ఓటీటీలోకి కాంట్రవర్సీ మూవీ.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే? | The Bengal Files Movie Hindi Version OTT Release Date Confirmed, Check Out Streaming Platform Details | Sakshi
Sakshi News home page

OTT Movie: 'ద బెంగాల్ ఫైల్స్' ఓటీటీ రిలీజ్ ఫిక్స్

Nov 8 2025 5:01 PM | Updated on Nov 8 2025 6:03 PM

The Bengal Files Movie OTT Streaming Details

తాష్కెంట్ ఫైల్స్, కశ్మీర్ ఫైల్స్ సినిమాలతో వివాదాస్పద దర్శకుడిగా వివేక్ అగ్నిహోత్రి పేరు తెచ్చుకున్నాడు. ఈ ఫ్రాంచైజీలో వచ్చిన చివరి చిత్రం 'ద బెంగాల్ ఫైల్స్'. 1947లో ఇండియా-పాక్ విభజన బ్యాక్‌డ్రాప్ స్టోరీతో దీన్ని తెరకెక్కించారు. విడుదలకు ముందే చర్చనీయాంశమైన చిత్రం ఇప్పుడు ఓటీటీలోకి వచ్చేందుకు సిద్ధమైపోయింది. ఈ మేరకు అధికారికంగా ప్రకటించారు.

'ద బెంగాల్ ఫైల్స్' సినిమా సెప్టెంబరు 5న థియేటర్లలోకి వచ్చింది. దాదాపు మూడున్నర గంటల నిడివితో దీన్ని తీశారు. తొలి రెండు చిత్రాల్లానే ఇది కూడా జీ5 ఓటీటీలోనే స్ట్రీమింగ్ కాబోతుంది. ఈనెల 21 నుంచి హిందీ భాషలో అందుబాటులోకి రానుంది.

(ఇదీ చదవండి: ఓటీటీలో 'కె- ర్యాంప్‌'.. అధికారిక ప్రకటన)

'ద బెంగాల్‌ ఫైల్స్' విషయానికొస్తే.. 1947వ సంవత్సరంలో భారత్-పాక్ ఎలా విడిపోయాయి. ఈ విషయంలో గాంధీ ఎలాంటి పాత్ర పోషించారు. అప్పుడు హిందువులు, ముస్లింల మధ్య ఎలాంటి గొడవలు చేలరేగాయి. ఎవరు ఎవరిని ఎందుకు చంపారు. ఈ అనర్థాలన్నీ ఎందుకు జరిగాయనేది ఈ సినిమా స్టోరీ.

ప్రధానంగా భారతదేశం నుంచి పాకిస్థాన్ విడిపోయే సమయంలో గాంధీ, మహమ్మద్ అలీ జిన్నాని ఇదంతా వద్దని అంటారు. జిన్నా మాత్రం.. ముస్లింలు ఎప్పుడూ ముస్లింలే, హిందూ ముస్లిం భాయ్ భాయ్ కాదు అని అంటాడు. తర్వాత జిన్నా మనుషులు అప్పటి దేశ రాజధాని అయిన కలకత్తాలో మారణహోమం సృష్టిస్తారు. హిందూ స్త్రీలని, మహిళలని, చిన్నపిల్లలని చూడకుండా దారుణంగా కాల్చి చంపేస్తారు. ఇలాంటి సమయంలో మన దేశాన్ని పాలిస్తున్న బ్రిటీషర్లు ఏం చేశారు? ముస్లింలపై భారతీయులు ఎలా తిరుగుబాటు చేశారు? తమని తాము ఎలా కాపాడుకున్నారనే అంశాల్ని ఇందులో చూపించారు.

(ఇదీ చదవండి: ఓటీటీలోకి సైకలాజికల్ హారర్ థ్రిల్లర్.. తెలుగులోనూ స్ట్రీమింగ్)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement