విమానంలో చోరీ | Sakshi
Sakshi News home page

విమానంలో చోరీ

Published Sat, Feb 24 2024 6:06 AM

Crew: Kareena Kapoor Khan and Tabu and Kriti Sanon new posters release - Sakshi

టబు, కరీనా కపూర్, కృతీసనన్‌ ప్రధాన పాత్రల్లో, దిల్జీత్‌ సింగ్‌ కీలక పాత్రలో నటించిన చిత్రం ‘ది క్రూ’. కార్పొరేట్‌ ఏవియేషన్‌ బిజినెస్‌ నేపథ్యంలో సాగే ఈ సినిమాలో టబు, కరీనా, కృతీ ఎయిర్‌హోస్టెస్‌గా నటించారు. ఓ విమానం హైజాకింగ్, దొంగతనం నేపథ్యంలో ‘ది క్రూ’ సినిమా కథనం ఉంటుందని బీ టౌన్‌ టాక్‌ . ఇక బాలీవుడ్‌లో ‘లూట్‌కేస్‌’ సినిమా తీసిన రాజేష్‌ కృష్ణన్‌ ఈ సినిమాకు దర్శకుడు.

‘వీరే ది వెడ్డింగ్‌ (2018)’, ‘థ్యాంక్యూ ఫర్‌ కమింగ్‌(2023)’ వంటి ఉమెన్‌ సెంట్రిక్‌ ఫిల్మ్స్‌  నిర్మించిన రేఖా కపూర్, ఏక్తా కపూర్‌ ‘ది క్రూ’ సినిమాను నిర్మించారు. తాజాగా ఈ సినిమాలోని ప్రధాన తారాగణం అయిన టబు, కరీనా, కృతీసనన్‌ల కొత్త పోస్టర్స్‌ను రిలీజ్‌ చేశారు మేకర్స్‌. తొలుత ఈ సినిమాను మార్చి 22న రిలీజ్‌ చేయాలనుకున్నారు. ఆ తర్వాత మార్చి 29కి వాయిదా వేసిన సంగతి తెలిసిందే.

Advertisement

తప్పక చదవండి

Advertisement