పౌష్టికాహారంతో సంపూర్ణ ఆరోగ్యం
శ్రీకాకుళం న్యూకాలనీ: మహిళలు ఆరోగ్యవంతంగా ఉండాలంటే నాణ్యమైన పౌష్టికాహారాన్ని తీసుకోవాలని డాక్టర్ బి.రజని అన్నారు. శ్రీకాకుళం ప్రభుత్వ పురుషుల డిగ్రీ కళాశాలలో ఉమెన్ ఎంపవర్‌మెంట్ సెల్, రెడ్ రిబ్బన్ క్లబ్ సంయుక్త ఆధ్వర్యంలో శుక్రవారం మహిళల ఆరోగ్య సమస్యలపై అవగాహన సదస్సు నిర్వహించారు. కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ యాళ్ల పోలినాయుడు అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో ఆమె మాట్లాడుతూ మహిళల ఆరోగ్య సమస్యలతోపాటు థైరాయిడ్ వంటి హార్మోన్‌ల అసమతౌల్య సమస్యలకు గల కారణాలు, వాటి పరిష్కార మార్గాలను వివరించారు. కార్యక్రమంలో కళాశాల వైస్ ప్రిన్సిపాల్ డాక్టర్ రోణంకి హరిత, ఐక్యూఏసీ కో–ఆర్డినేటర్ డాక్టర్ జి.రాజశేఖర్, రెడ్ రిబ్బన్ క్లబ్ కో–ఆర్డినేటర్ డి.రవీంద్ర, ఉమెన్ అండ్ పవర్‌మెంట్ సెల్ కన్వీనర్ అరుణకుమారి, అధ్యాపకులు పాల్గొన్నారు.


