అందుకే శిల్పా రవికి మద్దతు ఇచ్చాను: అల్లు అర్జున్‌ | AP Assembly Elections 2024: Allu Arjun Gives Clartiy On His Nandyal Visit, Video Goes Viral | Sakshi
Sakshi News home page

Allu Arjun On Nandyal Visit: నంద్యాల టూర్ పై క్లారిటీ ఇచ్చిన బన్నీ

May 13 2024 8:24 AM | Updated on May 13 2024 11:57 AM

AP Assembly Elections 2024: Allu Arjun Gives Clartiy On Nandyal Tour

సాక్షి, హైదరాబాద్‌:  తెలంగాణలోని  17 లోక్‌సభ స్థానాలు, సికింద్రాబాద్‌ కంటోన్మెంట్‌ అసెంబ్లీ ఎన్నికతో పాటు ఏపీలోని 175 అసెంబ్లీ, 25 లోక్‌ సభ స్థానాలకు పోలింగ్‌ ప్రారంభమైంది. ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్‌ జరగనుంది. ఇప్పటికే పలువురు సినీ ప్రముఖులు తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. ఐకాన్‌ స్టార్‌ అల్లు అర్జున్‌ ఉదయం 7.30 గంటలకే తన ఓటు హక్కును వినియోగించుకున్నాడు. జూబ్లీహిల్స్‌లోని బీఎస్‌ఎన్‌ఎల్‌ సెంటర్‌ ఉదయం 7.30 గంటలకే ఓటేశాడు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. నంద్యాల టూర్‌పై క్లారిటీ ఇచ్చాడు. 

నంద్యాల అంసెబ్లీ నియోజకవర్గం వైఎస్సార్‌సీపీ అభ్యర్తి శిల్పా రవిచంద్ర కిశోర్‌ రెడ్డి తన స్నేహితుడని.. అందుకే ఆయనకు మద్దతుగా నంద్యాల వెళ్లాలని చెప్పాడు.  ‘శిల్పా రవి నాకు 15 ఏళ్లుగా మిత్రుడు. అతనికి మద్దతు ఇస్తానని గతంలో మాట ఇచ్చాను. రాజకీయాలతో సంబంధం లేకుండా స్నేహితుడిగా మాత్రమే శిల్పారవికి మద్దతుగా నంద్యాల వెళ్లాను. నాకు రాజకీయాల్లోకి వచ్చే ఉద్దేశం అస్సలు లేదు. ప్రతి ఒక్కరు ఓటు హక్కును వినియోగించుకోవాలని కోరుకుంటున్నాను’అని బన్నీ అన్నారు. 

Advertisement
 
Advertisement
Advertisement