కరణ్, ధృవ్ విక్రమ్, నవీన్ యెర్నేని
తెలుగు చలనచిత్ర పరిశ్రమలోని ప్రతిష్టాత్మక నిర్మాణ సంస్థల్లో మైత్రీ మూవీ మేకర్స్ ఒకరు. ఈ నిర్మాణ సంస్థ తమిళంలోనూ సినిమాలు నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా తమిళంలో తమ బ్యానర్‌లో నిర్మిస్తున్న 4వ చిత్రానికి నిర్మాతలు నవీన్ యెర్నేని– రవిశంకర్ యలమంచిలి శ్రీకారం చుట్టారు. ఈ సినిమాలో హీరో విక్రమ్ తనయుడు ధృవ్ హీరో.
కరణ్ అరవింద్ కుమార్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం గురువారం ప్రారంభం అయింది. ముహూర్తపు సన్నివేశానికి దర్శకుడు కీర్తీశ్వరన్ క్లాప్ కొట్టారు. దర్శకులు అధిక్ రవిచంద్రన్, రవికుమార్, కీర్తీశ్వరన్, ఆంటోనీ భాగ్యరాజ్, రాజా, శశి, ‘హాయ్ నాన్న’ ఫేమ్ శౌర్యువ్ ఈ ప్రారంభోత్సవ వేడుకలో పాల్గొన్నారు. ‘‘పూర్తి స్థాయి కమర్షియల్ ఎంటర్‌టైనర్‌గా రూపొందనున్న చిత్రమిది’’ అని చిత్రబృందం పేర్కొంది.


