
నెగెటివ్ పాత్రలు చేయడం అంత ఈజీ కాదు. ఏమాత్రం అజాగ్రత్తగా ఉన్నా నటుల ప్రాణాలకే ప్రమాదం.. కొన్ని యాక్షన్ సీన్లలో అయితే వీరు చావు చివరి అంచులవరకు కూడా వెళ్లి వస్తుంటారు. తనకూ అలాంటి పరిస్థితే ఏర్పడిందంటున్నాడు బాలీవుడ్ నటుడు అశోక్ సరఫ్ (Ashok Saraf). ఎక్కువగా కామెడీ పాత్రల్లోనే అలరించిన ఈయన జాగృతి (1992) మూవీలో విలన్‌గా నటించాడు. ఇందులో సల్మాన్ ఖాన్ హీరోగా నటించాడు.
నా మెడపై కత్తిపెట్టి..
జాగృతి చిత్రీకరణ సమయంలో జరిగిన ఓ సంఘటనను అశోక్ తాజాగా ఓ ఇంటర్వ్యూలో వెల్లడించాడు. హీరో సల్మాన్ (Salman Khan) నా పీకపైన కత్తిపెట్టాల్సిన సన్నివేశం అది! ఆయన నిజమైన కత్తి పట్టుకున్నాడు. ఇద్దరం డైలాగ్స్ చెప్తున్నాం. ఆయన చాలా గట్టిగా కత్తిని అదిమిపట్టుకున్నాడు. అది నా మెడకు గుచ్చుకుంటోంది. అతడి చేతుల్లో నుంచి తప్పించుకోవాలనిపించింది. ఆ కత్తిని కిందపడేయమన్నాను. కానీ సల్మాన్.. కత్తి కిందపడేయకుండా కెమెరా మనవైపే ఉంది. ఏం చేయమంటావని అడిగాడు.
ఓపక్క రక్తం కారుతున్నా..
కెమెరా నావైపే ఉన్నట్లర్థమై సీన్ కంటిన్యూ చేశాం. ఇద్దరం డైలాగ్స్ చెప్పాం. తర్వాత చూసుకుంటే నా మెడ కట్ అయింది. కాస్త లోతైన గాయం ఏర్పడి రక్తం కారుతోంది. ఏమాత్రం నరాలు కట్ అయినా నా చాప్టర్ అక్కడే క్లోజ్ అయ్యేది. మరి సల్మాన్‌కు ఈ సంఘటన గుర్తుందో, లేదో? అయినా ఇలాంటివాటిని ఎవరూ గుర్తుపెట్టుకోరు, అక్కడే మర్చిపోతారు అని చెప్పుకొచ్చాడు.
సినిమా
సల్మాన్, అశోక్.. జాగృతి చిత్రంతో పాటు కరణ్ అర్జున్, ప్యార్ కియా తో డర్నా క్యా, బంధన్ వంటి పలు సినిమాల్లో నటించారు. ఇకపోతే సల్మాన్ చివరగా సికందర్ చిత్రంలో కనిపించాడు. ఏఆర్ మురుగదాస్ దర్శకత్వం వహించిన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద ఫ్లాప్ అయింది. ప్రస్తుతం ఇతడు.. కిక్ సీక్వెల్‌తో పాటు గల్వాన్ లోయలో జరిగిన ఘర్షణల ఆధారంగా తెరకెక్కుతున్న చిత్రంలో నటిస్తున్నాడు.
చదవండి: నువ్వు లేకపోతే నేను ఏమైపోయేదాన్నో..:కల్యాణి ప్రియదర్శన్