సిక్కోలు థియేటర్‌లో కార్తికేయ సందడి, ఆ కొరత ఇన్నాళ్లకు తీరింది..! | Hero Karthikeya Visits Surya Mahal Theatre In Srikakulam - Sakshi
Sakshi News home page

Karthikeya: శ్రీకాకుళంలో మంచి లొకేషన్స్‌ ఉన్నాయి.. ఇక్కడ షూటింగ్‌..

Aug 30 2023 11:04 AM | Updated on Aug 30 2023 11:12 AM

Hero Karthikeya Visits Surya Mahal Theatre in Srikakulam - Sakshi

శ్రీకాకుళం జిల్లాలో కూడా మంచి లొకేషన్‌లు ఉన్నాయని, అవకాశం వచ్చినపుడు ఇక్కడ కూడా తప్పకుండా షూటింగ్‌ చేస్తామన్నారు. మంచి కథలను ఒక్కొక్కటిగా ఎంచుకుని

బెదురులంక సినిమా యూనిట్‌ సిక్కోలులో సందడి చేసింది. శ్రీకాకుళంలోని సూర్యమహల్‌ థియేటర్‌కు వచ్చిన హీరో కార్తికేయ సినిమాను విజయవంతం చేసినందుకు ప్రేక్షకులకు ధన్యవాదాలు తెలిపారు. మంచి సినిమాను ఎప్పుడూ ఆదరిస్తారని తెలుగు ప్రేక్షకులు మరోసారి రుజువు చేశారన్నారు. గతంలో ఆర్‌ఎక్స్‌ 100 సినిమా ప్రమోషన్‌లో భాగంగా శ్రీకాకుళం వచ్చానని, ఇపుడు బెదురులంక సినిమా ప్రమోషన్‌లో భాగంగా ఇక్కడకు మళ్లీ వచ్చానని చెప్పారు.

తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాల్లో బెదురులంక సినిమా షూటింగ్‌ జరిగిందని పేర్కొన్నారు. శ్రీకాకుళం జిల్లాలో కూడా మంచి లొకేషన్‌లు ఉన్నాయని, అవకాశం వచ్చినపుడు ఇక్కడ కూడా తప్పకుండా షూటింగ్‌ చేస్తామన్నారు. మంచి కథలను ఒక్కొక్కటిగా ఎంచుకుని చిత్రాలు చేయడం జరుగుతుందన్నారు. అల్లు అర్జున్‌కు జాతీయస్థాయి అవార్డు రావడం గర్వంగా ఉందన్నారు.

తెలుగు సినిమాకు జాతీయస్థాయిలో బెస్ట్‌ యాక్టర్‌ అవార్డు లేదనే కొరత ఉండేదని, అది ఇన్నాళ్లకు ఇలా తీరిందన్నారు. ఈ కార్యక్రమంలో సూర్యమహల్‌ యాజమాన్యం ధనంబాబు, నాగరాజు, మేనేజర్‌ నాగభూ షణం తదితరులు ఉన్నారు.

చదవండి: పెళ్లైన హీరోలతో ప్రేమాయణం.. 48 ఏళ్ల వయసులోనూ సింగిల్‌గానే..

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement