నాలుగేళ్లుగా డేటింగ్‌.. నటుడికి బ్రేకప్‌ చెప్పిన నటి.. ఎందుకంటే? Giorgia Andriani says She is Loving Freedom After Breakup with Arbaaz Khan | Sakshi
Sakshi News home page

Giorgia Andriani: స్టార్‌ హీరోయిన్‌ మాజీ భర్తతో నాలుగేళ్లుగా డేటింగ్‌.. బ్రేకప్‌కు అదే కారణమంటూ..

Published Sat, Dec 2 2023 2:26 PM

Giorgia Andriani says She is Loving Freedom After Breakup with Arbaaz Khan - Sakshi

హీరోయిన్‌, ఐటం సాంగ్‌ డ్యాన్సర్‌.. మలైకా అరోరా ప్రస్తుతం అర్జున్‌ కపూర్‌తో ప్రేమలో మునిగి తేలుతోంది. అయితే ఇతడి కంటే ముందు ఆమె జీవితంలో మరో వ్యక్తి ఉన్నారు. అతడే నటుడు అర్బాజ్‌ ఖాన్‌. 1998లో అర్బాజ్‌ను పెళ్లాడిన ఈ బ్యూటీ 2017లో అతడికి విడాకులిచ్చేసింది. తర్వాత ఎవరి దారి వారు చూసుకున్నారు. మలైకా.. అర్జున్‌తో ప్రేమలో పడగా,  అర్బాజ్‌ నటి జియార్జియా ఆండ్రియానిని ప్రేమించాడు. నాలుగేళ్లుగా డేటింగ్‌ చేసుకుంటున్న అర్బాజ్‌- జియార్జియా తాజాగా బ్రేకప్‌ చెప్పుకున్నారు.

ద్వేషపూరిత రిలేషన్‌
ఈ బ్రేకప్‌ గురించి జియార్జియా మాట్లాడుతూ.. 'అతడు (అర్బాజ్‌) నాతో బాగానే ఉన్నాడు. నేను బాధలో ఉన్నప్పుడు కూడా నాకు అండగా నిలబడ్డాడు. అతడి గురించి ఎప్పటికీ నేను చెడుగా అనుకోను. విడిపోయినంత మాత్రాన మొత్తానికే మాట్లాడకుండా ఉండిపోను. విద్వేషపూరిత బంధం(టాక్సిక్‌ రిలేషన్‌షిప్‌)లో ఉన్నప్పుడే అవతలి వ్యక్తిని దూరం పెట్టాలనుకుంటాం. అతడి నీడని కూడా ద్వేషిస్తాం. అతడితో నా రిలేషన్‌ మరీ అంత ద్వేషపూరితమైనది కాదు. కాబట్టి అతడితో పూర్తిగా సంబంధాలు తెంచేసుకోను. మేము ఇద్దరం కూర్చుని మాట్లాడుకున్నాం. అది చాలా కష్టమైన ప్రక్రియ. చివరకు మేమిద్దరం విడిపోవాలని నిర్ణయించుకున్నాం. కానీ ఈ నిర్ణయం తీసుకున్నందుకు మాకు బాధగా ఉంది' అని చెప్పుకొచ్చింది.

స్వేచ్ఛ హరించుకుపోయింది!
బ్రేకప్‌కు గల కారణాల గురించి మాట్లాడుతూ.. అతడు ఏదీ దాచుకోడు. తనకు ఏమనిపిస్తే అదే చేస్తాడు. అది కాదు సమస్య.. నేను బయటకు వెళ్దామని ప్లాన్‌ చేస్తాను.. అతడు మరేదో ప్లాన్‌ చేస్తాడు. అప్పుడు ఇద్దరి మధ్య గొడవ మొదలువుతుంది. ఆ సమయంలో నాకు స్వేచ్ఛ కావాలనిపిస్తుంది. మనసుకు నచ్చింది చేయకపోయినా, నచ్చిన చోటకు వెళ్లలేకపోయినా మన స్వేచ్ఛ హరించుకుపోయినట్లే అనిపిస్తుంది. బ్రేకప్‌ తర్వాత నేను చాలా స్వేచ్ఛగా జీవిస్తున్నాను. నాకు నచ్చినట్లు ఉండగలుగుతున్నాను' అని పేర్కొంది జియార్జియా.

చదవండి: గొడవలు- విడాకులు.. మూడుసార్లు చనిపోయేందుకు ప్రయత్నించా.. సీనియర్‌ హీరోయిన్‌

Advertisement
 
Advertisement
 
Advertisement