Extra Ordinary Man OTT: సంక్రాంతికి ఓటీటీలో రానున్న నితిన్‌ సినిమా | Extra Ordinary Man OTT Streaming Plan In Sankranthi | Sakshi
Sakshi News home page

Extra Ordinary Man OTT: సంక్రాంతికి ఓటీటీలో రానున్న నితిన్‌ సినిమా

Jan 5 2024 7:00 PM | Updated on Jan 5 2024 7:23 PM

Extra Ordinary Man OTT Streaming Plan In Sankranthi - Sakshi

నితిన్,  శ్రీలీల జోడీగా నటించిన చిత్రం  'ఎక్స్‌ట్రా - ఆర్డిన‌రి మ్యాన్'. వ‌క్కంతం వంశీ దర్శకత్వం వహించారు. మంచి కామెడీ ఎంటర్‌టైనర్‌ చిత్రంగా డిసెంబర్‌ 8న విడుదలైంది. కానీ ఈ సినిమా బాక్సాఫీస్‌ వద్ద పెద్దగా మెప్పించలేకపోయింది. సినిమాలో ఎక్కవగా కామెడీ ఉన్నప్పటికీ పెద్దగా వర్కౌట్‌ కాలేదని చెప్పవచ్చు. రైటర్‌గా మెప్పించిన వక్కంతం వంశీ.. డైరెక్టర్‌గా మెప్పించలేకపోయాడని చెప్పవచ్చు. ఇలా ఎక్స్‌ట్రా ఆర్డినరి మ్యాన్ సినిమాకు కొంత నెగటివ్‌ టాక్‌ వచ్చింది.

ఇదే సమయంలో నాని నటించిన హాయ్‌ నాన్న చిత్రం కూడా విడుదలై మంచి టాక్‌ రావడంతో నితిన్‌ సినిమా కలెక్షన్స్‌పై కూడా ప్రభావం చూపింది. ఈ చిత్రంలో నితిన్ డిఫరెంట్ షేడ్స్ ఉన్న జూనియర్ ఆర్టిస్ట్‌గా నటించాడు. గత సినిమాలతో పోలిస్తే ఇందులో ఆయన విభిన్నమైన పాత్రలో నటించడం విశేషం. ఈ సంక్రాంతికి   ఎక్స్‌ట్రా ఆర్డినరి మ్యాన్ ఓటీటీలోకి రానుందని సోషల్‌ మీడియాలో ప్రచారం జరుగుతుంది. ఈ చిత్రానికి సంబంధించిన హక్కులను నెట్ ఫ్లిక్స్ సొంతం చేసుకుంది.

సంక్రాంతి సందర్భంగా జనవరి 13న విడుదల కానుందని భారీగా ప్రచారం జరుగుతుంది. కానీ ఈ విషయంపై చిత్ర యూనిట్‌ నుంచి ఎలాంటి అఫిషీయల్ ప్రకటన రాలేదు. ఈ చిత్రంలో ప్రముఖ హీరో రాజశేఖర్ ఒక డిఫరెంట్‌ పాత్రలో కనిపించారు. ఆయనతో పాటు సుధేవ్ నాయర్, రావు రమేష్, రోహిణి, బ్రహ్మాజీ, అజయ్, హర్షవర్ధన్, పవిత్రా నరేష్, హైపర్ ఆది తదితరులు నటించారు.

Advertisement
 
Advertisement
Advertisement