిగించడం సరైన పద్ధతికాదు.  డీప్‌ఫేక్‌లను గుర్తించడం, తప్పుడు సమాచారాన్ని అడ్డుకోవడం ప్రతి ఒక్కరి బాధ్యత.  అందరూ సహకరించాలని ప్రతి ఒక్కరికీ విజ్ఞప్తి చేస్తున్నాను' అని ఎక్స్ లో పేర్కొన్నారు.

(ఇదీ చదవండి: బిగ్‌బాస్‌లో దోమల గోల.. ముకేశ్‌, నరేశ్‌ కామెడీ మామూలుగా లేదుగా..!)

 

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement