అమ్మాయిల అంతరాత్మ | Antaratma Movie Grand Opening by Actor Ali | Sakshi
Sakshi News home page

అమ్మాయిల అంతరాత్మ

Oct 27 2023 3:35 AM | Updated on Oct 27 2023 3:35 AM

Antaratma Movie Grand Opening by Actor Ali - Sakshi

మనోజ్, రాంభూపాల్‌ రెడ్డి, అలీ, నాగ రాజశేఖర్, సురేందర్‌

ఎలీనా, లాస్య స్మైలీ, తన్వీ, శశిరేఖ ముఖ్య తారలుగా, జయక్రిష్, సమీర్, అర్జున్, మల్లిక్‌ బాబు కీలక పాత్రల్లో నటిస్తున్న చిత్రం ‘అంతరాత్మ’. ఎమ్‌. నాగ రాజశేఖర్‌ రెడ్డి దర్శకత్వంలో తుమ్మల మనోజ్‌ యాదవ్, రావూరు సురేందర్‌ రెడ్డి నిర్మిస్తున్న ఈ సినిమా పూజా కార్యక్రమాలు హైదరాబాద్‌లో జరిగాయి.

తొలి సన్నివేశానికి ఏసీపీ బాలకృష్ణా రెడ్డి కెమెరా స్విచ్చాన్‌ చేయగా, ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్‌ రెడ్డి క్లాప్‌ ఇచ్చారు. నటుడు అలీ స్క్రిప్ట్‌ను మేకర్స్‌కు అందించారు. ‘‘నలుగురు అమ్మాయిల మధ్య సాగే సస్పెన్స్‌ థ్రిల్లర్‌ ఫిల్మ్‌ ఇది. సింగిల్‌ షెడ్యూల్‌లో షూటింగ్‌ పూర్తి చేస్తాం’’ అన్నారు నాగ రాజశేఖర్‌. ఐఏఎస్‌ ఆఫీసర్‌ మురళీమోహన్‌ ఓ అతిథిగా పాల్గొన్న ఈ చిత్రానికి సంగీతం: జీఎమ్‌ సతీష్, కెమెరా: నాగరాజు.

Advertisement
 
Advertisement
Advertisement