ఓటీటీలో హాలీవుడ్‌ రొమాంటిక్‌ మూవీ.. 20 భాషల్లో స్ట్రీమింగ్‌ | Hollywood Movie Challengers OTT Streaming Now | Sakshi
Sakshi News home page

ఓటీటీలో హాలీవుడ్‌ రొమాంటిక్‌ మూవీ.. 20 భాషల్లో స్ట్రీమింగ్‌

Oct 1 2024 11:13 AM | Updated on Oct 1 2024 1:00 PM

Hollywood Movie Challengers OTT Streaming Now

హాలీవుడ్‌లో ఈ ఏడాదిలో విడుదలైన అమెరికన్ రొమాంటిక్ స్పోర్ట్స్ డ్రామా చిత్రం ఛాలెంజర్స్. లూకా గ్వాడాగ్నినో దర్శకత్వం వహించిన ఈ సినిమా ఏప్రిల్‌ 26న ప్రపంచవ్యాప్తంగా విడుదలైంది. సుమారు ఐదు నెలల తర్వాత ఇప్పుడు ఈ మూవీ ఓటీటీలో స్ట్రీమింగ్‌కు రానుంది. రూ. 450 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ చిత్రం బాక్సాఫీస్‌ వద్ద సుమారుగా వెయ్యి కోట్లు రాబట్టింది.

ఇదీ చదవండి: ఐఫా వేదికపై ఆర్జీవీకి కృతజ్ఞతలు చెప్పిన సందీప్‌ రెడ్డి.. మియా మాల్కోవాపై ఒట్టేసిన వర్మ

హాలీవుడ్‌లో మంచి విజయం సాధించిన చిత్రాలు ప్రాంతీయ భాషలలో విడుదల చేయడం పరిపాటిగానే జరుగుతుంది. ఈ క్రమంలో తాజాగా హాలీవుడ్ రొమాంటిక్ స్పోర్ట్స్ డ్రామాగా తెరకెక్కిన 'ఛాలెంజర్స్' మూవీ ఓటీటీలోకి వచ్చేసింది. హాలీవుడ్‌లో పాపులర్‌ నటిగా గుర్తింపుతెచ్చుకున్న జెండాయ ఈ సినిమాలో ప్రధాన పాత్రలో మెరిసింది. అయితే, ఎలాంటి ముందస్తు ప్రకటన లేకుండానే ఈ మూవీ అమెజాన్‌ ప్రైమ్‌లోకి వచ్చేసింది. తెలుగుతో పాటు ఏకంగా 20 భాషలలో స్ట్రీమింగ్‌కు తీసుకొచ్చింది.

టెన్నిస్ గేమ్ బ్యాక్‍డ్రాప్‍లో ఈ సినిమా కథ సాగుతుంది. టెన్నిస్ ఛాంపియన్‌గా గుర్తింపు తెచ్చుకున్న తాషి (జెండాయా) కోచ్‍గా మారి తన భర్తను ఎలా ఛాంపియన్‌గా తీర్చిదిద్దారనేదే ఈ కథాంశం. ఈ క్రమంలో తాషి మాజీ బాయ్‍ఫ్రెండ్ వారి జీవితాల్లోకి ఎంట్రీ ఇచ్చాక కథ అనేక మలుపులు తిరుగుతుంది. సినిమాలో అక్కడక్కడా కాస్త బోల్డ్‌ సీన్స్‌ ఉంటాయి. కాబట్టి కుటుంబంతో పాటు చూడటం ఇబ్బందిగా ఉండొచ్చు.
 

Advertisement
 
Advertisement
Advertisement