అనిరుధ్–కావ్య మారన్ పెళ్లి ఫిక్స్?.. కన్ఫార్మ్ చేసిన అనిరుధ్ బాబాయ్! | Anirudh Ravichander-Kavya Maran wedding gossip as a hot topic | Sakshi
Sakshi News home page

Anirudh-Kavya: అనిరుధ్–కావ్య మారన్ పెళ్లి ఫిక్స్?.. కన్ఫార్మ్ చేసిన అనిరుధ్ బాబాయ్!

Jun 29 2026 11:52 PM | Updated on Jun 30 2026 8:55 AM

Anirudh Ravichander-Kavya Maran wedding gossip as a hot topic

సంగీత ప్రపంచంలో రాక్‌స్టార్ అనిరుధ్ రవిచందర్, క్రికెట్ రంగంలో సన్‌రైజర్స్ హైదరాబాద్ సీఈఓ కావ్య మారన్ మధ్య సంబంధం ఉందన్న వార్తలు సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారాయి. వీరిద్దరూ త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నారంటూ గాసిప్స్ వినిపిస్తున్నాయి. గతంలో ఈ ప్రచారంపై స్పందించిన అనిరుధ్ “ఇవి కేవలం రూమర్స్ మాత్రమే” అంటూ కొట్టిపారేశారు. అయితే తాజాగా ఆయన బాబాయ్, సీనియర్ నటుడు వై.జీ. మహేంద్రన్ ఇచ్చిన ఇంటర్వ్యూతో ఈ వార్తలకు కొత్త ఊపు వచ్చింది. “అనిరుధ్ మృదు స్వభావి. కావ్య సాధారణ వ్యక్తి కాదు. ఇద్దరూ మంచి జంట. కలిసి మ్యూజిక్ బిజినెస్‌లో కూడా వీరు రాణించగలరు” అని ఆయన వ్యాఖ్యానించారు.

ఈ వ్యాఖ్యలతో సోషల్ మీడియాలో కావ్య–అనిరుధ్ పెళ్లి టాపిక్ మరింతగా ట్రెండ్ అవుతోంది. సన్ గ్రూప్ అధినేత కళానిధి మారన్ నిర్మించిన ‘జైలర్’, ‘బీస్ట్’ చిత్రాలకు అనిరుధ్ సంగీతం అందించిన సమయంలోనే వీరిద్దరికీ పరిచయం ఏర్పడింది. అనంతరం అది ప్రేమగా మారిందని ఇన్‌సైడ్ టాక్ వినిపిస్తోంది. వీరి పెళ్లిని విదేశాల్లో లండన్ లేదా ఇటలీలో సీక్రెట్‌గా ప్లాన్ చేస్తున్నారని కూడా వార్తలు వస్తున్నాయి.

అయితే కావ్య మారన్ సన్నిహిత వర్గాలు మాత్రం ఈ ప్రచారాన్ని కొట్టిపారేస్తున్నాయి. అవన్నీ బేస్‌లెస్ రూమర్స్ మాత్రమే అని స్పష్టం చేశాయి. అనిరుధ్ కూడా ఇటీవల ఒక ప్రెస్ మీట్‌లో పెళ్లి ప్రస్తావన రాగానే నవ్వుతూ దాటవేశారు. ప్రస్తుతం ఈ క్రేజీ జంటపై ఊహాగానాలు కొనసాగుతున్నప్పటికీ, అధికారికంగా మాత్రం ఎలాంటి ధృవీకరణ రాలేదు. అయితే అభిమానులు మాత్రం అనిరుధ్–కావ్య మారన్ పెళ్లి వార్తలపై ఆసక్తిగా చర్చిస్తున్నారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement