ఎఫ్‌2 చిత్రానికి ఇండియన్‌ పనోరమ అవార్డు | F2 wins Indian Panorama 2019 Award | Sakshi
Sakshi News home page

ఎఫ్‌2 చిత్రానికి ఇండియన్‌ పనోరమ అవార్డు

Oct 22 2020 3:56 AM | Updated on Oct 22 2020 3:56 AM

F2 wins Indian Panorama 2019 Award - Sakshi

వెంకటేశ్, వరుణ్‌తేజ్, తమన్నా, మెహరీన్‌లు నటించిన చిత్రం ‘ఎఫ్‌–2’. గతేడాది సంక్రాంతికి విడుదలై సంచలన విజయాన్ని నమోదు చేసుకున్న ఈ చిత్రానికి అనిల్‌ రావిపూడి దర్శకుడు. 2019వ సంవత్సరానికి సంబంధించి ఇంటర్నేషనల్‌ ఫిల్మ్‌ ఫెస్టివల్‌ ఇండియావారు ఎంపిక చేసిన వివిధ భాషల్లోని 26 సినిమాలకు కేంద్ర సమాచార శాఖ అవార్డులను ప్రకటించింది.  ఇండియన్‌ పనోరమ అవార్డుకు ఉత్తమ తెలుగు చిత్రంగా ‘ఎఫ్‌–2’ సినిమాను ఎంపిక చేసింది. ‘‘ఎంటైర్‌ యూనిట్‌కు అభినందనలు’’ అన్నారు చిత్రనిర్మాత ‘దిల్‌ రాజు’. ‘‘ఎఫ్‌2’ సినిమాతో పాటు దర్శకునిగా నాకు అవార్డు వచ్చినందుకు ఎంతో ఆనందంగా ఉంది. వెంకటేశ్, వరుణ్‌తో పాటు ‘ఎఫ్‌2’కి పని చేసిన అందరికీ’ థ్యాంక్స్‌’’ అన్నారు అనిల్‌ రావిపూడి.

Advertisement
 
Advertisement
Advertisement