నెత్తిన పగిలిన బాటిల్స్‌, రైతుబిడ్డ సేఫ్‌.. నామినేషన్స్‌లో ఎవరున్నారంటే? | Bigg Boss Telugu 7: 11th Week Nomination Details - Sakshi
Sakshi News home page

Bigg Boss Telugu 7: రైతుబిడ్డ వర్సెస్‌ అర్జున్‌.. శోభాను చెడుగుడు ఆడుకున్న ఆ ఇద్దరు!

Nov 13 2023 1:34 PM | Updated on Nov 13 2023 1:53 PM

Bigg Boss Telugu 7: 11th Week Nominations Details - Sakshi

నువ్వు ఎప్పుడైనా సొంతంగా ఎవరినైనా నామినేట్‌ చేశావా? అని అడిగాడు. ఇంతలో ప్రశాంత్‌లో అపరిచితుడు బయటకు రాగా.. బరాబర్‌ చెప్తున్నా.. నువ్వు ఓడిపోయా

బిగ్‌బాస్‌ తెలుగు ఏడో సీజన్‌లో మొత్తం 19 మంది కంటెస్టెంట్లు పాల్గొన్నారు. వీరిలో ఇప్పటికే తొమ్మిది మంది ఎలిమినేట్‌ అవడంతో హౌస్‌లో పది మంది మాత్రమే మిగిలారు. వీరందరూ టాప్‌ 5లో కర్చీఫ్‌ వేసేందుకు పోటీపడుతున్నారు. మరికొందరు కప్పు కొట్టుకుపోవాలని తహతహలాడుతున్నారు. ఎవరు ఫినాలేలో అడుగుపెట్టాలి? ఎవరు విజేతగా నిలుస్తారనేది ప్రజల చేతుల్లో ఉంది.

రతికను రెచ్చగొట్టిన శివాజీ
అయితే నామినేషన్స్‌ గండం గట్టెక్కితే కంటెస్టెంట్లు మరికొన్ని వారాలు హౌస్‌లో ఉండొచ్చు. మరి ఈ వారం నామినేషన్స్‌ ఎలా జరిగాయో తెలియజేస్తూ తాజాగా ప్రోమో రిలీజైంది. ఇందులో కెప్టెన్‌ శివాజీ.. నామినేషన్స్‌లో నీ టాలెంట్‌ చూపించు.. అంటూ రతికను రెచ్చగొట్టాడు. ఇంకేముంది.. రతిక రోజ్‌ రెచ్చిపోయింది. ప్రియాంక, శోభలను నామినేట్‌ చేసింది. కెప్టెన్‌ అంటే కేవలం బ్యాడ్జ్‌ పెట్టుకోవడమే కాదు, ఏం చేశావో చెప్పు.. అంటూ శోభా శెట్టిని నిలదీసింది. ప్రియాంకను కూడా ఏదో అడుగుతూ.. నేను అడిగినదానికి సమాధానం చెప్పు అంటూ ఆవేశంతో ఊగిపోయింది.

సొంతంగా నామినేట్‌ చేశావా?
అర్జున్‌ ఎవరూ ఊహించని రీతిలో రైతుబిడ్డను నామినేట్‌ చేశాడు. నువ్వు ఎప్పుడైనా సొంతంగా ఎవరినైనా నామినేట్‌ చేశావా? అని అడిగాడు. ఇంతలో ప్రశాంత్‌లో అపరిచితుడు బయటకు రాగా.. బరాబర్‌ చెప్తున్నా.. నువ్వు ఓడిపోయావ్‌ అంటూ అతడి తలపై బాటిల్‌ పగలగొట్టాడు అర్జున్‌. అలాగే శోభనూ నామినేట్‌ చేశాడు. సోషల్‌ మీడియాలో వస్తున్న వార్తల ప్రకారం.. ఈ వారం కెప్టెన్‌ శివాజీ, పల్లవి ప్రశాంత్‌ మినహా మిగతా అందరూ నామినేషన్‌లో ఉన్నట్లు తెలుస్తోంది. రైతుబిడ్డకు ఒక్క ఓటు మాత్రమే పడటం వల్ల అతడు నామినేషన్స్‌లో లేడని సమాచారం.

చదవండి: బిగ్‌బాస్‌ 7: టాప్‌ 5లో ఉండేది వీళ్లే!

Advertisement
 
Advertisement
Advertisement