టెక్కలిలో మాజీ మంత్రి ధర్మాన పర్యటన
టెక్కలి: మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు శనివారం టెక్కలి మండలంలో పర్యటించారు. దీంట్లో భాగంగా టెక్కలి నియోజకవర్గంలో వైఎస్సార్‌సీపీ బలోపేతానికి చేపట్టాల్సిన కార్యక్రమాలపై నాయకులు, కార్యకర్తలకు దిశా నిర్దేశం చేశారు. ముందుగా వైఎస్సార్‌సీపీ టెక్కలి నియోజకవర్గ ఇన్‌చార్జి పేరాడ తిలక్, జెడ్పీటీసీలు దువ్వాడ వాణి, పాల వసంత్‌రెడ్డి, ఎంపీపీలు ఆట్ల సరోజనమ్మ, నడుపూరు శ్రీరామ్ముర్తి తదితరులు తెంబూరు రోడ్డులో స్వాగతం పలికారు. అనంతరం రాధావల్లభాపురం గ్రామంలో వైఎస్సార్‌సీపీ నాయకుడు కిల్లి అజయ్‌కుమార్ ఇంటికి వెళ్లారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కక్షపూరితంగా క్రషర్ మూసివేతపై మాజీ మంత్రి ఎదుట బాధిత యజమాని అజయ్‌కుమార్ ఆవేదన వ్యక్తం చేశారు. అనంతరం ఇటీవల విశాఖపట్టణం సాక్షి రిపోర్టర్ దుక్క మురళీకృష్ణారెడ్డి మృతి చెందడంతో వారి కుటుంబాన్ని, టెక్కలి దివంగత మాజీ ఎంపీపీ తిర్లంగి జానకిరామయ్య కుటుంబాన్ని పరామర్శించారు. అనంతరం జెడ్పీటీసీ దువ్వాడ వాణి ఇంట్లో నాయకులు, కార్యకర్తలతో భేటీ అయ్యారు. కార్యక్రమంలో మండల కన్వీనర్లు హెచ్.వెంకటేశ్వరరావు, ఎస్.హేమసుందర్‌రాజు, టి.పాల్గుణరావు, మాజీ ఎంపీపీ సంపతిరావు రాఘవరావు, నాయకులు కుర్మాన బాలకృష్ణ, సత్తారు సత్యం, అన్నెపు రామారావు, టి.కిరణ్, వై.చక్రవర్తి, కె.ధర్మారావు, జి.గురునాథ్ యాదవ్, ఆర్.మల్లయ్య, ఎన్.భీమారావు, వై.మన్మథరావు, కె.రవికుమార్‌గాంధీ, ఎస్.ఉషారాణి, ఎ.రాహుల్, రాములమ్మ, పి.లక్ష్మి పి.రవికుమార్‌రెడ్డి, కె.జీవన్, ఆర్.జయమోహన్ తదితరులు పాల్గొన్నారు.


