'చంద్రబాబుకు నూటికి సున్నా మార్కులు' | Farmers will give zero marks to chandrababu naidu government, says ysrcp leader Pardhasaradhi | Sakshi
Sakshi News home page

ఎన్టీఆర్ అభిమానులు ఛీ కొడుతున్నారు

Jul 9 2016 12:53 PM | Updated on May 29 2018 2:48 PM

'చంద్రబాబుకు నూటికి సున్నా మార్కులు' - Sakshi

'చంద్రబాబుకు నూటికి సున్నా మార్కులు'

గడప గడపకు వైఎస్ఆర్ సీపీ కార్యక్రమంలో భాగంగా ఏ ఇంటికి వెళ్లినా చంద్రబాబు నాయుడు మోసాలనే చెబుతున్నారని వైఎస్ఆర్ సీపీ నేత పార్థసారధి అన్నారు.

విజయవాడ: గడప గడపకు వైఎస్ఆర్ సీపీ కార్యక్రమంలో భాగంగా ఏ ఇంటికి వెళ్లినా చంద్రబాబు నాయుడు మోసాలనే చెబుతున్నారని వైఎస్ఆర్ సీపీ నేత పార్థసారధి అన్నారు. ఆయన శనివారమిక్కడ మీడియాతో మాట్లాడుతూ ప్రజలు చంద్రబాబు పాలనకు నూటికి సున్నా మార్కులు వేస్తున్నారన్నారు. టీడీపీ కార్యకర్తలు కూడా రుణమాఫీ జరగలేదని ఫిర్యాదు చేస్తున్నారని పార్థసారధి తెలిపారు.

పెన్షన్ల కోతతో వికలాంగులు, వృద్ధులు అవస్థలు పడుతున్నారన్నారు. గ్రీన్ జోన్-3 పేరుతో కృష్ణాజిల్లా రైతులకు చంద్రబాబు వెన్నుపోటు పొడిచారన్నారు. ఇప్పుడు  మచిలీపట్నం డీప్ వాటర్ పోర్టు పేరుతో భూములు లాక్కోవాలని చూస్తున్నారని విమర్శించారు. అవినీతికి వ్యతిరేకంగా టీడీపీలో మరో వర్గం తయారవుతోందని, ఎన్టీఆర్ అభిమానులు అంతా చంద్రబాబు పేరు చెబితే ఛీ కొడుతున్నారన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement