వ్యక్తి ఆత్మహత్య
రణస్థలం: మండలంలోని మెంటాడ గ్రామానికి చెందిన సాడి సూరిరెడ్డి (33) ఇంటి దగ్గర విషం తాగి ఆత్మహత్యకు పాల్పడి, చికిత్స పొందుతూ మృతి చెందినట్లు జేఆర్‌పురం పోలీసులు తెలిపారు. చెడు వ్యసనాలకు బానిసై తరుచూ ఇంటి వద్ద గొడవపడుతున్న సూరిని శనివారం మధ్యాహ్నం కుటుంబ సభ్యులు మందలించారు. దీంతో మనస్థాపానికి గురై పాయిజిన్ తాగా డు. అపస్మారక స్థితిలో ఉన్న అతడిని ఆటోలో రణస్థలం సీహెచ్‌సీకి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ మరణించాడు. మృతుడికి భార్య హేమలత, ఒక కుమారుడు, కుమార్తె ఉన్నారు. భార్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు జేఆర్‌పురం ఎస్‌ఐ ఎస్.చిరంజీవి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు.


