ఈ సినిమా చేయాలంటే దమ్ముండాలి: హీరో | Hero Sree Vishnu Interesting Comments On Swag Movie, Watch Teaser Inside | Sakshi
Sakshi News home page

Sree Vishnu: ఈ సినిమా చేయాలంటే దమ్ముండాలి

Aug 30 2024 10:36 AM | Updated on Aug 30 2024 1:08 PM

Hero Sree Vishnu Comments on Swag Movie

‘‘శ్వాగ్‌’ చాలా గొప్ప కథ. ఇండియన్‌ స్క్రీన్‌పై ఇప్పటివరకూ ఇలాంటి కథ రాలేదు. ఇది మనందరి ఇళ్లలోని కామన్‌ పాయింట్‌ అయినా స్క్రీన్‌పై ఇప్పటి వరకూ రాలేదు. ఇలాంటి కథ నాకు ఇచ్చిన హసిత్‌కి థ్యాంక్స్‌. ‘శ్వాగ్‌’ లాంటి సినిమాలు చేయాలంటే చాలా దమ్ముండాలి.. కథను నమ్మి సినిమా చేసిన విశ్వప్రసాద్‌గారికి కృతజ్ఞతలు’’ అని హీరో శ్రీ విష్ణు అన్నారు. 

శ్రీవిష్ణు హీరోగా హసిత్‌ గోలి దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘శ్వాగ్‌’. రీతూ వర్మ, మీరా జాస్మిన్, సునీల్, దక్షా నగార్కర్, శరణ్య ప్రదీప్‌ ఇతర పాత్రల్లో నటించారు. టీజీ విశ్వప్రసాద్‌ నిర్మించిన ఈ మూవీ త్వరలో విడుదల కానుంది. 

ఈ సినిమా టీజర్‌ లాంచ్‌ వేడుకలో హసిత్‌ గోలి మాట్లాడుతూ– ‘‘తాతలు, ముత్తాతలతో కలిసి చూడగలిగేలా ఉంటుంది’’ అని తెలిపారు. టీజీ విశ్వప్రసాద్‌ మాట్లాడుతూ– ‘‘శ్రీవిష్ణు, హసిత్‌లతో కలసి ‘రాజ రాజ చోర’ సినిమా చేశాను. మా కాంబినేషన్‌లో ‘శ్వాగ్‌’ సెకండ్‌ మూవీ. కమల్‌హాసన్‌గారి ‘ఇంద్రుడు చంద్రుడు’ లాంటి సినిమాలు చూసిన అనుభూతిని ఇస్తుంది’’ అని చెప్పారు.

 

Advertisement
 
Advertisement
Advertisement