వచ్చాడు గౌతమ్‌ | Ashwin Babu Vachina Vaadu Gautam first look poster release | Sakshi
Sakshi News home page

వచ్చాడు గౌతమ్‌

Apr 8 2025 12:37 AM | Updated on Apr 8 2025 12:51 AM

Ashwin Babu Vachina Vaadu Gautam first look poster release

స్టెతస్కోప్‌ పట్టుకున్న చేతి నిండా రుధిరం, కళ్లల్లో రౌద్రం చూస్తుంటే ప్రాణాలు పోయాల్సిన డాక్టర్‌ హత్య చేశాడా? అనేలా ఉంది ‘వచ్చిన వాడు గౌతమ్‌’(Vachina Vaadu Gautam) పోస్టర్‌. అశ్విన్‌ బాబు(Ashwin Babu) హీరోగా మామిడాల ఎం.ఆర్‌. కృష్ణ దర్శకత్వంలో టి. గణపతి రెడ్డి నిర్మిస్తున్న చిత్రం ఇది. వచ్చాడు గౌతమ్‌ అంటూ ఈ చిత్రంలో అశ్విన్‌ ఫస్ట్‌ లుక్‌ పోస్టర్‌ని విడుదల చేశారు.

‘‘అరుణశ్రీ ఎంటర్‌ టైన్మెంట్స్‌పై గణపతి రెడ్డి నిర్మిస్తున్న మూడో చిత్రం ఇది. గ్రాండ్‌గా నిర్మిస్తున్నారు. ఈ చిత్రం షూటింగ్‌ 90 శాతం పూర్తయింది. ఈ చిత్రంలో సాయి రోనక్‌ అతిథి పాత్రలో కనిపిస్తారు’’ అని చిత్రబృందం పేర్కొంది. రియా సుమన్, అయేషా ఖాన్, మురళీ శర్మ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: గౌర హరి, కెమేరా: ఎం.ఎన్‌. బాల్‌ రెడ్డి.

Advertisement
 
Advertisement
Advertisement