'పెళ్లి తర్వాత అదొక్కటే మారింది'.. హన్సిక ఆసక్తికర కామెంట్స్! | Hansika Interesting Comments About Her life after Marriage | Sakshi
Sakshi News home page

Hansika: 'ఆ గుర్తింపు కోసం కష్టపడ్డా.. అందుకే మార్చలేదు'.. హన్సిక ఆసక్తికర కామెంట్స్!

Nov 9 2023 9:05 PM | Updated on Nov 9 2023 9:31 PM

Hansika Interesting Comments About Her life after Marriage - Sakshi

దేశముదురు భామ, హీరోయిన్ హన్సిక ప్రస్తుతం మై నేమ్ ఈజ్ శృతి అనే చిత్రంతో ప్రేక్షకులను పలకరించనున్నారు. పెళ్లి తర్వాత సినిమాలతో బిజీ అయిపోయిన ముద్దుగుమ్మ. ఇటీవలే మై 3 అనే వెబ్‌ సిరీస్‌తో ఓటీటీలోనూ ఎంట్రీ ఇచ్చింది. ఈ సిరీస్‌ హాట్‌స్టార్‌లో స్ట్రీమీంగ్‌ అవుతూ విశేష ఆదరణ పొందుతోంది. ప్రస్తుతం తమిళంలో నటిస్తున్న గార్డియన్‌, తెలుగులో నటిస్తున్న మై నేమ్‌ ఈజ్‌ శృతీ చిత్రాలతో బిజీగా ఉన్నారు. తన ప్రియుడితో పెళ్లి తర్వాత హన్సిక వరుస సినిమాలతో దూసుకెళ్తోంది. తాజాగా  మై నేమ్‌ ఈజ్‌ శృతీ ప్రమోషన్లలో పాల్గొన్న హన్సిక పెళ్లి గురించి ఆసక్తికర కామెంట్స్ చేసింది. పెళ్లి తర్వాత తన జీవితంలో పెద్దగా మార్పులు ఏం రాలేదని చెప్పుకొచ్చింది. 

హన్సిక మాట్లాడుతూ.. ' సోహైల్‍తో పెళ్లయ్యాకం నా లైఫ్ పెద్దగా ఏం మారలేదు. సినిమా షూటింగ్‌ సమయంలో క్యారెక్టర్‌లో ఉంటాను. ఇంటికెళ్లాక నా భర్తతో ఎక్కువ టైం కేటాయిస్తాను. అలాగే పెళ్లి తర్వాత కేవలం నా అడ్రస్ మాత్రమే మారింది. అంతే తప్ప నా ఇంటి పేరులో ఎలాంటి మార్పులేదు. హన్సిక మోత్వానీ అనే గుర్తింపు కోసం చాలా కష్టపడ్డా. అందుకే ఇంటి పేరును అలాగే ఉంచా.'  అంటూ వివరించింది. 

'మై నేమ్ ఈజ్ శ్రుతి అనే చిత్రం మాఫియా బ్యాక్‌‌‌‌డ్రాప్‌‌‌‌లో శ్రీనివాస్ ఓంకార్ తెరకెక్కించారు. ఈ చిత్రాన్ని బురుగు రమ్య ప్రభాకర్ నిర్మించారు.  ఈ చిత్రంలో  మురళీశర్మ, నరేన్, జయప్రకాష్, సీవీఎల్ నరసింహారావు  ముఖ్యపాత్రలు పోషించారు. కాగా.. ఈ చిత్రాన్ని  తెలుగు, తమిళ, హిందీ భాషల్లో నవంబర్ 17న రిలీజ్ చేయనున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement