అమర్‌దీప్‌తో సుప్రీత సినిమా.. గ్లింప్స్‌ రిలీజ్ | CHOWDARY GARI ABBAYI THO NAIDU Gari Ammayi Movie Title Glimpse | Sakshi
Sakshi News home page

'చౌదరి గారి అబ్బాయితో నాయుడు గారి అమ్మాయి' గ్లింప్స్ రిలీజ్

Jun 3 2025 7:21 PM | Updated on Jun 3 2025 7:39 PM

 CHOWDARY GARI ABBAYI THO NAIDU Gari Ammayi Movie Title Glimpse

బిగ్‌బాస్ ఫేమ్ అమర్ దీప్ హీరోగా, సుప్రీత హీరోయిన్‌గా నటిస్తున్న కొత్త సినిమాకు టైటిల్ ఫిక్స్ చేశారు. 'చౌదరి గారి అబ్బాయితో నాయుడు గారి అమ్మాయి' అనే పేరుని నిర్ణయించారు. ఈ క్రమంలోనే గ్లింప్స్ కూడా రిలీజ్ చేశారు. నటి సురేఖావాణి కూతురు సుప్రీత హీరోయిన్‌గా పరిచయమవుతున్న సినిమా ఇది. ఈ క్రమంలోనే తాజాగా మీడియాతో ముచ్చటించిన టీమ్.. చిత్ర విశేషాలని పంచుకుంది.

(ఇదీ చదవండి: కురచ దుస్తులపై కామెంట్స్‌.. సురేఖావాణి ఏమందంటే?)

సినిమా ప్రారంభంలో నాకు భయం వేసింది. కానీ ఇప్పుడు కాన్ఫిడెంట్ మా నిర్మాత నన్ను తన ఇంటి అమ్మాయిలా చూసుకున్నారని సుప్రీత చెప్పుకొచ్చింది. బిగ్ బాస్ నుంచి బయటకు వచ్చాక సినిమా ఎందుకు లేట్ అవుతుంది అని అడుగుతున్నారు, చక్కగా ప్లాన్ చేసుకుని మంచి సినిమాతో రావాలని అనుకున్నాను. అది కుదరడానికి ఇంత సమయం పట్టింది. ఈ సినిమా అందరికీ నచ్చుతుందని అమర్ దీప్ చెప్పుకొచ్చాడు.

(ఇదీ చదవండి: థియేటర్లలో ఉండగానే ఓటీటీలోకి కొత్త సినిమా)

Advertisement
 
Advertisement
Advertisement