వివాదంలో రఘువరన్‌ బీటెక్ నటి.. ! | Chennai Police Files A case Against Actress Saranya Ponvannan | Sakshi
Sakshi News home page

Saranya Ponvannan: రఘువరన్ బీటెక్ నటిపై పోలీసులకు ఫిర్యాదు.. అసలేం జరిగిందంటే?

Apr 1 2024 9:00 PM | Updated on Apr 1 2024 9:26 PM

Chennai Police Files A case Against Actress Saranya Ponvannan - Sakshi

కోలీవుడ్‌ ధనుశ్ నటించిన చిత్రం రఘువరన్‌ బీటెక్. ఈ చిత్రంలో అతనికి జోడీగా అమలా పాల్ నటించింది. ఇంజినీరింగ్ చదివిన నిరుద్యోగుల బాధలను చూపే నేపథ్యంలో తెరకెక్కించిన ఈ సినిమా బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది. ఈ సినిమాలో రఘువరన్‌కు తల్లిగా నటి శరణ్య పొన్వన్నన్‌ నటించారు. అమాయకపు తల్లి పాత్రలో మెప్పించారు. తాజాగా ఆమె ఓ వివాదంలో చిక్కుకున్నట్లు తెలుస్తోంది. 

చెన్నైలోని వారు నివాసముండే విరుంగబాక్కంలో పార్కింగ్‌ గొడవ ఏకంగా పోలీస్‌ స్టేషన్‌ వరకు తీసుకెళ్లింది. పార్కింగ్ విషయంలో పొరుగింటి వారితో వివాదం తలెత్తింది. దీంతో పక్కింటి వారు శరణ్య పొన్వన్నన్‌పై పోలీసులకు ఫిర్యాదు చేశారు. తమను నటి బెదిరించిందని పేర్కొంటూ శ్రీదేవి అనే మహిళ పోలీసులను ఆశ్రయించారు. ఆమె ఫిర్యాదుతో కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభినట్లు తెలుస్తోంది. అయితే శరణ్య రఘువరన్‌ బీటెక్‌తో పాటు 24, వేదం, గ్యాంగ్‌ లీడర్, మహాసముద్రం, ఖుషి లాంటి సినిమాల్లోనూ కనిపించారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement