
సాక్షి, కర్నూలు: కర్నూలు కలెక్టరేట్ వద్ద ఉద్రిక్తత చోటుచేసుకుంది. టీడీపీ ఎమ్మెల్యే దగ్గుబాటి ప్రసాద్‌కు వ్యతిరేకంగా జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు నిరసనకు దిగారు. తక్షణమే టీడీపీ ఎమ్మెల్యేపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. ఎమ్మెల్యే దగ్గుబాటికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ నిరసనలు తెలుపుతున్నారు.
ఈ నేపథ్యంలో కలెక్టరేట్ వద్ద ఎన్టీఆర్ అభిమానులు నిరసనలను పోలీసులు అడ్డుకున్నారు. అనంతరం, నిరసనకారులను బలవంతంగా త్రీటౌన్ పోలీసు స్టేషన్‌కు తరలించారు. ఈ క్రమంలో జూనియర్ అభిమానులు త్రీటౌన్ పోలీసు స్టేషన్ వద్దకు భారీ సంఖ్యలో చేరుకుని పీఎస్ ఎదుటే ఆందోళనకు దిగారు. పోలీసులు, ఎమ్మెల్యేకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తున్నారు.
ఎమ్మెల్యే దగ్గుపాటి వ్యాఖ్యలు వైరల్..
అంతకుముందు.. అనంతపురం అర్బన్ టీడీపీ ఎమ్మెల్యే దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్ నోరు పారేసుకున్న విషయం తెలిసిందే. ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్.. ఎన్టీఆర్ అభిమాన సంఘం నేతకు ఫోన్ చేసి.. ‘ఈ సినిమాకు ఎన్ని థియేటర్లు అనుమతించారు.. ఎవరు అనుమతి ఇచ్చారు.. ఎలా ఆడనిస్తారు? ఆ సినిమాను ఆడనిచ్చేదే లేదు.. వాడు బుడ్డా ఫకీర్.. లోకేష్‌ను తిట్టిన వాడి సినిమాలు ఎలా ఆడనిస్తాను.. వానెమ్మ.. లం..కొడుకు ఈ టైమ్‌లో వాని సినిమాలు ఆడనిస్తానా.. మీరెలా ఆడనిస్తార్రా గాడిదల్లారా? నా పర్మిషన్ లేకుండా వేయిస్తారా? ఈ సినిమా ఆడదు.. వాడు బుడ్డా ఫకీర్ గాడు లోకేశ్ గురించి మాట్లాడతాడా? ఈ సినిమా ఆడదు. నాకు తెలియకుండా సినిమా ఎట్లా ఆడుతుంది.. నేను అనంతపురం ఎమ్మెల్యే.. బుడ్డా ఫకీర్ నా కొడుకు.. సార్ గురించి మాట్లాడతాడా? గాడ్ ప్రామిస్‌గా చెబుతున్నా.. ఈ సినిమా ఆడదు.. ఆపేయిస్తున్నా.. నేను ఊరుకుంటానా.. పంపించేయండి అందరినీ’ అని హుకుం జారీ చేశారు’ ఈ ఫోన్ కాల్ ఆడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయింది. లోకేష్, చంద్రబాబు ప్రోద్భలంతోనే ఎన్టీఆర్ సినిమాను అడ్డుకునే ప్రయత్నాలు జరుగుతున్నాయని, ఎమ్మెల్యే ప్రసాద్ వ్యాఖ్యలు అందులో భాగమేనని నందమూరి, ఎన్టీఆర్ అభిమానుల్లో ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి.
వాయిస్ రికార్డ్ బయట పెట్టిన ధనుంజయ నాయుడు
సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఆడియో తనది కాదని ఎమ్మెల్యే ప్రసాద్ వివరణ ఇవ్వబోగా జూ.ఎన్టీఆర్ అభిమాని, టీఎన్‌ఎస్‌ఎఫ్ నేత గుత్తా ధనుంజయ నాయుడు ఆయన వాయిస్ రికార్డు బయట పెట్టారు. జూ.ఎన్టీఆర్‌ను తిడుతూ.. తనను ఎమ్మెల్యే ఫోన్లో బెదిరించిన అనంతరం ఆయన ఒక ఆడియోను రికార్డు చేసి ఎమ్మెల్యేకు పంపినట్లు తెలుస్తోంది. ‘అన్నా.. మీరంటే గౌరవం ఉంది. దయచేసి చెబుతున్నా.. ఎవరో చెప్పిన మాటలు విని అలా మాట్లాడవద్దు. జూ.ఎన్టీఆర్‌కు సినిమా పరంగా ముందు నుంచీ అభిమానిని. ఈ విషయాన్ని నారా లోకేశ్ ముందు చెప్పమన్నా చెబుతా. అంతేగానీ ఎవరి కోసమో పని చేయలేదు నేను. దయచేసి నన్ను కాంట్రవర్సీలోకి లాగొద్దు.

సినిమా మీద కాంట్రవర్సీ ఎందుకు? నన్నెందుకు మీరు ఇష్టానుసారం మాట్లాడుతున్నారు? అసభ్యంగా మాట్లాడితే నేను పడను. నాకు ఫోన్ చేసి బెదిరించడం తప్పు. ఎన్టీఆర్ గాడు.. గీడు అని మాట్లాడవద్దు. మీరు నాతో మాట్లాడిన ప్రతిదీ వాయిస్ రికార్డు చేశాను. ఈ రికార్డులన్నీ నారా రోహిత్ అన్నకు పంపినా. నాకు నీవు ఏమైనా అర్ధ రూపాయి ఇచ్చినావా? ఏడాది దాటింది. ఒక్క పని ఇచ్చావా? చిన్న సహాయం చేశావా? నా మీద నీకేం హక్కుంది మాట్లాడేందుకు? నన్ను చంపుతావా.. చంపు. నన్ను చంపావంటే మా వాళ్లు ఊరికే ఉండరు. నువ్వు నోరు జారినావంటే బాగుండదు’ అని గుత్తా ధనుంజయ నాయుడు ఎమ్మెల్యేకు పంపిన వాయిస్ రికార్డులో పేర్కొన్నారు. దీంతో జూ.ఎన్టీఆర్ అభిమానులు మరింతగా రగిలిపోతున్నారు.