'పురుషులపై అఘాయిత్యాలు.. సినిమా తీయండి సార్'.. ది గర్ల్‌ఫ్రెండ్‌ డైరెక్టర్‌కు విజ్ఞప్తి | The girl friend director Rahul Ravindran reply to anetizwen goes viral | Sakshi
Sakshi News home page

Rahul Ravindran: 'ది గర్ల్‌ఫ్రెండ్‌.. పురుషులపై కూడా తీయండి సార్'.. డైరెక్టర్‌కు విజ్ఞప్తి

Jun 26 2026 7:30 AM | Updated on Jun 26 2026 11:01 AM

The girl friend director Rahul Ravindran reply to anetizwen goes viral

ప్రముఖ దర్శకుడు, నటుడు రాహుల్ రవీంద్రన్‌కు ఊహించని ప్రశ్న ఎదురైంది. ఆయన తెరెకెక్కించిన ది గర్ల్‌ఫ్రెండ్ మూవీని తరహాలో మరో సినిమా తీయాలంటూ ఓ నెటిజన్‌ కోరాడు. ఇటీవల పుణెలో జరిగిన కేతన్ అగర్వాల్ ఎపిసోడ్‌ను ఉద్దేశించి ఓ సినిమా తీయండి సార్ అంటూ రాహుల్‌ రవీంద్రన్‌ను ట్యాగ్‌ చేశారు. ఎలాగైతే ది గర్ల్‌ఫ్రెండ్‌ సినిమా తీశారో.. అలాగే పురుషులపై మహిళలు చేసే అఘాయిత్యాలపై ఒక మూవీ తీయాలని నెటిజన్ కోరాడు.

దీనికి రాహుల్ రవీంద్రన్‌ సుదీర్ఘమైన రిప్లై ఇచ్చారు. అయితే నాకు మాత్రమే అన్ని తెలుసని చెప్పడం నాకు ఇష్టం లేదన్నారు. పురుషులపై’ ‘మహిళలు’ చేసే అఘాయిత్యాలను నేను అస్సలు చూడనన్నారు. కానీ సమాజంలో వ్యతిరేక ప్రవర్తన కలిగిన మహిళలు ఘోరమైన నేరాలకు పాల్పడటం నేను చూస్తున్నానని రాహుల్ ‍తెలిపారు. తన చుట్టూ ఉన్న మహిళల అనుభవాలతో స్ఫూర్తి పొంది ది గర్ల్‌ఫ్రెండ్‌ మూవీ తీశానని వెల్లడించారు.

అయితే పుణెలో జరిగిన ప్రత్యేక కేసుకు సంబంధించిన వివరాలను తాను ఇంకా చదవలేదని అన్నారు. కానీ తప్పకుండా చదువుతానని రాహుల్ తెలిపారు. అందులో తాను చెప్పాలనుకునే కథ ఏదైనా దొరికితే..  ఒక మహిళ చేసిన నేరం గురించి సినిమా చేస్తానని వెల్లడించారు. అంతేకానీ మీరు చెప్పారని పురుషులపై మహిళలు చేసే నేరాల గురించి కాదని రాహుల్ క్లారిటీ ఇచ్చారు.

రాహుల్ రవీంద్రన్ తన పోస్ట్‌లో రాస్తూ.. "నేను చూసే విధానంలో తేడా ఉంది. మీరు ఇది గుర్తుంచుకోండి, ఇలాంటి నేర సంఘటనలు చాలా ఘోరం.. దారుణం కూడా. కానీ నేను చేయడానికి ప్రయత్నించేది మాత్రం పూర్తిగా భిన్నమైంది. దానికి అలాంటి నేరాలతో ఎలాంటి సంబంధం ఉండదు. ది గర్ల్‌ఫ్రెండ్‌ మూవీలో విక్రమ్ ఒక హంతకుడు కాదు. అందులో శారీరక హింస లేదు " అని తెలిపారు.

కాగా.. రాహుల్ రవీంద్రన్ డైరెక్షన్‌లో వచ్చిన మూవీ ది గర్ల్‌ఫ్రెండ్‌. ఈ చిత్రంలో రష్మిక, దీక్షిత్ శెట్టి కీలక పాత్రలు పోషించారు. ఈ మూవీలో రష్మిక బాయ్‌ఫ్రెండ్ చేతిలో వేధింపులకు గురవుతుంది. ఆ తర్వాత జరిగే పరిణామానులను ఆమె ఎలా ఎదుర్కొందనే కోణంలో ఈ సినిమా తెరెకెక్కించారు.

నెటిజన్‌కు రాహుల్‌ సమాధానం ఇవ్వడంపై ఆయన సతీమణి, సింగర్ చిన్మయి శ్రీపాద కూడా స్పందించింది. ఇది కూడా చదవండి. రాహుల్ లాంటి వ్యక్తిని చూసుకోండి లేదా పెళ్లి చేసుకోకుండా బాధపడకండి. ఇదే నా ఏకైక సలహా. మిగతాది మీ ఇష్టం, మీ జీవితం ' అంటూ రాసుకొచ్చింది. కాగా.. వీరిద్దరు మే 2014లో వివాహం చేసుకున్నారు. వారికి ద్రిప్తా అనే కుమార్తె, శర్వాస్ అనే కుమారుడు కవల పిల్లలు ఉన్నారు. వీరికి 2022 జూన్ 18న ట్విన్స్ జన్మించారు.
 

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement