క్రేజీ ఛాన్స్ కొట్టేసిన 'విశ్వంభర' బ్యూటీ! | Ashika Ranganath Pair Up With Raviteja | Sakshi
Sakshi News home page

Ashika Ranganath: నాగ్-చిరు అయిపోయారు.. ఇప్పుడు ఆ హీరోతో?

Jun 3 2025 7:01 PM | Updated on Jun 3 2025 7:16 PM

Ashika Ranganath Pair Up With Raviteja

టాలీవుడ్‌లో హీరోయిన్లకు కొదవలేదు. ముంబై నుంచే కాకుండా కన్నడ, మలయాళ నుంచి ఎప్పటికప్పుడు యంగ్ హీరోయిన్లు వస్తూనే ఉంటారు. అలానే కొన్నాళ్ల క్రితం తెలుగులోకి ఎంట్రీ ఇచ్చిన కన్నడ భామ ఆషికా.. ప్రస్తుతం చిరంజీవి 'విశ్వంభర' సినిమాలో చేస్తోంది. ఇప్పుడు మరో స్టార్ హీరో చిత్రంలో ఛాన్స్ కొట్టేసినట్లు తెలుస్తోంది.

(ఇదీ చదవండి: థియేటర్లలో ఉండగానే ఓటీటీలోకి కొత్త సినిమా)

కల్యాణ్ రామ్ 'అమిగోస్' మూవీతో టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చిన ఆషికా.. నాగార్జున 'నా సామి రంగ'లోనూ హీరోయిన్‌గా చేసి గుర్తింపు తెచ్చుకుంది. అలా చిరంజీవి 'విశ్వంభర'లో ఛాన్స్ కొట్టేసింది. ఇప్పటికే షూటింగ్ దాదాపు పూర్తి చేసుకున్న ఈ చిత్రం.. మరికొన్ని నెలల్లో రిలీజ్ కావొచ్చు. ఇప్పుడు రవితేజ కొత్త సినిమాలోనూ ఆషికాని తీసుకున్నట్లు తెలుస్తోంది.

ప్రస్తుతం 'మాస్ జాతర' చేస్తున్న రవితేజ.. దీని తర్వాత దర్శకుడు కిశోర్ తిరుమల తీసే సినిమాలో నటించబోతున్నాడు. ఈ చిత్రానికి 'అనార్కలి' అనే టైటిల్ పరిశీలిస్తున్నారు. తొలుత ఈ మూవీ కోసం కాయదు లోహర్, మమిత బైజు పేర్లు పరిశీలనలోకి వచ్చినప్పటికీ... ఇప్పుడు ఆ స్థానాల్లో కేతిక శర్మ, ఆషిక రంగనాథ్ ఉండబోతున్నారని తెలుస్తోంది. కిశోర్ తిరుమల సినిమాలంటే హీరోయిన్ల పాత్రకు కాస్త గుర్తింపు ఉంటుంది. మరి ఈసారి ఆషికాని ఎలా చూపిస్తాడో? త్వరలో ఈ సినిమా షూటింగ్ మొదలుపెట్టి.. వచ్చే సంక్రాంతికి లేదా వేసవికి రిలీజ్ చేయాలని ప్లాన్‍‌లో టీమ్ ఉంది.

(ఇదీ చదవండి: కురచ దుస్తులపై కామెంట్స్‌.. సురేఖావాణి ఏమందంటే?)

Advertisement
 
Advertisement
Advertisement