100 ఎకరాలు
న్యూస్‌రీల్
శ్రీకాకుళం
10 మంది..
బోడికొండపై అక్రమాల పర్వం
● 10 మంది ముఠాతో పచ్చనేత కబ్జా
● ఓ మంత్రి అండ చూసుకుని చెలరేగిపోతున్న ఆక్రమణదారులు
● 100ఎకరాలకు పైగా చదును
చేసి ఆక్రమణ
● రిజర్వ్ ఫారెస్టు భూములు సైతం కబ్జా
● 12 నుంచి సమ్మెకు సిద్ధం
● భవ్య సర్వీసెస్ ఏజెన్సీ తీరుపై మండిపాటు
● డిమాండ్ల సాధనకు సిబ్బంది ఉద్యమ బాట
శనివారం శ్రీ 10 శ్రీ జనవరి శ్రీ 2026
మార్కెట్‌లో విక్రయిస్తున్న ఈగల్ కైట్
ఫిర్యాదులు వెళ్లినా..
కొండను ఆక్రమించేస్తున్నారని స్థానికులు గగ్గోలు పెడుతున్నారు. అక్రమంగా చదును చేసిన ప్రాంతానికి వచ్చి ఆందోళన కూడా చేశారు. అంతేకాకుండా కళ్ల ముందే జరుగుతున్న భూ ఆక్రమణల విషయాన్ని ఓ ప్రజాప్రతినిధి దృష్టికి స్థానికులు తీసుకెళ్లడం కూడా జరిగింది. తప్పని పరిస్థితుల్లో స్పందిస్తూ పరిశీలించమని రెవెన్యూ అధికారులకు మౌఖిక ఆదేశాలిచ్చినట్టు తెలిసింది. ఆ మేరకు బెండి కొండపై చదును చేస్తున్న ప్రాంతానికి వెళ్లి చూసేసరికి అధికారులు సైతం ఆశ్చర్యపోయినట్టు సమాచారం.
21న జిల్లా స్థాయి రంగోత్సవ్ పోటీలు
శ్రీకాకుళం: జిల్లా స్థాయి రంగోత్సవ్ పోటీలను జనవరి 21వ తేదీన వమరవెల్లి డైట్ కళాశాలలో నిర్వహించనున్నట్లు జిల్లా విద్యాశాఖ అధికారి ఎ.రవిబాబు తెలిపారు. ఈ మేరకు శుక్రవారం ఆయన ఓ ప్రకటనలో పేర్కొన్నా రు. రంగోత్సవ్ అంటే విద్యార్థులు తమలోని ప్రతిభను స్వేచ్ఛగా, సృజనాత్మకంగా చూపించుకునే వేదిక అని, పిల్లల్లో ఆనందం, ఉత్సాహం పెంచుతూ వారి సమగ్ర అభివృద్ధికి తోడ్పడుతుందని పేర్కొన్నారు.భారత స్వాతంత్య్ర సమరయోధుల చిత్రాలను గీయడం, హ్యాండ్ రైటింగ్ పోటీల్లో తెలుగు లేదా ఇంగ్లి ష్‌లో ఒక పేరాగ్రాఫ్ లేదా ఒక కొటేషన్ రాయడం, వికసిత్ భారత్ అంశంపై 3–4 మంది సభ్యులు రంగోలి రూపొందించడం, పంజాబీ జానపద నృత్యం / ఆంధ్రప్రదేశ్ జానపద నృత్యం (4–5 మంది సభ్యులు), రోల్ ప్లే వికసిత్ భారత్ అంశంపై పోటీలు ఉంటాయి. ప్రభు త్వ, ప్రభుత్వ ఎయిడెడ్, ప్రైవేట్ పాఠశాలలలో 6 నుంచి 8వ తరగతుల విద్యార్థులు రంగో త్సవ్ 2025–2026 లో పాల్గొనవచ్చు. ఒక విద్యార్థి ఒక్క పోటీలో మాత్రమే పాల్గొనాలి. రిజిస్ట్రేషన్ చివరి తేదీ జనవరి 18. జిల్లా స్థాయిలో మొదటి బహుమతి పొందినవారు రాష్ట్ర స్థాయి పోటీలకు వెళ్తారు. సందేహాలకు జీవీ రమణ ఇన్‌చార్జ్ ప్రిన్సిపల్,డైట్, వమరవెల్లి, మొబైల్ నంబర్ 9491813995, ఆశింటి వేణుగోపాలరావు, నోడల్ ఆఫీసర్, డైట్, వమ రవెల్లి, 8985485617ను సంప్రదించాలని సూచించారు.
సోంపేట: బారువ తీరాన్ని పర్యాటకంగా అభివృద్ధి చేస్తామని కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ అన్నారు. శుక్రవారం స్థానిక అధికారులతో కలిసి బారువ తీరాన్ని కలెక్టర్ పరిశీలించారు. బారువ సముద్ర తీరం అభివృద్ధి గురించి చర్చించారు. అనంతరం మూల పొలం బ్రిడ్జి పనులు కలెక్టర్ పరిశీలించారు. ఆర్డీఓ జి.వెంకటేష్, తహసీల్దార్ బి.అప్పలస్వామి, ఎంపీడీఓ ఈశ్వరమ్మ, డిప్యూటీ ఎంపీడీఓ శాంతికుమారి తదితరులు పాల్గొన్నారు.
‘చంద్రబాబు యువతను మోసగించారు’
శ్రీకాకుళం (పీఎన్‌కాలనీ): యువతకు, విద్యార్థులకు ఉద్యోగాలు, నిరుద్యోగ భృతి, ఫీజు రీయింబర్స్‌మెంట్ ఇస్తానని చెప్పిన చంద్రబాబు, లోకేష్‌లు ఇవ్వకుండా మోసగించారని వైఎస్సార్‌సీపీ యువజన విభాగం జిల్లా అధ్యక్షుడు మార్పు పృథ్వీ మండిపడ్డారు. శ్రీకాకుళం నగరంలో అంబేడ్కర్ కూడలి వద్ద విద్యార్థి, యువజన సంఘాల ప్రతినిధులు శుక్రవారం దీనిపై ర్యాలీ నిర్వహించి ఎమ్మార్వో కార్యా ల యం వద్ద ప్రభుత్వ మోసాల్ని ఎండగట్టారు. ఈ సందర్బంగా పృథ్వీ మాట్లాడుతూ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్న వారిపై కేసులు పెడుతున్నారని అన్నారు. వైఎస్సార్‌సీపీ విద్యార్థి విభా గం నాయకులు ముత్తా విజయ్, ఏఐఎస్‌ఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి కొన్న శ్రీనివాస్, యూత్ కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు పూడి కిరణ్ కుమార్, ఏఐఎస్‌ఎఫ్ జిల్లా ఉపాధ్యక్షుడు కె.సాయికుమార్, ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా అధ్యక్షులు కె.చందు, ఏఐవైఎఫ్ జిల్లా అధ్యక్షులు బొత్స సంతో ష్, వైఎస్సార్‌సీపీ యూత్ విభాగం టౌన్ ప్రెసిడెంట్ భరద్వాజ్ మాట్లాడుతూ ఆస్తులు అడగడం లేదని, కేవలం ప్రజలకు ఎన్నికల సమ యంలో ఇచ్చిన మాట నిలబెట్టుకోమంటే అ క్రమంగా జైలుకు పంపడం దుర్మార్గమన్నారు. విశాఖపట్నంలో విద్యార్థి నాయకులపై పెట్టిన అక్రమ రౌడీషీట్లను తక్షణమే ఎత్తివేయాలని డిమాండ్ చేశారు.
సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం:
పలాస నియోజకవర్గంలో భూ ఆక్రమణలు పెచ్చు మీరిపోయాయి. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక కబ్జాదారులు రెచ్చిపోతున్నారు. కొండ భూములు, వాగు లు, కాలువలు, ప్రభుత్వ భూములు, అటవీ భూ ములని చూడకుండా దర్జాగా ఆక్రమించేస్తున్నారు. నియోజకవర్గంలో రోజుకొక ఆక్రమణ వెలుగు చూస్తోంది. పత్రికల్లో పతాక శీర్షికన కబ్జాలు వెలుగు చూస్తున్నాయి. కాశీబుగ్గ టౌన్‌లోనే కాదు పలాస, వజ్రపుకొత్తూరు, మందస మండలాల్లో ఆక్రమణదారులు చెలరేగిపోతున్నారు. ఖాళీ జాగా కనిపిస్తే చాలు గెద్దల్లా వాలిపోతున్నారు. తమ గుప్పెట్లోకి తెచ్చుకుని అధికార దర్పం ప్రదర్శిస్తున్నారు. నియంత్రించాల్సిన అధికారులు నేతల అడుగులకు మడుగులు ఒత్తుతున్నారు.
తాజాగా వజ్రపుకొత్తూరు మండలం పెద్ద బొడ్డపాడు పంచాయతీ పరిధిలోని బెండికొండపై పడ్డారు. ఓ మంత్రి అండ చూసుకుని నందిగాం మండలానికి చెందిన ఓ నాయకుడి నేతృత్వంలో 10 మంది ఏకంగా కొండ భూములతో పాటు రిజర్వ్, సోషల్ ఫారెస్టు భూముల్లో దాదాపు 100 ఎకరాలు కబ్జా చేసేస్తున్నారు. చదును చేయడమే కాకుండా ఏళ్ల నాటి జీడి మొక్కలు తొలగించేసి, కొత్తగా మొక్కలు నాటే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు.
రిజర్వ్ ఫారెస్టు భూములు సైతం..
ఈ కొండకు ఆనుకుని 84.36 హెక్టార్ల మేర రిజర్వ్ ఫారెస్టు భూములు ఉన్నాయి. వాటిని కూడా కబ్జాదారులు వదల్లేదు. ఆ భూములను కూ డా చదును చేసేసి తమ అనుభవంలోకి తెచ్చుకుంటున్నారు. ఇంత జరుగుతున్నా సంబంధిత అధికారులు చూసీ చూడనట్టు వ్యవహరిస్తున్నారు. దీంట్లో వారి ప్రమే యం కూ డా ఉందన్న ఆరోపణలు ఉన్నాయి. కళ్ల ముందు పొక్లెయినర్ల సాయంతో ఇష్టారీతిన చదును చేసేస్తున్నా చేష్టలుడిగి చూస్తున్నారు. ముడుపులకు కక్కుర్తి పడి ఆక్రమణలపై చోద్యం చూస్తున్నారు.
దౌర్జన్యపూరితంగా..
కొండ ప్రాంతంలో ఏళ్ల నాటి పెద్ద పెద్ద జీడిచెట్లు ఉన్నప్పటికీ యంత్రాల సాయంతో తొలగించేస్తున్నారు. చదును చేసిన ప్రాంతంలో కొత్తగా మొక్కలు నాటుతున్నారు. చెప్పాలంటే దౌర్జన్యంగా వ్యవహరిస్తున్నారు. గతంలో ఫారెస్టు అధికారులు రిజర్వు ఫారెస్టు పరిధిలోని భూమలు, తోటలను కాపాడుకునేందుకు ట్రెంచ్‌లను ఏర్పాటు చేయగా వాటిని తొలగించి, జీడిచెట్లు, కంకరతో పూడ్చేస్తున్నా రు. ముందున్న ఆనవాళ్లు లేకుండా పథకం ప్రకారం యంత్రాల సాయంతో చదును చేసేసి, వందల ఎకరాలను వశం చేసుకునేందుకు యత్నిస్తున్నారు.
శ్రీకాకుళం న్యూకాలనీ: సంక్రాంతి సంబరాల్లో భాగంగా జిల్లా క్రీడా ప్రాధికార సంస్థ ఆధ్వర్యంలో ఈ నెల 12వ తేదీన జిల్లా స్థాయి సంప్రదాయ క్రీడల పోటీలు జరగనున్నాయి. జిల్లా కేంద్రంలోని కోడి రామ్మూర్తి స్టేడియం వేదికగా పోటీలు జరగనున్నాయి. సోమవారం ఉదయం 9 గంటల నుంచి పోటీలు మొదలవుతాయని డీఎస్‌డీఓ ఎ. మహేష్‌బాబు తెలిపారు. ఈ పోటీల్లో భాగంగా మహిళలకు స్కిప్పింగ్, తొక్కుడు బిళ్ల పోటీలు జరగనుండగా, పురుషులకు 7 పెంకులాట, గాలిపటాల పోటీలు నిర్వహిస్తామని చెప్పారు. అలాగే పురుషులు, మహిళలకు కర్రసాము, టగ్ ఆఫ్ వా ర్ ఉంటాయని, వివరాల కోసం 93903 52942, 7680075375 నంబర్లను సంప్రదించాలన్నారు.
108
సిబ్బంది
అరసవల్లి: ఆపత్కాలంలో కోట్లాది మందిని ఆదుకున్న 108 ఇప్పుడు కష్టాల్లో పడింది. తమ డిమాండ్లు నెరవేర్చాలని కోరుతూ 108 సిబ్బంది సమ్మె సైరన్ మోగించారు. ఇటీవలే 104 వాహనాల సి బ్బంది కూడా సమస్యల డిమాండ్లు కోరుతూ నిర్వహణ సంస్థ చూపిస్తున్న నిర్లక్ష్య ధోరణిని ఖండిస్తూ నిరసనలకు దిగారు. తాజాగా 108 వాహనాల సి బ్బంది కూడా సమ్మెకు సై అంటున్నారు. ఈ నెల 12 నుంచి 108 వాహన సేవల్లో పాల్గొనేది లేదంటూ కలెక్టర్ స్వప్నిల్ దినకర్, డీఎంహెచ్‌ఓ అనితలకు సమ్మె నోటీసులను గురువారం రాత్రి జారీ చేశారు.
కక్ష సాధింపు వల్లనేనా..?
చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి 108 వాహన సిబ్బందికి సమస్యలు మొదలయ్యాయి. తమ సమస్యలను ఎప్పటికప్పుడు విన్నవించుకుంటున్నా గత ఆరు నెలల నుంచి పరిష్కా రం కోసం ప్రయత్నిస్తున్నా, సర్కారు మాత్రం తీవ్ర నిర్లక్ష్యాన్ని ప్రదర్శిస్తోందని 108 వాహన సిబ్బంది విమర్శిస్తున్నారు. గత ఆరు నెలల కిందట ఆందోళనకు దిగినప్పుడు ఉద్యోగులకు ఉత్తుత్తి హామీలను ఇచ్చి కాలం గడిపేసిన చంద్రబాబు సర్కార్ నేటికీ సమస్యల పరిష్కారానికి చర్యలు చేపట్టకపోవడంపై సిబ్బంది తీవ్రంగా తప్పుపడుతున్నారు. సర్కారు వైఖరిపై నిరసనగా సమ్మెకు సన్నద్ధమంటూ అల్టిమేటం జారీ చేశారు. తమ సమస్యలను పరిష్కరించకుంటే ఈనెల 12 నుంచి సమ్మెలోకి వెళ్లనున్నట్లుగా అల్టిమేటంతో కూడిన నోటీసును జిల్లా ఉన్నతాధికారులకు అందజేశారు.
జిల్లాలో ఇదీ పరిస్థితి
జిల్లాలో 30 మండలాలకు 31 వాహనాలు పనిచేస్తున్నాయి. గత కొన్ని నెలల ముందే 11 కొత్త వాహనాలను జిల్లాకు తీసుకువచ్చారు. అయితే అంతకుముందు వాహనాలను మరమ్మతు చేసి కొత్తగా రంగులు వేసి రంగంలోకి దించారని కొందరు డ్రైవర్లు ఆరోపిస్తున్నారు. నిర్వహణ సంస్థ వాహనాల ఫిట్‌నెస్‌ను పట్టించుకోకుండా సిబ్బందిపై నెపం తోసేసి చిన్న కారణాలు చూపించి ఉద్యోగం నుంచి తీయించేలా కుట్రలు పన్నుతున్నాయి. 108 వాహనాల్లో పనిచేసే ఈఎంటీలు, పైలెట్లకు రూ.20 వేల నుంచి రూ.30 వేల వరకు వేతనం అందుతుంది. సూపర్‌వైజర్లకు రూ.30 వేలు, మేనేజర్లకు రూ.50 వేలు చెల్లిస్తున్నారు. గతంలో మూడు మాసాల నుంచి వే తనాలను ఇంకా పెండింగ్‌లో ఉంచారు. దీంతో 18 డిమాండ్లతో కూడిన వినతిపత్రాన్ని ఉన్నతాధికారులకు అందజేశారు.
కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్‌కు సమ్మె నోటీసును అందజేస్తున్న 108 వాహన సిబ్బంది
ఆక్రమణల ముఠా..
వజ్రపుకొత్తూరు మండలం పెద్ద బొడ్డపాడు పంచాయతీ పరిధిలోని బెండి, సీతారాంపురం, పెద్దబొడ్డపాడు, కొండవూరు, నారాయణపురం, తోటపల్లి, కొల్లిపాడు, కవిటి గ్రామాల్లో గ్రామాలను ఆనుకుని వందల హెక్టార్లలో బెండికొండ ఉంది. దీంట్లో నారాయణపురం, తోటపల్లి, కొల్లిపాడు పరిధిలో ఉన్న కొండ ఆక్రమణకు గురైంది. నందిగాం మండలానికి చెందిన పచ్చనేత ఆధ్వర్యంలో కవిటి, నారాయణపురం, దుంపవానిపేట, కూర్మనాథపురం, తోటపల్లి గ్రామానికి చెందిన 10 మంది పెద్ద ఆక్రమణలకు ఒడిగట్టారు. కూటమి ప్రభుత్వం రాగానే బరితెగించారు. కబ్జాదారులంతా ఒక ముఠాగా తయారై కొండ భూములను కొట్టేస్తున్నారు. గతంలో అక్కడిచ్చిన డీ పట్టాల ముసుగులో కొండంతా ఆక్రమించేస్తున్నారు. దాదాపు 100 ఎకరాల వరకు ఇప్పటికే తమ గుప్పెట్లోకి తెచ్చుకున్నారు.
100 ఎకరాలు
100 ఎకరాలు
100 ఎకరాలు
100 ఎకరాలు
100 ఎకరాలు
100 ఎకరాలు


