డ్వాక్రా సంఘాలకు సీ్త్రనిధి రుణాలు
జి.సిగడాం: అర్హులైన మహిళా సంఘాల సభ్యులకు సీ్త్ర నిధి పథకం ద్వారా ప్రత్యేక రుణాలను మంజూరు చేస్తున్నట్లు సీ్త్ర నిధి ఏజీఎం సత్యనారాయణ తెలిపారు. శుక్రవారం జి.సిగడాంలోని కార్యాలయంలో ఎంఎంఎస్ అధ్యక్షురాలు శీర్రా లక్ష్మి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ బ్యాంకు ద్వారా తీసుకున్న రుణాలను సక్రమంగా చెల్లించిన సంఘాలకు ప్రత్యేక రుణాలు మంజూరు చేస్తామన్నారు. ఇప్పటికే అర్హులైన సంఘాలను గుర్తించి వారికి స్వయం ఉపాధి కోసం రుణాలు విడుదల చేశామన్నారు. వీటితో వివిధ రకాల వ్యాపారాలను నెలకొల్పి ఆర్థిక స్వావలంబన సాధించాలన్నారు. కార్యక్రమంలో ఏపీఎం రెడ్డి రామకృష్ణంనాయుడు, సీ్త్ర నిధి మేనేజర్ ఉదయ్‌కిరణ్ తదితరులు పాల్గొన్నారు.


