గగనపు అంచులు తాకుతూ..
చలి కాస్త తగ్గాలి. చలిమంటలు పెరగాలి. రంగవల్లులు మెరవాలి. భోగిమంటకు రంగం సిద్ధం కావాలి. అంతేనా.. హరిదాసులు రావాలి. హరినామ సంకీర్తనలు పాడాలి. సంకురాతిరికి సంకేతాలు ఇవన్నీ. వీటన్నింటి కంటే ముందు ఓ గాలిపటం గగనపు అంచును తాకాలి. వృక్షాల కొమ్మలపై కొత్త అతిథుల్లా తెగిన గాలిపటాలు వచ్చి విశ్రాంతి తీసుకోవాలి. తలెత్తి చూసినప్పుడు అక్కడక్కడా పతంగులు ప్రాణం లేని పక్షుల్లా గాలివాటానికి ఎగురుతూ కనిపించాలి. అదీ అసలు సిసలు సంక్రాంతి. రెక్కలు తెంపుకోవాలనే ఉత్సాహంతో గగనపు వీధుల్లోకి వెళ్లాలనుకునే పతంగులు ఓ వైపు, తాడు తెగాక దారీ తెన్నూ తెలీక గాలివాటంగా ఎగిరే గాలిపటాలు మరోవైపు, పిల్లాడి చేతి నుంచి ఎప్పుడెప్పుడు ఎగిరిపోదామా అని చూసే కైట్‌లు ఇంకోవైపు. ఒకప్పుడంటే కష్టపడి ఇళ్లలోనే గాలిపటాలు తయారు చేసుకునేవారు. కానీ ఇప్పుడు వేలాది డిజైన్లలో మాంజాలతో సహా గాలిపటాలు అందుబాటులో లభిస్తున్నాయి. రూ.20 నుంచి మొదలుపెట్టి రూ.500 వరకు రకరకాల గాలిపటాలు దొరుకుతున్నాయి. విభిన్న ఆకృతులతో పతంగులు ఆకట్టుకుంటున్నాయి.
– శ్రీకాకుళం కల్చరల్/ శ్రీకాకుళం క్రైమ్
పండగ
సందడి
గాలిపటాలు ఎగరేస్తా..
నా చిన్నతనం నుంచి పండగ సమయంలో గాలి పటాలు ఎగురవేయడం అలవాటు. విభిన్న రకాల గాలిపటాలు సేకరించి పండగ సెలవుల సమయంలో రోజు స్నేహితుల కలసి ఎగరేస్తాం.
– సాయికిరణ్, వాంబే కాలనీ
విక్రయాలు బాగున్నాయి..
పండగను బట్టి మార్కెట్‌లో కావాల్సిన వస్తువులను అమ్ముతాం. సంక్రాంతి పండగను పురస్కరించుకొని వివిధ రకాల గాలిపటాలు, బొమ్మలు తీసుకొచ్చాం. చాలా మంది కొనుక్కొని వెళ్తున్నారు.
– దాస్యం రాంబాబు, షాపు ఓనర్
గగనపు అంచులు తాకుతూ..
గగనపు అంచులు తాకుతూ..
గగనపు అంచులు తాకుతూ..
గగనపు అంచులు తాకుతూ..
గగనపు అంచులు తాకుతూ..


