Bigg Boss 8: నాలుగోవారం సోనియా ఎలిమినేట్‌ | Bigg Boss Telugu 8 Contestants: Soniya Akula Entered As 6th Contestant | Sakshi
Sakshi News home page

Bigg Boss Telugu 8: ఆరో కంటెస్టెంట్‌గా ఆర్జీవీ హీరోయిన్‌

Sep 1 2024 8:20 PM | Updated on Sep 30 2024 3:55 PM

Bigg Boss Telugu 8 Contestants: Soniya Akula Entered As 6th Contestant

వివాదాస్పద దర్శకుడు రామ్‌గోపాల్‌ వర్మను ఇంటర్వ్యూ చేసి, లేదా తన సినిమాల్లో నటించిన బ్యూటీలకు క్రేజ్‌ వేరే లెవల్‌ ఉంటుంది. అలా వర్మ స్కూల్‌ నుంచి అరియానా గ్లోరీ, అషూ రెడ్డి, ఇనయ సుల్తానా గత బిగ్‌బాస్‌ షోలలో పాల్గొన్నారు. ఈసారి వర్మ మెచ్చిన హీరోయిన్‌ సోనియా ఆకుల బిగ్‌బాస్‌ హౌస్‌లో ఎంట్రీ ఇచ్చింది. ఈమె జార్జ్‌ రెడ్డి సినిమాలో జార్జ్‌ రెడ్డి చెల్లిగా నటించింది. 

వర్మ కరోనా వైరస్‌ మూవీలోనూ మెప్పించింది. దిశ ఎన్‌కౌంటర్‌ ఆధారంగా తెరకెక్కిన ఆశా ఎన్‌కౌంటర్‌లోనూ యాక్ట్‌ చేసింది. అంతేకాదు, దిశ అత్యాచార నిందితుడి భార్య రేణుకకు నెలకు రూ.15వేలు సాయం చేయడం విశేషం. సోనియా.. సొంత ఊరు పెద్దపల్లి జిల్లాలోని మంథని. కలెక్టర్‌ కావాలనుకుని యాక్టర్‌ అయింది. సమాజానికి తనవంతు సేవ చేయాలన్న కోరికతో ఆసా అనే సంస్థ ఏర్పాటు చేసింది. సేవలోనే సంతోషాన్ని వెతుక్కుంటున్న ఈ బ్యూటీ బిగ్‌బాస్‌ 8లో రాణిస్తుందేమో చూడాలి!

తను స్టేజీపైకి వెళ్లగానే ఆర్జీవీ వీడియో ప్లే చేశారు. అందులో వర్మ.. నువ్వు బిగ్‌బాస్‌కు వెళ్తున్నందుకు చాలా హ్యాపీ. మనసారా నీకు ఆల్‌ ద బెస్ట్‌ చెప్తున్నాను. నువ్వు కచ్చితంగా గెలుస్తావని ఆశిస్తున్నాను. గెలిచొచ్చాక పార్టీ చేసుకుందాం అని తనకు బూస్ట్‌ ఇచ్చాడు. ప్రారంభంలో స్ట్రాంగ్ కంటెస్టెంట్ లా కనిపించిన సోనియా.. నాలుగోవారమే ఎలిమినేట్ అయి హౌస్ నుంచి బయటకొచ్చేసింది.

Advertisement
 
Advertisement
Advertisement