breaking news
ntr fans
-
ఎమ్మెల్యే దగ్గుపాటి క్షమాపణ చెప్పాలి.. లేకపోతే మేమేంటో చూపిస్తాం..
-
రెండ్రోజుల్లో ‘దగ్గుపాటి’ క్షమాపణ చెప్పాలి
హైదరాబాద్: ‘జూనియర్ ఎన్టీఆర్ తల్లి షాలినిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన అనంతపురం టీడీపీ ఎమ్మెల్యే దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్‌ను టీడీపీ నుండి వెంటనే సస్పెండ్ చెయ్యాలని.. రెండ్రోజుల్లో ఆయన బహిరంగ క్షమాపణ చెప్పాలని.. లేదంటే అనంతపురం ముట్టడిస్తామని ఎన్టీఆర్ అభిమానులు హెచ్చరించారు. ‘నందమూరి’ కోడలిని తిడితే ఎలా ఒప్పుకుంటామని వారు బుధవారం హైదరాబాద్ సోమాజీగూడ ప్రెస్‌క్లబ్‌లో మీడియాతో చెప్పారు. ఆంధ్రప్రదేశ్‌లో ప్రెస్‌మీట్ పెట్టుకునే పరిస్థితి లేదన్నారు. ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ ఎవరికైతే ఫోన్‌చేసి బూతులు మాట్లాడాడో అతన్ని పక్కన కూర్చోపెట్టుకుని బహిరంగంగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. సమావేశంలో ఎన్టీఆర్ అభిమానులు నరేంద్ర చౌదరి, సుధీర్ రాజు, కావూరి కృష్ణ, బాబ్జి, ఆదోని ముజీబ్‌లు ఏమన్నారంటే..ఎమ్మెల్యేను టీడీపీ నేతలు నిలదీయాలి..ప్రజాప్రతినిధి అయి ఉండి ఎమ్మెల్యే దగ్గుపాటి ఒక మాతృమూర్తిని నోటికి ఎంతవస్తే అంత సోయిలేకుండా మాట్లాడడం సభ్యసమాజం తలదించుకునేలా ఉంది. టీడీపీ అంటే మహిళలను ఎంతో గౌరవించే పార్టీ అని గొప్పగా చెప్పుకునే నాయకులు ఇలా ఒక స్త్రీ గురించి ఎందుకు మాట్లాడాడో ఆయన్ని నిలదీయాలి. ప్రసాద్ అనే ఎమ్మెల్యే వెనక ఎన్టీఆర్ స్థాపించిన టీడీపీ లేకపోతే తమ సత్తా ఏమిటో చూపించే వాళ్లం. తప్పుచేసి ఇప్పుడు నా వాయిస్ కాదు అని అంటున్నాడు. కానీ, ఫోన్లో మాట్లాడిన అభిమానం మాత్రం ఎమ్మెల్యేనే మాట్లాడాడని స్పష్టంగా చెబుతున్నాడు. దీంతో.. ఎమ్మెల్యే ప్రసాద్ అతనిని, అతని కుటుంబాన్ని బెదిరిస్తున్నాడు. దగ్గుపాటి అహంకారానికి నిదర్శనం..ప్రభుత్వం సినిమాకు అనుమతిచ్చిన తరువాత ‘ఎలా రిలీజ్ చేస్తారు’ అని అనడానికి ఎమ్మెల్యే ఎవరు? 25 ఏళ్లుగా తలాతోక లేనివారు ఎంతోమంది నానా రకాలుగా ఇబ్బందులు పెట్టారు. అయితే, ఎన్టీఆర్ ఏనాడూ ఎవ్వరినీ ఒక్కమాట కూడా అనలేదు. వార్–2 సినిమా ప్రమోషన్లో కూడా పాతికేళ్లుగా ఎన్నో ఆటుపోట్లు ఎదుర్కొన్నానని ఎన్టీఆర్ చెప్పారు కానీ, ఎవ్వరినీ విమర్శించలేదు.. ఎవరికీ వ్యతిరేకంగా కూడా మాట్లాడలేదు. అయినా, ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ అలా మాట్లాడడం ఆయన అహంకారానికి నిదర్శనం. రెండ్రోజుల్లో ఎమ్మెల్యే బహిరంగంగా క్షమాపణ చెప్పకపోతే చలో అనంతపూర్ నిర్వహించి ఎమ్మెల్యే ఇల్లు ముట్టడిస్తాం. అక్కడి ఎన్టీఆర్ విగ్రహాల వద్ద నిరసన, రాస్తారోకో చేస్తాం. ఎన్టీఆర్ యువసైన్యం తన సత్తా చూపిస్తుంది.ఏపీలో ప్రెస్‌మీట్ పెట్టే పరిస్థితి లేదు..ఇక ఈ ప్రెస్‌మీట్ అనంతపురంలో పెట్టాల్సింది. కానీ, అక్కడ పోలీసులు విపరీతమైన ఆంక్షలు పెట్టి మీడియా సమావేశం పెట్టకుండా అడ్డుకుంటున్నారు. ఆఖరుకు విజయవాడలో పెడదామనుకున్నా అక్కడ కూడా పెట్టకూడదంటున్నారు. ఏపీలోని అన్ని జిల్లాల్లో ఇదే పరిస్థితి ఉండడంతో చివరికి హైదరాబాద్‌కు వచ్చి సమావేశం పెట్టాల్సి వచ్చింది. -
ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకుని సారీ చెప్పు, లేదంటే మా తడాఖా చూపిస్తాం!
సాక్షి, హైదరాబాద్: జూనియర్ ఎన్టీఆర్ (Jr NTR) గురించి నీచంగా మాట్లాడతారా? మా ఫ్యాన్స్ సత్తా ఏంటో చూపిస్తాం అన్నారు జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ స్టేట్ కన్వీనర్ నరేంద్ర చౌదరి. ఆయన బహిరంగ క్షమాపణ చెప్పకపోతే ఇంటిని ముట్టడిస్తామని హెచ్చరించారు. హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన ప్రెస్మీట్లో నరేంద్ర చౌదరి మాట్లాడుతూ.. టీడీపీ ఎమ్మెల్యే దగ్గుపాటి వెంకటేశ్వరప్రసాద్ సభ్యసమాజం తలదించుకునేలా నోటికి ఎంతొస్తే అంత వాగారు. మా ఎన్టీఆర్ తల్లిపై దారుణంగా కామెంట్స్ చేశారు.క్షమాపణలు చెప్పాలిఎన్టీఆర్ తల్లినే కాదు, ఏ స్త్రీ మూర్తి గురించి అలా మాట్లాడకూడదు. అలా ఎవరు మాట్లాడినా తప్పే! ఇది సమాజానికి ఏమాత్రం శ్రేయస్కరం కాదు. ఇది ఇంతటితో ఆపేస్తే బెటర్. ఆయన ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకుని అనంతపురం నడిబొడ్డున క్షమాపణలు చెప్పాలి. ఆయన్ను పార్టీ నుంచి సస్పెండ్ చేయాలి. లేదంటే రాష్ట్రవ్యాప్తంగా నిరసనలకు దిగుతాం. దేశవ్యాప్తంగా ఉన్న ఎన్టీఆర్ అభిమానులందరం ఛలో అనంతపురం అంటూ మీ ఇంటిని ముట్టడిస్తాం అని హెచ్చరించారు.ఏం జరిగింది?వార్ -2 రిలీజ్ సమయంలో అభిమానుల స్పెషల్ షోకు అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్‌ను జూనియర్ ఎన్టీఆర్ అభిమానుల సంఘం నేత ధనుంజయ నాయుడు ఆహ్వానించారు. దీంతో దగ్గుపాటి ప్రసాద్.. జూనియర్ ఎన్టీఆర్‌పై రెచ్చిపోయారు. వాడి సినిమాలెలా ఆడనిస్తాను? మీరెలా ఆడనిస్తార్రా గాడిదల్లారా.. అంటూ అసభ్య పదజాలంతో హీరో గురించి నీచంగా మాట్లాడారు. ఎన్టీఆర్ తల్లిని సైతం దారుణంగా దూషించారు. వార్ 2 షోలను అనంతపురంలో నిలిపివేయాలని వార్నింగ్ ఇచ్చారు. ఈ వ్యవహారంపై తారక్ అభిమానులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. -
అనంత ఎమ్మెల్యే ప్రసాద్ దిష్టిబోమ్మ దహనం
కడప రూరల్/మదనపల్లె రూరల్/కర్నూలు(సెంట్రల్): అనంతపురం అర్బన్ టీడీపీ ఎమ్మెల్యే దగ్గుపాటి వెంకటేశ్వరప్రసాద్ జూనియర్ ఎన్టీఆర్‌ను ఉద్దేశించి చేసిన పరుష వ్యాఖ్యలపై అభిమానులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కడపలోని ఎన్టీఆర్ విగ్రహం వద్ద సోమవారం జిల్లా ఎన్టీఆర్ ఫ్యాన్స్ అసోసియేషన్ యూత్ లీడర్స్ ఆధ్వర్యంలో ఎమ్మెల్యే దగ్గుపాటి వెంకటేశ్వరప్రసాద్ దిష్టిబోమ్మను దహనం చేశారు. ఈ సందర్భంగా అసోసియేషన్ నేత సునీల్‌కుమార్, రామారావు మాట్లాడుతూ.. సినీరంగంలో పేరు ప్రఖ్యాతులు గాంచిన జూనియర్ ఎన్టీఆర్‌ను ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ అధికార మదంతో దూషించడం దారుణమన్నారు. జూ.ఎన్టీఆర్∙నటించిన సినిమాలను ఆడబోనివ్వమని చెప్పడం హాస్యాస్పదంగా ఉందన్నారు. జూనియర్ ఎన్టీఆర్ సినిమాలను ఆపడం ఎవరి తరం కాదన్నారు.ఎమ్మెల్యే వ్యాఖ్యలపై సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్‌కళ్యాణ్, మంత్రి నారా లోకేశ్ తక్షణం స్పందించాలన్నారు. ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్‌ను సస్పెండ్ చేయడంతో పాటు జూనియర్ ఎన్టీఆర్‌కు, ఆయన తల్లి శాలినికి, అభిమానులకు బహిరంగంగా క్షమాపణ చెప్పించాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో ఎమ్మెల్యే ఇంటిని ముట్టడిస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో అభిమానులు బుల్లెట్ సాయి, హరి తదితరులు పాల్గొన్నారు. పోలీసుల అదుపులో అభిమానులుజూనియర్ ఎన్టీఆర్‌పై అనుచిత వ్యాఖ్యలు చేసిన టీడీపీ ఎమ్మెల్యే దగ్గుపాటి వెంకటేశ్వరప్రసాద్పై చర్యలు తీసుకోవాలని కోరుతూ నిరసన కార్యక్రమాలు చేపట్టేందుకు అనుమతి కోరిన అభిమానులను సోమవారం మధ్యాహ్నం వరకు మదనపల్లె వన్‌టౌన్ పోలీసులు అదుపులో ఉంచుకున్నారు. దీనిపై అభిమానులు అసహనం వ్యక్తం చేశారు.ఈ సందర్భంగా మదనపల్లె జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ అధ్యక్షుడు టెంపర్ రాజేష్ మాట్లాడుతూ.. తమ హీరోకు మద్దతుగా నిరసన తెలిపేందుకు అనుమతి కోరితే పోలీసులు నిరాకరించారన్నారు. అనంత ఎమ్మెల్యే ప్రసాద్‌పై చర్యలు తీసుకోవాలని కోరుతూ సబ్ కలెక్టర్ కార్యాలయంలో అభిమానులు వినతిపత్రం సమర్పించారు. కర్నూలు కలెక్టరేట్ ఎదుట సోమవారం ధర్నాకు జూ.ఎన్టీఆర్ ఫ్యాన్స్ యత్నించారు. దీంతో పోలీసులు వారిని మూడో పట్టణ పోలీసు స్టేషన్‌కు తరలించారు. దీంతో వారంతా స్టేషన్ ఎదుట నిరసన తెలిపారు. -
కర్నూలులో ఉద్రికత్త.. ఎన్టీఆర్ అభిమానుల నిరసన
సాక్షి, కర్నూలు: కర్నూలు కలెక్టరేట్ వద్ద ఉద్రిక్తత చోటుచేసుకుంది. టీడీపీ ఎమ్మెల్యే దగ్గుబాటి ప్రసాద్‌కు వ్యతిరేకంగా జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు నిరసనకు దిగారు. తక్షణమే టీడీపీ ఎమ్మెల్యేపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. ఎమ్మెల్యే దగ్గుబాటికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ నిరసనలు తెలుపుతున్నారు.ఈ నేపథ్యంలో కలెక్టరేట్ వద్ద ఎన్టీఆర్ అభిమానులు నిరసనలను పోలీసులు అడ్డుకున్నారు. అనంతరం, నిరసనకారులను బలవంతంగా త్రీటౌన్ పోలీసు స్టేషన్‌కు తరలించారు. ఈ క్రమంలో జూనియర్ అభిమానులు త్రీటౌన్ పోలీసు స్టేషన్ వద్దకు భారీ సంఖ్యలో చేరుకుని పీఎస్ ఎదుటే ఆందోళనకు దిగారు. పోలీసులు, ఎమ్మెల్యేకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తున్నారు. ఎమ్మెల్యే దగ్గుపాటి వ్యాఖ్యలు వైరల్..అంతకుముందు.. అనంతపురం అర్బన్ టీడీపీ ఎమ్మెల్యే దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్ నోరు పారేసుకున్న విషయం తెలిసిందే. ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్.. ఎన్టీఆర్ అభిమాన సంఘం నేతకు ఫోన్ చేసి.. ‘ఈ సినిమాకు ఎన్ని థియేటర్లు అనుమతించారు.. ఎవరు అనుమతి ఇచ్చారు.. ఎలా ఆడనిస్తారు? ఆ సినిమాను ఆడనిచ్చేదే లేదు.. వాడు బుడ్డా ఫకీర్.. లోకేష్‌ను తిట్టిన వాడి సినిమాలు ఎలా ఆడనిస్తాను.. వానెమ్మ.. లం..కొడుకు ఈ టైమ్‌లో వాని సినిమాలు ఆడనిస్తానా.. మీరెలా ఆడనిస్తార్రా గాడిదల్లారా? నా పర్మిషన్ లేకుండా వేయిస్తారా? ఈ సినిమా ఆడదు.. వాడు బుడ్డా ఫకీర్ గాడు లోకేశ్ గురించి మాట్లాడతాడా? ఈ సినిమా ఆడదు. నాకు తెలియకుండా సినిమా ఎట్లా ఆడుతుంది.. నేను అనంతపురం ఎమ్మెల్యే.. బుడ్డా ఫకీర్ నా కొడుకు.. సార్ గురించి మాట్లాడతాడా? గాడ్ ప్రామిస్‌గా చెబుతున్నా.. ఈ సినిమా ఆడదు.. ఆపేయిస్తున్నా.. నేను ఊరుకుంటానా.. పంపించేయండి అందరినీ’ అని హుకుం జారీ చేశారు’ ఈ ఫోన్ కాల్ ఆడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయింది. లోకేష్, చంద్రబాబు ప్రోద్భలంతోనే ఎన్టీఆర్ సినిమాను అడ్డుకునే ప్రయత్నాలు జరుగుతున్నాయని, ఎమ్మెల్యే ప్రసాద్ వ్యాఖ్యలు అందులో భాగమేనని నందమూరి, ఎన్టీఆర్ అభిమానుల్లో ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి.వాయిస్ రికార్డ్ బయట పెట్టిన ధనుంజయ నాయుడుసోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఆడియో తనది కాదని ఎమ్మెల్యే ప్రసాద్ వివరణ ఇవ్వబోగా జూ.ఎన్టీఆర్ అభిమాని, టీఎన్ఎస్ఎఫ్ నేత గుత్తా ధనుంజయ నాయుడు ఆయన వాయిస్ రికార్డు బయట పెట్టారు. జూ.ఎన్టీఆర్‌ను తిడుతూ.. తనను ఎమ్మెల్యే ఫోన్లో బెదిరించిన అనంతరం ఆయన ఒక ఆడియోను రికార్డు చేసి ఎమ్మెల్యేకు పంపినట్లు తెలుస్తోంది. ‘అన్నా.. మీరంటే గౌరవం ఉంది. దయచేసి చెబుతున్నా.. ఎవరో చెప్పిన మాటలు విని అలా మాట్లాడవద్దు. జూ.ఎన్టీఆర్‌కు సినిమా పరంగా ముందు నుంచీ అభిమానిని. ఈ విషయాన్ని నారా లోకేశ్ ముందు చెప్పమన్నా చెబుతా. అంతేగానీ ఎవరి కోసమో పని చేయలేదు నేను. దయచేసి నన్ను కాంట్రవర్సీలోకి లాగొద్దు.సినిమా మీద కాంట్రవర్సీ ఎందుకు? నన్నెందుకు మీరు ఇష్టానుసారం మాట్లాడుతున్నారు? అసభ్యంగా మాట్లాడితే నేను పడను. నాకు ఫోన్ చేసి బెదిరించడం తప్పు. ఎన్టీఆర్ గాడు.. గీడు అని మాట్లాడవద్దు. మీరు నాతో మాట్లాడిన ప్రతిదీ వాయిస్ రికార్డు చేశాను. ఈ రికార్డులన్నీ నారా రోహిత్ అన్నకు పంపినా. నాకు నీవు ఏమైనా అర్ధ రూపాయి ఇచ్చినావా? ఏడాది దాటింది. ఒక్క పని ఇచ్చావా? చిన్న సహాయం చేశావా? నా మీద నీకేం హక్కుంది మాట్లాడేందుకు? నన్ను చంపుతావా.. చంపు. నన్ను చంపావంటే మా వాళ్లు ఊరికే ఉండరు. నువ్వు నోరు జారినావంటే బాగుండదు’ అని గుత్తా ధనుంజయ నాయుడు ఎమ్మెల్యేకు పంపిన వాయిస్ రికార్డులో పేర్కొన్నారు. దీంతో జూ.ఎన్టీఆర్ అభిమానులు మరింతగా రగిలిపోతున్నారు. -
జననేతపై అభిమానం.. ఎన్టీఆర్, ప్రభాస్ ఫ్యాన్స్ మద్దతు
సాక్షి, కర్నూలు జిల్లా: సినిమాల్లో ఎందరు హీరోలున్నా రాజకీయాల్లో మాత్రం సీఎం జగన్ ఒక్కరే హీరో.. అంతులేని అభిమానం ఆయనకే సొంతం. తాజాగా, కర్నూలు ప్రచార సభలో సీఎం జగన్‌కు ఎన్టీఆర్, ప్రభాస్ ఫ్యాన్స్ మద్దతు తెలిపారు. ది లీడర్ జగన్ అంటూ ఫ్లెక్సీలు, బ్యానర్లు ప్రదర్శించారు. జై జగన్ అంటూ ఎన్టీఆర్, ప్రభాస్ ఫ్యాన్స్ సభలో నినాదాలు చేశారు.సీఎం జగన్ ఎన్నికల ప్రచార సభలకు జనం ప్రభంజనంలా తరలివస్తున్నారు. ఓవైపు సీఎం జగన్ నిర్వహిస్తున్న ప్రచార సభలకు సునామీలా జనం పోటెత్తుతుండటం.. మరోవైపు చంద్రబాబు, పవన్ కళ్యాణ్ నిర్వహిస్తున్న ప్రచారానికి ప్రజల నుంచి స్పందనే లేకపోవడంతో కూటమి శ్రేణుల్లో నైరాశ్యం నెలకొంది. -
ఎన్టీఆర్ అభిమానికి ఆర్థిక సాయం చేసిన 'బేబి' నిర్మాత
'బేబి' నిర్మాత ఎస్కేఎన్ మంచి మనసు చాటుకున్నారు. ఇటీవల అమలాపురంకు చెందిన పవన్ కృష్ణ అనే ఎన్టీఆర్ అభిమాని ఇటీవల రోడ్డు ప్రమాదానికి గురయ్యాడు. బాగా దెబ్బలు తగలడంతో.. ఇతడికి మెరుగైన చికిత్స అందించాలని డాక్టర్స్ చెప్పారు. కానీ సదరు వ్యక్తి ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రమే కావడంతో.. తోటి అభిమానులు సోషల్ మీడియా వేదికగా ఫండ్స్ సేకరించే ప్రయత్నాలు చేశారు. (ఇదీ చదవండి: అశ్లీలతతో నిండిన ఆ వెబ్‌సైట్స్, ఓటీటీ యాప్స్ బ్యాన్) ఇప్పుడు ఈ విషయం టాలీవుడ్ నిర్మాత ఎస్కేఎన్ వరకు చేరింది. దీంతో ఆయన ఎన్టీఆర్ అభిమానికి అండగా నిలబడ్డారు. అతనిది పేద కుటుంబం కావడంతో తన వంతు సాయంగా రూ.50 వేలు పంపించారు. ప్రస్తుతం ఈ విషయం ఫ్యాన్స్‌కి కాస్త ఊరటగా నిలిచింది. అలానే మిగతా సెలబ్రిటీలు కూడా చావు బతుకుల మధ్య ఉన్న పవన్ కృష్ణకి సాయం చేయాలని సదరు ఫ్యాన్స్ కోరుతున్నారు. (ఇదీ చదవండి: ఆ నటితో నాకు సంతోషం లేదు.. అందుకే రెండో పెళ్లి!) -
ఎన్టీఆర్ ఫ్యాన్స్ పై టీడీపీ నేతల దాడి
-
జూనియర్ ఎన్టీఆర్ వీరాభిమాని.. ఆయన పేరుతో ఏకంగా!
యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. రెండు తెలుగు రాష్ట్రాల్లో ఆయనకు ఫ్యాన్స్ ఫాలోయింగ్ రేంజే వేరు. ఆర్ఆర్ఆర్ సినిమాతో ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్నారు. రాజమౌళి తెరకెక్కించిన ఈ చిత్రంలోని నాటు నాటు సాంగ్‌కు ఆస్కార్ వరించింది. అందుకే ఎన్టీఆర్ అంటే అంతలా అభిమానిస్తారు. తాజాగా ఓ అభిమాని తన ప్రేమను వినూత్నంగా చాటుకున్నారు. ఏపీలోని కర్నూలుకు ఓ వీరాభిమాని తన కొత్త ఇంటిని నిర్మిస్తున్నారు. అయితే ఇంటి నిర్మాణానికి వినియోగించే ఇటుకలపై ఎన్టీఆర్ అని పేరును ముద్రించారు. ఈ విధంగా తన అభిమాన హీరో జూనియర్ ఎన్టీఆర్‌పై ఉన్న ప్రేమను వ్యక్తం చేశారు. కాగా.. జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తుతం దేవర చిత్రంలో నటిస్తున్నారు. కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కిస్తోన్న ఈ మూవీలో శ్రీదేవి కూతురు జాన్వీ కపూర్ హీరోయిన్గా టాలీవుడ్ ఎంట్రీ ఇస్తోంది. ఈ చిత్రంలో సైఫ్ అలీ ఖాన్, ప్రకాష్‌రాజ్, జిస్సు సేన్‌గుప్తా, శ్రీకాంత్, టామ్ చాకో, నరైన్, మురళీ శర్మ కీలక పాత్రలు పోషిస్తున్నారు. భారీ బడ్జెట్‌తో రూపొందిస్తున్న ఈ చిత్రానికి అనిరుధ్ రవిచందర్ సంగీతం సమకూరుస్తున్నారు. ఆ తర్వాత హృతిక్ రోషన్ మూవీ వార్-2లో ఎన్టీఆర్ కనిపించనున్నారు. బ్రహ్మాస్త్ర ఫేమ్ అయాన్ ముఖర్జీ దీనికి దర్శకత్వం వహించనున్నారు. Kurnool City & Dt@tarak9999 ఒక అభిమాని తన ఇంటి కోసం NTR అనే పేరు గల ఇటికలను తన ఇల్లు నిర్మాణం కోసం కావాలని తెప్పించుకున్నాడు ఇటువంటి అభిమానులు చాలా అరుదుగా ఉంటారు రాయలసీమలో #JaiNTR #ManOfMassesNTR pic.twitter.com/ZtOG35VSYt — MadhuYadav (jr.NTR) Kurnool (@MadhuYadavTarak) November 3, 2023 -
బాబు రిమాండ్‌పై హోరెత్తిన సోషల్ మీడియా
సాక్షి, అమరావతి: స్కిల్ డెవలప్మెంట్ కుంభకోణంలో ఏసీబీ కోర్టు చంద్రబాబుకు రిమాండ్ విధించడంతో మాజీ సీఎం నందమూరి తారక రామారావు (ఎన్టీఆర్) అభిమానులు సోషల్ మీడియాలో పోస్టులు హోరెత్తించారు. ఎన్టీఆర్ ఆత్మశాంతించిందంటూ తెగ పోస్టులు పెట్టారు. వెన్నుపోటు పొడిచి సీఎం పదవిని, టీడీపీని చంద్రబాబు లాక్కుని ఎన్టీఆర్ మరణానికి కారణమయ్యారని గుర్తుచేస్తున్నారు. ఎన్టీఆర్‌కు కరెక్ట్‌గా 73 ఏళ్ల వయసులో బాబు వెన్నుపోటు పొడవగా... ఇప్పుడు అదే 73 ఏళ్ల వయసులో బాబు జైలు పాలయ్యాడన్నారు. ఖర్మ ఫలితం అంటే ఇదేనని ఫేస్బుక్, ఇన్‌స్టా, ట్విట్టర్లలో పోస్టులు పెట్టారు. ‘‘ఈ చోటి కర్మ ఈ చోటే ఈనాటి కర్మ మరునాడే అనుభవించి తీరాలంతే ఈ సృష్టి నియమం ఇదే.. ఎన్ని కన్నీళ్ల ఉసురిది.. వెంటాడుతోంది..’’ అనే పాట బ్యాక్‌గ్రౌండ్‌తో 1995 బాబు వెన్నుపోటు ఘటన నాటి వైశ్రాయి హోటల్ ముందు ఎన్టీఆర్ వీడియోలు, ఫొటోల పోస్టింగ్స్‌తో అభిమానులు హర్షాతిరేఖాలు వ్యక్తంచేశారు. గోదావరి పుష్కరాల సమయంలో తన ప్రచారం కోసం 30 మంది ప్రాణాలను బలిగొన్నాడని.. అప్పుడు చేసిన పాపాలకు ప్రతిఫలం అనుభవించమని దేవుడు చంద్రబాబును రాజమండ్రి పంపిస్తున్నాడనే ప్రచారం సోషల్ మీడియాలో కొనసాగింది. వంగవీటి రంగా, కారంచేడు మారణహోమంలో బలైన దళితులు, బషీర్‌బాగ్ కాల్పుల్లో చనిపోయిన అమాయకుల ఆత్మలు సైతం శాంతించాయని మరికొందరు తమ పోస్టుల ద్వారా సంతోషం వ్యక్తంచేశారు. అలాగే, చంద్రబాబుకు 14 రోజుల పాటు రిమాండ్ విధించడంపై.. తన అల్లుడికి తగిన బుద్ధి చెప్పిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌ను సీనియర్ ఎన్టీఆర్ ఆశీర్వదిస్తున్నట్లు కార్టూన్లు, మీమ్లను నెటిజన్లు అత్యధికంగా షేర్ చేస్తున్నారు. రెండోరోజూ ట్విట్టర్లో ట్రెండింగ్ ఇక వరుసగా రెండోరోజూ ట్విట్టర్లో చంద్రబాబు అరెస్టు ట్వీట్లు ట్రెండింగ్‌గా నిలిచాయి. చంద్రబాబు అరెస్టు, స్కాంస్టర్ చంద్రబాబు, చంద్రబాబునాయుడు, స్కిల్ డెవలెప్మెంట్ స్కాం వంటి హ్యాష్ ట్యాగ్లైన్లు భారీగా ట్రెండింగ్ అయ్యాయి. ఇండియా–పాకిస్థాన్ మ్యాచ్ కంటే బాబు అరెస్టు వార్తలే టాప్ ట్రెండింగ్‌లో నిలిచాయి. -
ఎన్టీఆర్‌పై పరోక్షంగా మీరా చోప్రా పోస్ట్.. ఫ్యాన్స్ చురకలు
Jr Ntr Fans Counter To Meera Chopra For Indirect Post On NTR: వాన, బంగారం సినిమాలతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైంది హీరోయిన్ మీరా చోప్రా. అయితే అంతకన్నా ఎక్కువగా యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్‌ను కించపరిచేలా పెట్టిన ట్వీట్లతో ఆమె మరింత పాపులర్ అయింది. రెండేళ్ల క్రితం తారక్‌ను ఉద్దేశిస్తూ పెట్టిన మీరా చోప్రా ట్వీట్లు తెగ వైరల్ అయ్యాయి. ఆ ట్వీట్లు చూసిన ఎన్టీఆర్ అభిమానులు మీరాపై ఆగ్రహంతో ఊగిపోయారు. సోషల్ మీడియాలో ఆమెను దూషిస్తూ కామెంట్లు కూడా పెట్టారు. ఈ విషయంపై ఎన్టీఆర్ ఫ్యాన్స్ బెదిరింపులకు పాల్పడుతున్నారని పోలీసులను ఆశ్రయించింది మీరా చోప్రా. అయితే తాజాగా ఈ అమ్మడు పెట్టిన ఒక పోస్ట్ మళ్లీ తారక్ ఫ్యాన్స్ మండిపోయేలా చేసింది. చదవండి: ప్రియాంక వల్ల సినిమా ఛాన్స్‌లు రాలేదు : మీరా చోప్రా 'సౌత్ ఇండియన్ యాక్టర్స్ పాన్ ఇండియా స్థాయిలో గుర్తింపు తెచ్చుకోవడం నాకు ఎంతో సంతోషంగా ఉంది. వారి టాలెంట్, వినయం, ప్యాషన్‌ను చూసి ఒకరు కచ్చితంగా నేర్చుకోవాలి.' అంటూ ప్రభాస్, అల్లు అర్జున్, రామ్ చరణ్ పేర్లకు