ఎన్టీఆర్‌ను చిన్నతనంలోనే పక్కన పెట్టడానికి కారణాలున్నాయి: పురందేశ్వరి | Daggubati Purandeswari About Jr NTR Political Entry And Family Issues | Sakshi
Sakshi News home page

ఎన్టీఆర్‌ను చిన్నతనంలోనే పక్కన పెట్టడానికి కారణాలున్నాయి: పురందేశ్వరి

Jun 19 2025 11:41 AM | Updated on Jun 19 2025 2:20 PM

Daggubati Purandeswari About Jr NTR Political Entry And Family Issues

"పుష్ప" సినిమాలో, హీరో పుష్పరాజ్ ఇంటిపేరు కోసం, ఇంటి పేరు లేకపోవడంతో తను ఎదుర్కొన్న అవమానాలపై  పోరాడతాడు. తన పేరు ముందు ఇంటి పేరు రావడం కోసం, జీరో నుండి హీరోగా ఎదిగే క్రమంలో ఎన్నో కష్టాలు ఎదుర్కొంటాడు. ఫైనల్‌గా తనను వెతుక్కుంటూ ఆ ఇంటిపేరు తన గుమ్మం ముందు వాలుతుంది. ఒకరకంగా ఎన్టీఆర్‌ పరిస్థితి కూడా పుష్పరాజ్‌ కథకు దగ్గరగా ఉంటుంది. తారక్‌ను అభిమానించే వారికి ఈ విషయం తెలుసు కూడా! తాజాగా ఇదే అంశం గురించి ఎంపీ దగ్గుబాటి పురందేశ్వరి (Daggubati Purandeswari) పలు విషయాలు పంచుకున్నారు.

దూరం పెరిగింది..
సీనియర్‌ ఎన్టీఆర్‌ కూతురు, ఎంపీ దగ్గుబాటి పురందేశ్వరి తాజాగా ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. తారక్‌ (Jr NTR)ను చిన్నతనంలోనే నందమూరి ఫ్యామిలీకి ఎందుకు దూరం పెట్టారో ఇలా చెప్పారు. ' జూనియర్‌ ఎన్టీఆర్‌ను చిన్నతనంలోనే దూరం పెట్టడానికి అనేక కారణాలు ఉన్నాయి. దానిని పెద్దగా చర్చించాల్సిన అవసరం లేదు.  కారణాలు అయితే ఉన్నాయి. కొంచెం దూరం పెరిగింది. కానీ, ఇప్పుడు అందరం కలిసే ఉంటున్నాం' అని ఆమె చెప్పారు.

(చదవండి: రామోజీ ఫిలిం సిటీ.. రాశీ, తాప్సీలకు అదే భయానక అనుభవాలు)

తారక్‌ మనసులో ఏముంది?
ఇదే సమయంలో జూనియర్‌ ఎన్టీఆర్‌ రాజకీయ ఎంట్రీ గురించి కూడా పురందేశ్వరి మాట్లాడారు.' రాజకీయాల్లోకి తారక్‌ రావాలనుకుంటే వస్తారు. అతనిది ఇంకా చిన్న వయసు. అలాంటప్పుడు పాలిటిక్స్‌లోకి తారక్‌ రావాల్సిన అవసరం ఉందా..? అనేది మనం ప్రశ్నించుకోవాలి. అయితే, రాజకీయాల గురించి తారక్‌ మనసులో ఏముంది..? అనేది నాకు తెలియదు. ఈ విషయం గురించి ఎప్పడు కూడా చర్చించలేదు' అన్నారు.

తారక్‌తో ఇబ్బంది లేదు
గతంలో కూడా జూనియర్‌ ఎన్టీఆర్‌ గురించి ఆమె మాట్లాడిన సందర్భాలు ఉన్నాయి. తారక్‌ తన పిల్లలతో రెగ్యులర్‌గా టచ్‌లో ఉంటాడని పురందేశ్వరి చెప్పారు. తను నటించిన సినిమా విడుదలైతే తప్పకుండా విజయం సాధించాలని కోరుకుంటానని ఆమె అన్నారు. తనను జూ. ఎన్టీఆర్ అత్తా అనే పిలుస్తాడని, తనతో ఎలాంటి ఇబ్బంది లేదని ఆమె పలుమార్లు పంచుకున్నారు.

చదవండి: వాళ్ల కోసం అన్నీ ఇచ్చేశా.. ఒంటరిగా ఉండాలని ఉంది: అభిషేక్‌

Advertisement
 
Advertisement
Advertisement