మా బిల్డింగ్‌ గురించి రెండు నెలల్లో ప్రకటిస్తాం: మంచు విష్ణు | Free Health Check up Camp for all MAA Members: Vishnu | Sakshi
Sakshi News home page

మా బిల్డింగ్‌ గురించి రెండు నెలల్లో ప్రకటిస్తాం: మంచు విష్ణు

Sep 30 2024 3:15 AM | Updated on Sep 30 2024 3:15 AM

Free Health Check up Camp for all MAA Members: Vishnu

‘‘మేం ఏం అనుకుని వచ్చామో ఆ పనులన్నీ పూర్తి చేశాం. ‘మా’ (మూవీ ఆర్టిస్ట్స్‌ అసోసియేషన్‌) బిల్డింగ్‌ ఒక్కటే బాకీ ఉంది. ఈ అంశంపై కూడా రాబోయే రెండు నెలల్లో ఓ అద్భుతమైన ప్రకటన చేయబోతున్నాం’’ అని ‘మా’అధ్యక్షుడు విష్ణు మంచు అన్నారు. జీవీకే హెల్త్‌ హబ్‌ అసోసియేషన్‌తో ‘మా’ ఆధ్వర్యంలో సభ్యులకు ఫ్రీ హెల్త్‌ చెకప్‌ కార్యక్రమం హైదరాబాద్‌లో జరిగింది. అధ్యక్షుడు మంచు విష్ణు, ఉపాధ్యక్షుడు మాదాల రవి ఈ హెల్త్‌ క్యాంప్‌ను ఏర్పాటు చేశారు.

ఈ హెల్త్‌ క్యాంప్‌లో ‘మా’ సభ్యులు పాల్గొన్నారు. అనంతరం మీడియాతో మంచు విష్ణు మాట్లాడుతూ– ‘‘జీవీకే హెల్త్‌ హబ్‌ యాజమాన్యానికి, డాక్టర్‌ శాస్త్రిగారితో పాటు టీమ్‌ అందరికీ ధన్యవాదాలు. ‘మా’ సభ్యులందరికీ ఉచితంగా హెల్త్‌ చెకప్‌ క్యాంప్‌ నిర్వహించారు’’ అని అన్నారు. ‘‘ఆదివారం వరల్డ్‌ హార్ట్‌ డే. ఆర్టిస్టులు ఎంతో ఒత్తిడితో ఉంటారు. అందుకే వీరి కోసం మాస్టర్‌ చెకప్‌ చేశాం’’ అన్నారు డా. శాస్త్రి. ‘మా’లోని సభ్యుల్లో దాదాపు నాలుగు వందల మంది ఈ హెల్త్‌ క్యాంప్‌లో పాల్గొని, చెకప్‌ చేయించుకున్నారని సమాచారం.

Advertisement
 
Advertisement
Advertisement