హ్యాష్‌ట్యాగ్ ఇచ్చింది. ఈ పోస్టులో కావాలనే ఎన్టీఆర్‌ను మెన్షన్ చేయలేదని తారక్ ఫ్యాన్స్ ఆగ్రహాం వ్యక్తం చేస్తున్నారు. అయితే దీపికా పదుకొణె, అలియా భట్ వంటి స్టార్ హీరోయిన్లే జూనియర్ ఎన్టీఆర్‌తో నటించేందుకు ఇష్టపడుతున్నారని, అవుట్ డేటెడ్, జూనియర్ ఆర్టిస్ట్‌గా కూడా పనికిరాని వారి మాటలు లెక్కలోకి తీసుకోవాల్సిన అవసరం లేదని తారక్ ఫ్యాన్స్ కౌంటర్లు ఇస్తున్నారు. ఇదిలా ఉంటే ఒక సమయంలో ఎన్టీఆర్‌కు జోడీగా మీరా చోప్రాకు నటించే అవకాశం వచ్చి చేజారిపోయింది. ఈ అక్కసుతోనే తారక్‌ను మీరా చోప్రా టార్గెట్ చేస్తూ ట్వీట్లు పెడుతుందని సమాచారం. I feel so happy to see South indian actors getting pan india recognition. One should learn from their talent, their humility, their passion.#prabhas #alluarjun #ramcharan #yash. So proud 👏👏👏👏 — meera chopra (@MeerraChopra) April 9, 2022 BOLLYWOOD Superstar Deepika About Jr. NTR . Character Artist kuda paniki rani Vallaki attention Evvakandi 🤭🤭 pic.twitter.com/Opc2taw7w9 — ...... 🐐 (@SK_Tarock) April 9, 2022 -
ఎన్టీఆర్ ఫ్యాన్స్‌పై కేసు నమోదు
తనను అసభ్య పదజాలంతో వేధిస్తున్న జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్‌పై చర్యలు తీసుకోవాలంటూ బాలీవుడ్ నటి మీరా చోప్రా పోలీసులను ఆశ్రయించిన విషయం తెలిసిందే. కాగా సోమవారం నాడు అభిమానులతో చిట్‌చాట్ చేసిన సందర్భంలో ఎన్టీఆర్ ఎవరో తెలియదు అనడంతో ఈ వివాదం రాజుకుంది. తానసలు ఆ హీరో ఫ్యాన్ కాదన్నందుకు ఆమెపై ఎన్టీఆర్ అభిమానులు తీవ్రంగా విరుచుకుపడ్డారు. దూషణలకు దిగుతూ బెదిరింపులకు కూడా పాల్పడ్డారు. ఈ క్రమంలో ఆమె వాటి స్క్రీన్షాట్లను సైబర్ క్రైమ్ పోలీసులకు ట్వీట్ చేసింది. తనపై అసభ్యకరంగా కామెంట్లు చేస్తున్న ఫ్యాన్స్‌పై చర్యలు తీసుకోవాలని కోరింది. ట్వీట్ల ఆధారంగా సైబర్ క్రైమ్ పోలీసులు 67 యాక్ట్, 509 ఐపీసీ సెక్షన్ల కింద హీరో అభిమానులపై కేసు నమోదు చేశారు. (ఎన్టీఆర్ ఫ్యాన్స్‌పై హీరోయిన్ మీరా ఫిర్యాదు) This is my main concern. What is stopping these stars to come out and talk abt cyber bullying, slut shaming done by their fan clubs. Is it that they dont care or they have lost spine?? https://t.co/pDF74hUPo6 — meera chopra (@MeerraChopra) June 3, 2020 అసభ్యంగా కామెంట్లు చేసిన వారి ట్విటర్ అకౌంట్లను గుర్తింంచే పనిలో పడ్డారు. అసభ్యంగా ఉన్న పోస్టులను షేర్ చేసినా, వాటిపై కామెంట్ చేసినా వారిపై కేసు నమోదు చేసి కఠిన చర్యలు తీసుకుంటామని హైదరాబాద్ సీసీఎస్ సైబర్ ఏసీపీ కేవీఎం ప్రసాద్ హెచ్చరించారు. కాగా ఈ ఘటనపై గాయని చిన్మయితో పాటు, జాతీయ మహిళా కమిషన్ చైర్మన్ రేఖా శర్మ సైతం మీరా చోప్రాకు మద్దతు పలికారు. మీరా చోప్రాపై దిగజారుడు వ్యాఖ్యలు చేసిన ట్విటర్ అకౌంట్లను తొలగించాల్సిందిగా ట్విటర్‌ను కోరారు. (హీరోయిన్‌కు ఎన్టీఆర్ ఫ్యాన్స్ వేధింపులు!) 🙏 https://t.co/NA0aLw45Ol — meera chopra (@MeerraChopra) June 3, 2020 -
ఆహ్వానం..40 ఏళ్ల అనుబంధం!
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్ అబిడ్స్‌లోని ఆహ్వానం హోటల్‌తో నందమూరి హరికృష్ణకు విడదీయరాని బంధం ఉంది. గత నలభై ఏళ్లుగా ఆయనకు ఈ హోటల్ కేరాఫ్ అడ్రస్‌గా నిలిచింది. ఎన్టీఆర్, హరికృష్ణ అభిమానులు అక్కడకు తరలివచ్చేవారు.. వారిని హరికృష్ణ ఆత్మీయంగా పలకరించేవారు. యోగక్షేమాలను తెలుసుకుని.. వచ్చిన వారికి భోజనం పెట్టి ఆదరించి అక్కున చేర్చుకునేవారు. బుధవారం ఆయన అకాల మరణవార్త తెలిసి ఎన్టీఆర్ ఎస్టేట్‌లో విషాదఛాయలు అలుముకున్నాయి. రామకృష్ణ థియేటర్‌తోపాటు దుకాణ సముదాయాలను వ్యాపారులు స్వచ్ఛందంగా మూసివేసి హరికృష్ణ నివాసానికి తరలివెళ్లారు. ఆహ్వానం హోటల్ సిబ్బంది హరికృష్ణ చిత్రపటాన్ని ప్రవేశద్వారం వద్ద ఉంచి శ్రద్ధాంజలి ఘటించారు. 1001 నంబరు గది.. : మూడంతస్తులున్న ఆహ్వానం హోటల్లో మొత్తం 48 గదులున్నాయి. వీటిలో మూడు మినహా మిగతా 45 గదులను హోటల్ సిబ్బంది అద్దెకిస్తున్నారు. ఈ మూడు గదులను హరికృష్ణ తన వ్యక్తిగత అవసరాలకు వినియోగించేవారు. బంధువులు, మిత్రులు, శ్రేయోభిలాషులకు మాత్రమే ఈ గదులను కేటాయించేవారు. రోజూ ఉదయం 11 గంటలకు హోటల్‌కు చేరుకుని సాయంత్రం 5 గంటల వరకు 1001 నంబరు గదిలో ఉండేవారు. పదేళ్లుగా హోటల్ నిర్వహణ బాధ్యతలను కృష్ణారావు అనే వ్యక్తికి హరికృష్ణ అప్పజెప్పారు. అంతకుముందు తానే హోటల్ బాధ్యతలు చూసేవారని సిబ్బంది తెలిపారు. ‘టాటా సియారా’పై ఎనలేని ప్రేమ: ఆహ్వానం హోటల్ ఎదురుగా పార్క్ చేసిన తెలుపు రంగు టాటా సియారా వాహనం అంటే హరికృష్ణకు ఎంతో ప్రేమ. ఈ వాహనం నంబర్ ఏపీ 20బి 3339ని లక్కీ నంబర్‌గా భావించేవారని హోటల్ సిబ్బంది తెలిపారు. హోటల్ ఆవరణలో పార్క్ చేసిన ఏఏయూ 2622 నంబరు బుల్లెట్, ఏపీ 9ఏ 5229 బుల్లెట్లంటే ఆయనకు ఎంతో మక్కువ. ఇక్కడే పార్క్ చేసిన బజాజ్ చేతక్, హీరో హోండా వాహనాలు గతంలో హరికృష్ణ వాడినవే. ద్విచక్ర వాహనాలు, కార్లు, ఇతర వాహనాలను నడపడం, వాటిపై సుదూర ప్రాంతాలకు నడుపుకుంటూ వెళ్లడం అంటే ఆయనకు ఎనలేని సరదా అని స్థానికులు తెలిపారు. -
'చంద్రబాబుకు నూటికి సున్నా మార్కులు'
విజయవాడ: గడప గడపకు వైఎస్ఆర్ సీపీ కార్యక్రమంలో భాగంగా ఏ ఇంటికి వెళ్లినా చంద్రబాబు నాయుడు మోసాలనే చెబుతున్నారని వైఎస్ఆర్ సీపీ నేత పార్థసారధి అన్నారు. ఆయన శనివారమిక్కడ మీడియాతో మాట్లాడుతూ ప్రజలు చంద్రబాబు పాలనకు నూటికి సున్నా మార్కులు వేస్తున్నారన్నారు. టీడీపీ కార్యకర్తలు కూడా రుణమాఫీ జరగలేదని ఫిర్యాదు చేస్తున్నారని పార్థసారధి తెలిపారు. పెన్షన్ల కోతతో వికలాంగులు, వృద్ధులు అవస్థలు పడుతున్నారన్నారు. గ్రీన్ జోన్-3 పేరుతో కృష్ణాజిల్లా రైతులకు చంద్రబాబు వెన్నుపోటు పొడిచారన్నారు. ఇప్పుడు మచిలీపట్నం డీప్ వాటర్ పోర్టు పేరుతో భూములు లాక్కోవాలని చూస్తున్నారని విమర్శించారు. అవినీతికి వ్యతిరేకంగా టీడీపీలో మరో వర్గం తయారవుతోందని, ఎన్టీఆర్ అభిమానులు అంతా చంద్రబాబు పేరు చెబితే ఛీ కొడుతున్నారన్నారు. -
చంద్రబాబును అడ్డుకున్న జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు