రాజకీయ కుతంత్రం
న్యూస్‌రీల్
రథసప్తమి ఉత్సవాలకు ముందు నగరపాలక కమిషనర్ ఆకస్మిక బదిలీ కార్పొరేషన్‌లో కొనసాగుతున్న నియంతల పాలన చెప్పిన మాట వినడం లేదన్న సాకుతో బదిలీ చేశారన్న వాదనలు
గిరిజనుల జీవన ప్రమాణాలు మెరుగుపడాలి
శ్రీకాకుళం
ఆదివారం శ్రీ 11 శ్రీ జనవరి శ్రీ 2026
కవిటి: శ్రీకాకుళం డీఈఓ కార్యాలయంలో సీనియర్ సహాయకునిగా పనిచేస్తు న్న కవిటి పట్టణానికి చెందిన తుంగాన శరత్ ఈ నెల 13 నుంచి 18 వరకు ఢిల్లీ లోని ఇందిరాగాంధీ ఇండోర్‌స్టేడియంలో నిర్వహించనున్న ఇండియా ఓపెన్ ఇంటర్నేషనల్ షటిల్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్‌కు అంపైర్‌గా ఎంపికయ్యారు. ఈ మేరకు జిల్లా సంఘానికి ఆదేశాలు అందినట్టు ఆ సంఘం ఉపాధ్యక్షుడు అడ్వకేట్ తమరాల జయరాం ఒక ప్రకటనలో తెలిపారు.
శ్రీకాకుళం పాతబస్టాండ్: ఉత్తరాంధ్ర జిల్లాల ప్రజలకు లోకాయుక్త సేవలను మరింత చేరువ చేసేందుకు రాష్ట్ర ఉప లోకాయుక్త పి.రజని ఈనెల 29, 30 తేదీల్లో విశాఖపట్నంలో ‘క్యాంప్ సిట్టింగ్’ నిర్వహించనున్నారు. మహారాణిపేటలోని జిల్లా పరిషత్ కార్యాలయం వేదికగా రెండు రోజుల పాటు ఈ విచారణ కొనసాగనుంది. ప్రభుత్వ యంత్రాంగంలో పారదర్శక తను పెంచడం, క్షేత్రస్థాయిలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను నేరుగా తెలుసుకోవడమే లక్ష్యంగా ఈ కార్యక్రమాన్ని చేపట్టారు. శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, విశాఖపట్నం, అనకాపల్లి జిల్లాల ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని లోకాయుక్త రిజిస్ట్రార్ ఒక ప్రకటనలో సూచించారు.
శ్రీకాకుళం న్యూకాలనీ: జిల్లాస్థాయి సీనియర్స్ పారా అథ్లెటిక్స్ ఎంపిక పోటీలు ముగిశాయి. శ్రీకాకుళం కోడి రామ్మూర్తి స్టేడియం క్రీడా మైదానంలో స్టీఫెన్ హాకింగ్ పారా స్పోర్ట్స్ అసోసియేషన్ ఆఫ్ శ్రీకాకుళం ఆధ్వర్యంలో శనివారం నిర్వహించిన 7వ జిల్లా స్థాయి పారా అథ్లెటిక్స్ ఎంపిక పోటీలను నిర్వహించారు. సీనియర్స్ విభాగంలో నిర్వహించిన ఈ ఎంపికల్లో 100, 400, 1500 మీటర్ల పరుగు పందా లు, లాంగ్‌జంప్, షాట్‌పుట్, డిస్కస్ త్రో, జావెలిన్ త్రో పోటీలు జరిపారు. వివిధ ప్రాంతాల నుంచి 31 మంది పారా అథ్లెట్స్ హాజరై ప్రతిభ కనబరిచారు. ఇక్కడ ఎంపికై న పారా క్రీడాకారులను 8వ రాష్ట్ర స్థాయి పారా అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్ –2025–26 పోటీలకు పంపించనున్నట్టు స్టీఫెన్ హాకింగ్ పారా స్పోర్ట్స్ అసోసియేషన్ ఆఫ్ శ్రీకాకుళం కార్యదర్శి డి.అచ్యుతరావు, ఎన్.స్రవంతి, మోహన్‌రావు, ఖేలో ఇండియా అథ్లెటిక్స్ కోచ్ శ్రీనివాస్, అథ్లెటిక్స్ కోచ్ యన్.రాజేష్ తదితరులు పాల్గొన్నారు.
సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం :
శ్రీకాకుళం మున్సిపల్ కార్పొరేషన్‌పై రాజకీయ పెత్తనం మితిమీరుతోంది. కీలక నేతల ఆశీస్సులున్న అధికారులు తప్ప మరో అధికారి ఇక్కడ పనిచేయలేని పరిస్థితి ఏర్పడింది. అధికారులు చేయాల్సిన పనిని నేతలే చేస్తామంటున్నారు. కార్పొరేషన్ బడ్జెట్‌తో సంబంధం లేకుండా నిధులు ఖర్చు పెట్టా లని చూస్తున్నారు. కాదూ కూడదంటే కష్టమని అధికారులకు తెగేసి చెప్పేస్తున్నారు. మొండి పట్టు పడితే ఏకంగా బదిలీ వేటు వేస్తున్నారు. తాజాగా మున్సిపల్ కమిషనర్ పీవీవీడీ ప్రసాదరావు ఆకస్మిక బదిలీ వెనక రాజకీయ కారణాలు ఉన్నట్టు తెలుస్తోంది. వారం రోజుల పాటు రథసప్తమి వేడుకలు ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్న సమయంలో కమిషనర్ బదిలీ వెనక రాజకీయ కుతంత్రం ఉందనే అనుమానాలు తలెత్తుతున్నాయి.
జిల్లాలోని ఓ కీలక నేత అనుచరుడు కార్పొరేషన్‌లో ఓ విభాగానికి అధికారిగా ఉన్నారు. ఆయన చెప్పిందే వేదమవుతోంది. తన శాఖ విధులతో పాటు మిగతా శాఖ విధుల్లోనూ వేలు పెడుతున్నారు. చివరికి కాంట్రాక్టర్లకు బిల్లుల చెల్లింపుల విషయంలో తాను చెప్పినట్టు జరిగేలా అజమాయిషీ చెలాయిస్తున్నారు. రెవెన్యూ శాఖలో మరో ఇద్దరు ఉన్నారు. వీరిద్దరు అంతా తామై చక్రం తిప్పుతున్నారు. చె ప్పాలంటే కార్పొరేషన్‌లో నియంతలు ఎక్కువైపోయారు. వీరికి నియోజకవర్గ కీలక నేతతో పాటు జిల్లా కీలక నేత ఆశీస్సులు ఉన్నాయి. ఈ నేపథ్యంలో కమిషనర్ డమ్మీ అయిపోయిన పరిస్థితి నెలకొంది. వీరి అజమాయిషీని కమిషనర్ తీవ్రంగా వ్యతిరేకిస్తున్నట్టు సమాచారం. ఇదే సమయంలో రథసప్తమి వేడుకలు సమీపించాయి. కార్పొరేషన్ నిధుల నుంచి ఖర్చు పెడుతున్నారు.
గత ఏడాదికి సంబంధించిన రథసప్తమి వేడుకలకు ఖర్చు చేసిన నిధులే ఇంతవరకు రాలేదు. తాజాగా వారం రోజుల ఉ త్సవాలకు కూడా ఖర్చు పెట్టిస్తున్నారు. ఇదంతా కార్పొరేషన్‌కు గుదిబండగా మారింది. రూ. 36 కోట్లు వరకు లోటు బడ్జెట్ ఉన్న కార్పొరేషన్ నుంచి రథసప్తమి వేడుకలకు నిధులు వెచ్చించలేమన్నట్టుగా ఉన్నతాధికారులకు నివేదిక వెళ్లింది. అటు కార్పొరేషన్ అంతర్గత అధికారుల అజమాయిషీని వ్యతిరేకిస్తుండటం, మరోవైపు రథసప్తమి వేడుకలకు నిధులు ఖర్చు పెట్టలేమన్న నివేదిక వెరసి కమిషనర్‌ను హడావుడిగా బదిలీ చేశారన్న వాదనలు వినిపిస్తున్నాయి.
మున్సిపల్ కార్పొరేషన్‌కు పాలకవర్గం లేకపోవడం వలన 15వ ఆర్థిక సంఘం నుంచి రూ. 25కోట్ల వరకు గ్రాంట్ రాలేదని సమాచారం. అలాగే, రిజిస్ట్రేషన్ శాఖ నుంచి మరో రూ.25కోట్లు రావాల్సి ఉంది. దానికి తోడు గత ఏడాది రథసప్తమి వేడుకలకు ఖర్చు పెట్టిన రూ. 8కోట్లు రీయింబర్స్ కాలే దు. అదేవిధంగా అరసవిల్లి దేవస్థానం కోసం గత ఏడాది ఖర్చు చేసిన రూ. 65లక్షలు ఇప్పటివరకు రాలేదు. అటు ఆదాయం రాక, ఇటు ఖర్చు పెట్టిన సొమ్ము వెనక్కి రాక కార్పొరేషన్ లోటు బడ్జెట్‌లోకి వెళ్లిపోయింది.
ఇంత లోటు బడ్జెట్ ఉండగా, ఒక్కొక్కటీ కూల్చేస్తున్నారు. మరమ్మతుల పేరుతో కూల్చివేతలు చేస్తున్నారు. రథసప్తమి వేడుకలకు మళ్లీ ఖర్చు పెట్టమంటున్నారు. ఇవన్నీ భారమై కూర్చున్నాయి. దాదాపు రూ. 36కోట్లు లోటు ఉన్నట్టు తెలుస్తోంది. ఇదే విషయాన్ని కార్పొరేషన్ అధికారులు ఉన్నతాధికారులకు నివేదించినట్టు తెలిసింది. వేడుకలకు ముందు ప్రతికూలంగా వ్యవహరిస్తున్నారన్న అక్కసుతో పాటు అంతర్గత రాజకీయాలు వెరసి కమిషనర్ బదిలీకి కారణమని తెలుస్తోంది.
పాతపట్నం: గిరిజనుల జీవన ప్రమాణాలు మెరుగుపడాలని ట్రైనీ ఐఏఎస్ అధికారి పృథ్వీరాజ్ అన్నారు. మండలంలోని సోద గ్రామంలో రైతుల కు పట్టాదార్ పాస్ పుస్తకాలను పృథ్వీరాజ్ శనివా రం పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గిరిజన రైతులు ప్రభుత్వం అందించే పథకాలను సద్వినియోగం చేసుకోవాలన్నారు. తహసీల్దార్ ఎన్.ప్రసాదరావు మాట్లాడుతూ సోద రెవెన్యూ పరిధిలో 502మంది రైతులకు పట్టాదారు పాస్ పుస్తకాలను పంపిణీ చేశామన్నారు. కార్యక్రమంలో రీ సర్వే డీటీ సునీల్ కుమార్, ఆర్‌ఐ రవణమ్మ, మండల గ్రామ, వార్డు సచివాలయాధికారి బి.కృష్ణారావు, వీఆర్వోలు, రైతులు తదితరులు పాల్గొన్నారు.
రాజకీయ కుతంత్రం
రాజకీయ కుతంత్రం


