'హైదరాబాద్ నా రెండో ఇల్లు'.. హాట్‌టాపిక్‌గా భాగ్యశ్రీ ప్రేమ పుకార్లు | Bhagyashree Borse, Ram love rumors became hot topic once again | Sakshi
Sakshi News home page

'హైదరాబాద్ నా రెండో ఇల్లు'.. హాట్‌టాపిక్‌గా భాగ్యశ్రీ ప్రేమ పుకార్లు

Jun 22 2026 11:40 PM | Updated on Jun 22 2026 11:40 PM

Bhagyashree Borse, Ram love rumors became hot topic once again

నటి భాగ్యశ్రీ బోర్సే మరోసారి సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది. హీరో రామ్‌ పోతినేనితో ఆమె డేటింగ్‌లో ఉందనే వార్తలు గతంలోనే వినిపించాయి. ఇప్పుడు ఆ పుకార్లు మళ్లీ తెరపైకి వచ్చాయి. తాజాగా లెనిన్‌ మూవీ ప్రమోషన్స్ సందర్భంగా భాగ్యశ్రీ చేసిన వ్యాఖ్యలు ఈ చర్చకు కారణమయ్యాయి. 'ఔరంగాబాద్ నా మొదటి ఇల్లు, కానీ హైదరాబాద్ నా రెండో ఇల్లుగా మారిపోయింది' అని ఆమె చెప్పుకొచ్చింది. తనకు హైదరాబాద్‌లో ఇప్పటికే ఒక ఇల్లు కూడా ఉందని చెప్పడం నెటిజన్లను ఆకర్షించింది.  

ఈ విషయంలో భాగ్యశ్రీ తన నివాసం గురించే మాట్లాడినప్పటికీ, సోషల్ మీడియాలో మాత్రం 'అది రామ్‌ పోతినేని ఇల్లు కావచ్చు' అంటూ కామెంట్లు వెల్లువెత్తాయి. యాంకర్‌ 'తెలుగు హీరోల్ని పెళ్లి చేసుకున్న తర్వాత చాలామంది హీరోయిన్లు హైదరాబాద్‌లోనే శాశ్వతంగా స్థిరపడతారు' అని అంటే.. దానికి భాగ్యశ్రీ సిగ్గుపడటం పుకార్లకు మరింత ఆజ్యం పోసినట్టైంది. రామ్‌, భాగ్యశ్రీ కలిసి నటించిన ‘ఆంధ్ర కింగ్‌’ సినిమా సమయంలోనే వీరిద్దరూ డేటింగ్‌లో ఉన్నారనే ప్రచారం మొదలైంది. 


అప్పట్లో ఆ సినిమా ప్రమోషన్‌ కోసం ఇద్దరూ కలిసి అమెరికా కూడా వెళ్లారు. అయితే అప్పట్లో ఈ విషయంపై ఓ ఇంటర్వ్యూలో భాగ్యశ్రీ స్పందించారు. రామ్‌ తనకు మంచి స్నేహితుడు మాత్రమేనని ఒక నటుడిగా ఆయన అంటే తనకు  ఎంతో గౌరవం అని చెప్పింది. ఆయన డెడికేషన్‌ చూసి ఎంతో నేర్చుకున్నాను. అంతకు మించి తమ మధ్య ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేసింది.

ఇన్నాళ్లకు మళ్లీ ఈ ప్రేమ పుకార్లు తెరపైకి రావడం అభిమానుల్లో ఆసక్తిని రేపుతోంది. భాగ్యశ్రీ బోర్సే చేసిన 'హైదరాబాద్ నా రెండో ఇల్లు' వ్యాఖ్యతో రామ్‌తో ఉన్న ప్రేమ పుకార్లు మళ్లీ హాట్‌టాపిక్‌గా మారాయి. సోషల్ మీడియాలో ఈ జంటపై చర్చలు మళ్లీ ఊపందుకున్నాయి. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement