ఖ్యాతి పెంచేలా..
రథసప్తమి ఉత్సవం
యోగాసనం
అదరహో
అరసవల్లి: అరసవల్లి పుణ్యక్షేత్ర ఖ్యాతి మరింత వ్యాప్తి చెందేలా రథసప్తమి మహోత్సవాలకు జిల్లా కేంద్రంలో ఏర్పాట్లు చేస్తున్నామని, ఈ అధికారిక రాష్ట్ర పండుగను ఏడు రోజుల పాటు అత్యంత వైభవంగా జరి గేలా చర్యలు చేపడుతున్నామని కలెక్టర్ స్వప్నిల్ దినకర్ తెలియజేశారు. శుక్రవారం రథసప్తమి ఉత్సవ ఏర్పాట్లకు కర్టన్‌రైజర్‌గా నిర్వహించిన సామూహిక సూర్యనమస్కారాల కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యే గొండు శంకర్‌తో కలిసి కలెక్టర్ పాల్గొన్నారు. ఇంద్రపుష్కరిణి మార్గ్‌లో సుమారు 200 మంది పాల్గొన్న సూర్యనమస్కారాల ప్రక్రియలో కలెక్టర్ స్వప్నిల్ దినకర్, జాయింట్ కలెక్టర్ ఫర్మాన్ అహ్మద్, ఎమ్మెల్యే గొండు శంకర్, ఆలయ ఈఓ కేన్‌వీడీవీ ప్రసాద్‌లు స్వయంగా ఆసనాలను వేశారు. ఈ సందర్భంగా రథసప్తమి ఉత్సవ ప్రచారానికి ప్రత్యేకంగా ఏడు గుర్రాలతో వాహనాన్ని కలెక్టర్ ప్రారంభించారు. అనంతరం మాట్లాడుతూ ఈనెల 19 నుంచి 25 వరకు రథసప్తమి మహోత్సవాలు జరగనున్నాయని, ఏడు రోజులు ఈ ప్రచార రథం గ్రామగ్రామాన తిరుగుతుందన్నారు. రానున్న 10 రోజుల పాటు జిల్లాలో అన్ని పాఠశా లలు, కళాశాలలు, నివాస సముదాయాల ప్రాంగణాల్లో సూర్య నమస్కారాలను చేయించాలని ఆదేశించారు. ఈ సందర్భంగా నేషనల్ యోగా ప్లేయర్ రసజ్ఞ రాజహంసను కలెక్టర్ అభినందించారు. ఎమ్మెల్యే శంకర్ మాట్లాడుతూ ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాలలో భారీ ఎగ్జిబిషన్, ఎన్టీఆర్ గ్రౌండ్స్‌లో ఫుడ్ ఫెస్టివల్, కేఆర్ స్టేడియంలో ప్రసిద్ధ ఆలయాల నమూనాల ఏర్పాటు, సాంస్కృతిక కార్యక్రమాలు, 5 వేల మందితో సూర్యనమస్కారాలు నిర్వహణకు ఏర్పాట్లు చేస్తున్నామన్నారు.
రథసప్తమి ప్రచారానికి
సప్తాశ్వాలతో రథం
ఖ్యాతి పెంచేలా..
ఖ్యాతి పెంచేలా..
ఖ్యాతి పెంచేలా..


