'Bichagadu 2' Movie OTT Release Date, Platform - Sakshi
Sakshi News home page

Bichagadu 2 OTT: ఓటీటీలో 'బిచ్చగాడు 2'.. స్ట్రీమింగ్ డేట్ అదే

Jun 14 2023 12:32 PM | Updated on Jun 14 2023 12:51 PM

Bichagadu 2 OTT Release Date Telugu - Sakshi

తెలుగులో ఎప్పుడు ఏ సినిమా, ఎందుకు హిట్ అవుతుందనేది అస్సలు అంచనా వేయలేం. అలా 2016లో ఎలాంటి ఎక్స్ పెక్టేషన్స్ లేకుండా వచ్చి బ్లాక్‌బస్టర్ సక్సెస్ కొట్టిన మూవీ 'బిచ్చగాడు'. అప్పటివరకు మ్యూజిక్ డైరెక్టర్ గా అందరికీ తెలిసిన విజయ్ ఆంటోని.. ఈ సినిమాతో హీరోగా క్రేజ్ సంపాదించాడు. చాలా సినిమాల‍్లో నటించాడు.

అయితే 'బిచ్చగాడు' సక్సెస్ తర్వాత విజయ్ ఆంటోని చాలా సినిమాలు చేశాడు గానీ ఏవి కూడా పెద్దగా హిట్ కాలేదు. దీంతో తనకు సక్సెస్ ఇచ్చిన 'బిచ్చగాడు' సీక్వెల్ తో ఈ మధ్య ప్రేక్షకుల ముందుకొచ్చాడు. ఫస్ట్ పార్ట్ తో పోలిస్తే.. ఏమంత ఇంట్రెస్టింగ్ గా లేకపోయినప్పటికీ తెలుగులో హిట్ టాక్ సొంతం చేసుకుంది.

తమిళంతో పోలిస్తే తెలుగులో 'బిచ్చగాడు 2'కి మంచి కలెక్షన్స్ వచ్చాయి. చెప్పాలంటే డిస్ట్రిబ్యూటర్స్ లాభాలు సొంతం చేసుకున్నారు. సరే ఇదంతా పక్కనబెడితే కొందరు మూవీ లవర్స్ మాత్రం ఈ సినిమా ఓటీటీలోకి ఎప్పుడొస‍్తుందా అని వెయిట్ చేస్తున్నారు. వారి కోసమా అన్నట్లు తాజాగా ఓటీటీ విడుదల తేదీని ప్రకటించారు. దీని ప్రకారం జూన్ 18 నుంచి హాట్ స్టార్ లో తెలుగు, తమిళ భాషల్లో ఈ చిత్రం స్ట్రీమింగ్ కానుంది. 

(ఇదీ చదవండి: ఇండియాలో టాప్‌ 50 వెబ్‌ సిరీస్‌లు ఇవే! టాప్‌ 5లో ఏమున్నాయంటే?)

Advertisement
 
Advertisement
Advertisement