ఓటీటీకి వచ్చేసిన టాలీవుడ్ క్రైమ్ థ్రిల్లర్‌.. స్ట్రీమింగ్ ఎక్కడంటే? | Bigg Boss Ambati Arjun Theppa Samudram Movie Released In OTT, Check Streaming Platform Details Inside | Sakshi
Sakshi News home page

Theppa Samudram OTT Release: ఓటీటీకి వచ్చేసిన అంబటి అ‍ర్జున్‌ మూవీ .. స్ట్రీమింగ్ ఎక్కడంటే?

Aug 3 2024 4:15 PM | Updated on Aug 3 2024 5:34 PM

Bigg Boss Ambati Arjun Movie Theppa Samudram Streaming On This Ott

బిగ్‌బాస్ ర‌న్న‌ర‌ప్ అంబ‌టి అర్జున్, చైతన్యరావు హీరోలుగా న‌టించిన చిత్రం 'తెప్ప స‌ముద్రం'. క్రైమ్ థ్రిల్ల‌ర్‌గా తెరకెక్కించిన ఈ మూవీ ఏప్రిల్‌ నెలలో థియేటర్లలో సందడి చేసింది. ఈ  మూవీలో కిశోరి దాత్రక్ హీరోయిన్‌గా కనిపించింది. ఈ చిత్రాన్ని సైకో కిల్ల‌ర్ క‌థాంశంహా సతీష్ రాపోలు దర్శకత్వంతో తెరకెక్కించారు.

తాజాగా ఈ చిత్రం తాజాగా ఓటీటీకి వచ్చేసింది. శనివారం నుంచి ఆహా ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది. తెప్ప స‌ముద్రం అనే ఊరిలో స్కూల్ పిల్ల‌లకు సంబంధించిన వరుస మిస్సింగ్‌ కేసులు నమోదవుతుంటాయి. వాటిని చేధించే కథాంశంతో ఈ సినిమాను తీసుకొచ్చారు.

కాగా.. బిగ్‌బాస్ సీజ‌న్- 7లో అర్జున్ అంబ‌టి  కంటెస్టెంట్‌గా  పాల్గొన్నాడు. టాప్‌-5లో నిలిచిన అంబటి ర‌న్న‌ర‌ప్‌గా నిలిచాడు. అంతేకాకుండా అర్జున్ అంబ‌టి.. దేవ‌త‌, అగ్నిసాక్షితో బుల్లితెర ఫ్యాన్స్‌ను అలరించాడు. లౌక్యం, తీస్‌మార్‌ ఖాన్‌ లాంటి చిత్రాల్లోనూ మెప్పించాడు. 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement