సాక్ర్‌డ్ గేమ్స్, మీర్జాపూర్, స్కామ్, ద ఫ్యామిలీ మ్యాన్, ఆస్పిరంట్ టాప్ 5 జాబితాలో చోటు దక్కించుకున్నాయి. మరి ఇంకా ఏయే
ఓటీటీల రాకతో ఎంటర్‌టైన్‌మెంట్ డబుల్ అయిందనే చెప్పాలి. కాలక్షేపం కోసం థియేటర్ దాకా వెళ్లనవసరం లేకుండా గడప దాటకుండానే అరచేతిలో కావాల్సినంత వినోదాన్ని అందిస్తున్నాయి ఓటీటీ ప్లాట్‌ఫామ్స్. థియేటర్‌లో రిలీజైన సినిమాలతో పాటు ప్రత్యేకంగా కంటెంట్ క్రియేట్ చేసుకుని మరీ ప్రేక్షకులను అలరిస్తున్నాయి.

ప్రతి వారం కొత్త సినిమాలు లేదా కొత్త వెబ్ సిరీస్‌లతో మస్త్ మజా అందిస్తున్నాయి. దీంతో గడిచిన రెండేళ్లలోనే ఓటీటీ వినియోగదారుల సంఖ్య గణనీయంగా పెరిగింది. వారి అభిరుచికి తగ్గట్లుగానే కామెడీ, క్రైమ్, సస్పెన్స్, థ్రిల్లర్, ఫ్యామిలీ డ్రామా వంటి అన్ని రకాల కంటెంట్‌ను అందిస్తోంది.

ఈ సినిమాలు, సిరీస్‌లపై రివ్యూలు ఇచ్చే ఐమ్‌డీబీ ఇండియాలో టాప్ 50 వెబ్ సిరీస్‌ల జాబితాను విడుదల చేసింది. సాక్ర్‌డ్ గేమ్స్, మీర్జాపూర్, స్కామ్, ద ఫ్యామిలీ మ్యాన్, ఆస్పిరంట్ టాప్ 5 జాబితాలో చోటు దక్కించుకున్నాయి. మరి ఇంకా ఏయే సిరీస్‌లు ఈ లిస్ట్‌లో స్థానం సంపాదించుకున్నాయి? అవి ఏయే ఓటీటీ ప్లాట్‌ఫామ్స్‌లో ఉన్నాయో కింది పట్టికలో చూసేయండి. వాటిలో మీకు నచ్చినవాటిని వీకెండ్‌లో చూసేయండి.
| ర్యాంక్ | వెబ్ సిరీస్ | ఓటీటీ ప్లాట్‌ఫామ్ |
| 1 | సాక్ర్‌డ్ గేమ్స్ | నెట్‌ఫ్లిక్స్ |
| 2 | మీర్జాపూర్ | అమెజాన్ ప్రైమ్ |
| 3 | స్కామ్ 1992 | సోనీలివ్ |
| 4 | ద ఫ్యామిలీ మ్యాన్ | అమెజాన్ ప్రైమ్ |
| 5 | ఆస్పిరంట్స్ | యూట్యూబ్ |
| 6 | క్రిమినల్ జస్టిస్ | హాట్‌స్టార్ |
| 7 | బ్రీత్ | అమెజాన్ ప్రైమ్ |
| 8 | కోటా ఫ్యాక్టరీ | నెట్‌ఫ్లిక్స్ |
| 9 | పంచాయత్ | అమెజాన్ ప్రైమ్ |
| 10 | పాతాళ్ లోక్ | అమెజాన్ ప్రైమ్ |
| 11 | స్పెషల్ ఓపీఎస్ | హాట్‌స్టార్ |
| 12 | అసుర్: వెల్‌కమ్ టు యువర్ డార్క్ సైడ్ | జియో సినిమా |
| 13 | కాలేజ్ రొమాన్స్ | సోనీలివ్ |
| 14 | అఫరన్ | జియో సినిమా |
| 15 | ఫ్లేమ్స్ | అమెజాన్ ప్రైమ్ |
| 16 | దిండోరా | యూట్యూబ్ |
| 17 | ఫర్జి | అమెజాన్ ప్రైమ్ |
| 18 | ఆశ్రమ్ | MX ప్లేయర్ |
| 19 | ఇన్‌సైడ్ ఎడ్జ్ | అమెజాన్ ప్రైమ్ |
| 20 | ఉందేఖి | సోనీలివ్ |
| 21 | ఆర్య | హాట్‌స్టార్ |
| 22 | గుల్లక్ | సోనీలివ్ |
| 23 | టీవీఎఫ్ పిచర్స్ | జీ5 |
| 24 | రాకెట్ బాయ్స్ | సోనీలివ్ |
| 25 | ఢిల్లీ క్రైమ్స్ | నెట్‌ఫ్లిక్స్ |
| 26 | క్యాంపస్ డైరీస్ | MX ప్లేయర్ |
| 27 | బ్రోకెన్: బట్ బ్యూటిఫుల్ | MX ప్లేయర్ |
| 28 | జంతారా: సబ్‌కే నంబర్ ఆయేగా | నెట్‌ఫ్లిక్స్ |
| 29 | తాజ్ ఖబర్ | హాట్‌స్టార్ |
| 30 | అభయ్ | జీ5 |
| 31 | హాస్టల్ డేస్ | అమెజాన్ ప్రైమ్ |
| 32 | రంగ్‌బాజ్ | జీ5 |
| 33 | బందిష్ బందిత్స్ | అమెజాన్ ప్రైమ్ |
| 34 | మేడ్ ఇన్ హెవన్ | అమెజాన్ ప్రైమ్ |
| 35 | ఇమ్మాచ్యూర్ | అమెజాన్ ప్రైమ్ |
| 36 | లిటిల్ థింగ్స్ | నెట్‌ఫ్లిక్స్ |
| 37 | ద నైట్ మేనేజర్ | హాట్‌స్టార్ |
| 38 | క్యాండీ | జియో సినిమా |
| 39 | బిచ్చూ కా ఖేల్ | జీ5 |
| 40 | దహన్: రాఖన్ కా రహస్య | హాట్‌స్టార్ |
| 41 | జేఎల్ 50 | సోనీలివ్ |
| 42 | రానా నాయుడు | నెట్‌ఫ్లిక్స్ |
| 43 | రే | నెట్‌ఫ్లిక్స్ |
| 44 | సన్‌ఫ్లవర్ | జీ5 |
| 45 | ఎన్‌సీఆర్ డేస్ | యూట్యూబ్ |
| 46 | మహారాణి | సోనీలివ్ |
| 47 | ముంబై డైరీస్ 26/11 | అమెజాన్ ప్రైమ్ |
| 48 | చాచా విధాయక్ హై హమారా | అమెజాన్ ప్రైమ్ |
| 49 | యే మేరీ ఫ్యామిలీ | అమెజాన్ మినీ టీవీ |
| 50 | అరణ్యక్ | నెట్‌ఫ్లిక్స్ |
చదవండి: పంచెకట్టులో తిరుమల శ్రీవారిని దర్శించుకున్న ప్రభాస్


