'దృశ్యం-3 తెలుగు రీమేక్.. ఆ ఒక్క కారణంతో ఆపేశాం' | Drishyam 3 Director Jeethu Joseph Clarity On Telugu Remake | Sakshi
Sakshi News home page

Drishyam 3 Movie: 'దృశ్యం-3 తెలుగు రీమేక్.. అందుకే చేయడం లేదు'

Jun 10 2026 2:38 PM | Updated on Jun 10 2026 3:18 PM

Drishyam 3 Director Jeethu Joseph Clarity On Telugu Remake

మలయాళ స్టార్‌ హీరో మోహన్‌ లాల్ నటించిన థ్రిల్లర్ మూవీ దృశ్యం-3. ఈ ఫ్రాంచైజీ నుంచి వచ్చిన మూడో సినిమా కావడం విశేషం. ఈ సినిమాకు జీతూ జోసెఫ్‌ దర్శకత్వం వహించారు. మే 21న థియేటర్లలోకి వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఫర్వాలేదనిపించింది. గతంలో రిలీజైన దృశ్యం, దృశ్యం-2 చిత్రాలను తెలుగులో రీమేక్ చేశారు. వెంకటేశ్ హీరోగా వచ్చిన ఈ సినిమాలు సూపర్ హిట్‌గా నిలిచాయి.

అయితే దృశ్యం-3 మాత్రం తెలుగులో డబ్బింగ్ చేసి మాత్రమే రిలీజ్ చేశారు. ఈ మూవీ రీమేక్ చేయకపోవడంపై సినీ ప్రియులు ప్రశ్నిస్తున్నారు. తెలుగు రీమేక్‌ చేయకపోవడానికి గల కారణాలపై ఆరా తీస్తున్నారు. ఈ నేపథ్యంలో డైరెక్టర్ జీతూ జోసెఫ్ ఆసక్తికర కామెంట్స్ చేశారు. తెలుగు రీమేక్ చేయకపోవడానికి గల కారణాలను వెల్లడించారు. 

దృశ్యం-3 మూవీని తెలుగులో రీమేక్ చేయడం లేదని డైరెక్టర్ జీతూ జోసెఫ్ క్లారిటీ ఇచ్చారు. ఇతర భాషల్లోని హీరోల ఇమేజ్‌‌ దృష్ట్యా ప్రేక్షకులకు ఈ సినిమా క్లైమాక్స్ నచ్చదని ఆయన చెప్పుకొచ్చారు. అయితే హిందీలో మాత్రం రీమేక్ జరుగుతోందని తెలిపారు. ఎందుకంటే బాలీవుడ్ మేకర్స్ ఇప్పటికే రైట్స్ తీసుకున్నారని.. అంతేకాకుండా ఈ మూవీ క్లైమాక్స్ మార్చుకుంటామని మర్యాదపూర్వకంగా అడిగారని వెల్లడించారు. అందుకే తాను రీమేక్‌ చేసేందుకు అంగీకరించినట్లు జీతూ వెల్లడించారు. దీంతో తెలుగు రీమేక్‌పై ఫుల్ క్లారిటీ వచ్చేసింది.

 

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement