breaking news
Sunrisers Hyderabad IPL
-
ఐపీఎల్ ఫైనల్ కు దూసుకెళ్లిన సన్‌రైజర్స్ హైదరాబాద్
-
నితీశ్ ‘షో’
ముల్లన్పూర్: ఐపీఎల్లో ఇప్పటి వరకు ఇంట గెలిచిన సన్‌రైజర్స్ హైదరాబాద్ ఇప్పుడు రచ్చ గెలిచింది. పంజాబ్ గడ్డపై ఆంధ్ర బ్యాటర్ నితీశ్ కుమార్ రెడ్డి (37 బంతుల్లో 64; 4 ఫోర్లు, 5 సిక్స్‌లు) మెరుపు బ్యాటింగ్‌తో చెలరేగాడు. దీంతో హైదరాబాద్ 2 పరుగుల తేడాతో పంజాబ్ కింగ్స్‌పై విజయం సాధించింది. ముందుగా సన్‌రైజర్స్ నిర్ణిత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 182 పరుగులు చేసింది. నితీశ్‌తో పాటు అబ్దుల్ సమద్ (12 బంతుల్లో 25; 5 ఫోర్లు) ధాటిగా ఆడారు. అర్షదీప్ కు 4 వికెట్లు దక్కాయి. అనంతరం పంజాబ్ 20 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 180 పరుగులు చేసి ఓడింది. శశాంక్ సింగ్ (25 బంతుల్లో 46; 6 ఫోర్లు, 1 సిక్స్) రాణించగా, అశుతోష్ (15 బంతుల్లో 33 నాటౌట్; 3 ఫోర్లు, 2 సిక్స్‌లు) దూకుడగా ఆడాడు. ఆఖరి ఓవర్లో 29 పరుగులు కావాల్సి ఉండగా బౌలర్ ఉనాద్కట్ పట్టు తప్పాడు. వైడ్లతో పాటు పేలవ బంతులు వేయడంతో ఉత్కంఠ పెరిగింది. చివరకు పంజాబ్ 3 సిక్స్‌లు సహా 26 పరుగులే రాబట్టడంతో హైదరాబాద్ ఊపిరి పీల్చుకుంది. నితీశ్ వీరబాదుడు... ఓపెనర్ ట్రవిస్ హెడ్ (15 బంతుల్లో 21; 4 ఫోర్లు), మార్క్రమ్ (0)లను ఒకే ఓవర్లో అర్షదీప్ అవుట్ చేయగా, అభిషేక్ శర్మ (16)కు సామ్ కరన్ కళ్లెం వేశాడు. 39 పరుగులకే టాప్ 3 వికెట్లను కోల్పోయింది. రాహుల్ త్రిపాఠి (11) ‘ఇంపాక్ట్’ చూపలేకపోయాడు. సగం (10) ఓవర్లు ముగిసే సరికి జట్టు 66/4 స్కోరు చేసింది. అయితే నాలుగో ఓవర్లోనే క్రీజులోకి వచి్చన నితీశ్ పదో ఓవర్‌దాకా చేసిన స్కోరు 14! ఒకటే బౌండరీ కొట్టాడు. ఇలా ఆడిన విశాఖ కుర్రాడు ధనాధన్‌కు స్విచ్చాన్ చేసినట్లుగా 11వ ఓవర్ నుంచి అనూహ్యంగా దంచేశాడు. హర్‌ప్రీత్ బౌలింగ్‌లో 4, 6 బాదగా, క్లాసెన్ ఓ ఫోర్ కొట్టడంతో 15 పరుగులు వచ్చాయి. రబడ, సామ్ కరన్ ఓవర్లలో చెరో సిక్సర్‌తో దూకుడు పెంచాడు. క్లాసెన్ (9) అవుటయ్యాక సమద్ రావడంతో దూకుడు ‘డబుల్’ అయింది. హర్‌ప్రీత్ 15వ ఓవర్‌నూ పూర్తిగా ఎదుర్కొన్న నితీశ్ 0, 4, 6, 4, 6, 2లతో 22 పరుగులు పిండుకున్నాడు. దీంతో 32 బంతుల్లోనే అతని ఫిఫ్టీ పూర్తయ్యింది. 17వ ఓవర్ వేసిన అర్షదీప్ 3 బంతుల వ్యవధిలో సమద్, నితీశ్‌లను అవుట్ చేయడంతో రైజర్స్ డెత్ ఓవర్లలో ఆశించినన్ని పరుగుల్ని చేయలేకపోయింది. దెబ్బకొట్టిన భువీ... ఓపెనర్ బెయిర్‌స్టో (0)ను రెండో ఓవర్లోనే కమిన్స్ డకౌట్ చేయగా, భువనేశ్వర్ వరుస ఓవర్లలో ప్రభ్‌సిమ్రన్ (4)తో పాటు మరో శిఖర్ ధావన్ (14)ను పెవిలియన్ చేర్చాడు. దీంతో 20 పరుగులకే టాపార్డర్ కూలింది. సామ్ కరన్ (22 బంతుల్లో 29; 2 ఫోర్లు, 2 సిక్స్‌లు), సికందర్ రజా (22 బంతుల్లో 28; 2 ఫోర్లు, 2 సిక్స్‌లు) కాసేపు పోరాడారు. నటరాజన్ పదో ఓవర్లో సామ్ కరన్ బౌండరీ కోసం ప్రయత్నించగా మిడాఫ్‌లో కమిన్స్ కళ్లు చెదిరే క్యాచ్‌తో అతని ఆట ముగించాడు. జట్టు స్కోరు 91 పరుగుల వద్ద రజా ని్రష్కమించడంతో సన్‌రైజర్స్ గెలుపు దాదాపుగా ఖాయమైంది. అయితే ఆఖరి ఓవర్లో ఉనాద్కట్ 3 వైడ్లు వేయడంతో 2 బంతుల్లో 10 పరుగుల సమీకరణం పంజాబ్‌కు అవకాశమిచ్చింది. అశుతోష్ మరో షాట్ ఆడగా డీప్ మిడ్ వికెట్ వద్ద రాహుల్ త్రిపాఠి క్యాచ్ జారవిడిచాడు. ఒకే పరుగు రావడంతో ఇక ఆఖరి బంతికి 9 పరుగులు అసాధ్యమవడంతో హైదరాబాద్ గెలిచింది. అయితే చివరి బంతిని శశాంక్ సిక్స్ కొట్టడంతో సన్‌రైజర్స్ 2 పరుగులతో నెగ్గింది. సన్‌రైజర్స్ జట్టులో విజయకాంత్ శ్రీలంక యువ లెగ్‌స్పిన్నర్ విజయకాంత్ వియస్కాత్ ఐపీఎల్ టీమ్ సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టులో చోటు దక్కించుకున్నాడు. గాయంతో టోర్నీకి దూరమైన లంక లెగ్‌స్పిన్నర్ వనిందు హసరంగ స్థానంలో కనీస విలువ రూ. 50 లక్షలకు రైజర్స్ యాజమాన్యం విజయ్‌కాంత్‌ను ఎంచుకుంది. 22 ఏళ్ల విజయ్‌కాంత్ ఆసియా క్రీడల్లో లంక తరఫున ఒకే ఒక అంతర్జాతీయ టి20 ఆడాడు. స్కోరు వివరాలు సన్‌రైజర్స్ హైదరాబాద్ ఇన్నింగ్స్: హెడ్ (సి) ధావన్ (బి) అర్షదీప్ 21; అభిషేక్ (సి) శశాంక్ (బి) సామ్ కరన్ 16; మార్క్రమ్ (సి) జితేశ్ (బి) అర్షదీప్ 0; నితీశ్ కుమార్ (సి) రబడ (బి) అర్షదీప్ 64; రాహుల్ త్రిపాఠి (సి) జితేశ్ (బి) హర్షల్ 11; క్లాసెన్ (సి) సామ్ కరన్ (బి) హర్షల్ 9; సమద్ (సి) హర్షల్ (బి) అర్షదీప్ 25; షాబాజ్ నాటౌట్ 14; కమిన్స్ (బి) రబడ 3; భువనేశ్వర్ (సి) బెయిర్‌స్టో (బి) సామ్ కరన్ 6; ఉనాద్కట్ నాటౌట్ 6; ఎక్స్‌ట్రాలు 7; మొత్తం (20 ఓవర్లలో 9 వికెట్లకు) 182. వికెట్ల పతనం: 1–27, 2–27, 3–39, 4–64, 5–100, 6–150, 7–151, 8–155, 9–176. బౌలింగ్: రబడ 4–0–32–1, అర్షదీప్ 4–0–29–4, సామ్ కరన్ 4–0–41–2, హర్షల్ 4–0–30–2, హర్‌ప్రీత్ బ్రార్ 4–0–48–0. పంజాబ్ కింగ్స్ ఇన్నింగ్స్: ధావన్ (స్టంప్డ్) క్లాసెన్ (బి) భువనేశ్వర్ 14; బెయిర్‌స్టో (బి) కమిన్స్ 0; ప్రభ్సిమ్రాన్ (సి) నితీశ్ (బి) భువనేశ్వర్ 4; సామ్ కరన్ (సి) కమిన్స్ (బి) నటరాజన్ 29; సికందర్ రజా (సి) క్లాసెన్ (బి) ఉనాద్కట్ 28; శశాంక్ నాటౌట్ 46; జితేశ్ (సి) అభిషేక్ (బి) నితీశ్ 19; అశుతోష్ నాటౌట్ 33; ఎక్స్‌ట్రాలు 7; మొత్తం (20 ఓవర్లలో 6 వికెట్లకు) 180. వికెట్ల పతనం: 1–2, 2–11, 3–20, 4–58, 5–91, 6–114. బౌలింగ్: భువనేశ్వర్ 4–1–32–2, కమిన్స్ 4–0–22–1, నటరాజన్ 4–0–33–1, నితీశ్ కుమార్ 3–0–33–1, ఉనాద్కట్ 4–0–49–1, షహబాజ్ 1–0–10–0. అదరగొట్టాడు ఏడేళ్ల క్రితం...బీసీసీఐ అండర్–16 టోర్నీ విజయ్‌మర్చంట్ ట్రోఫీ..రాజ్‌కోట్‌లో నాగాలాండ్‌తో ఆంధ్ర మ్యాచ్. అద్భుత బ్యాటింగ్‌తో చెలరేగిన నితీశ్ కుమార్ రెడ్డి 345 బంతుల్లో ఏకంగా 441 పరుగుల స్కోరు సాధించి సంచలనం సృష్టించాడు. ఈ క్వాడ్రపుల్ సెంచరీ మాత్రమే కాకుండా టోర్నీ మొత్తం అదరగొట్టిన అతను 8 ఇన్నింగ్స్‌లలో 4 సెంచరీలు, 2 అర్ధసెంచరీలు సహా 176.71 సగటుతో ఏకంగా 1237 పరుగులు నమోదు చేశాడు. విజయ్‌మర్చంట్ ట్రోఫీ చరిత్రలో ఒక్క సీజన్లో ఎవరూ చేయని పరుగుల రికార్డు అది. ఆ ఏడాది బీసీసీఐ వార్షిక అవార్డుల్లో ‘బెస్ట్ అండర్–16 క్రికెటర్’గా నిలవడంతో దేశవాళీ క్రికెట్లో అందరి దృష్టీ ఈ కుర్రాడిపై పడింది. ఓపెనర్‌గా కెరీర్ మొదలు పెట్టిన నితీశ్ అండర్–19 స్థాయి వినూ మన్కడ్ ట్రోఫీ, చాలెంజర్ టోర్నీ వరకు అలాగే కొనసాగించాడు. అయితే మరో వైపు మీడియం పేస్ బౌలింగ్‌పై కూడా దృష్టి పెట్టిన అతను కొత్త బంతితో బౌలింగ్ చేశాడు. దాంతో భారం ఎక్కువ కావడంతో అతని భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని మిడిలార్డర్‌లోకి మార్చారు. వైజాగ్‌లో పుట్టిన నితీశ్ ఏజ్ గ్రూప్ టోర్నీల్లో సత్తా చాటిన తర్వాత 2020–21 సీజన్లో ఆంధ్ర తరఫున రంజీ ట్రోఫీలోకి అడుగు పెట్టి ఆల్‌రౌండర్‌గా జట్టుకు కీలకంగా మారాడు. రెండేళ్ల తర్వాత రంజీ సీజన్లో 25 వికెట్లు పడగొట్టిన నితీశ్ తన బౌలింగ్ పదును కూడా చూపించాడు. తాజా సీజన్ రంజీ ట్రోఫీలో రెండు సార్లు ఐదు వికెట్ల ప్రదర్శన నమోదు చేసిన నితీశ్ బాధిత బ్యాటర్లలో పుజారా, రహానే, శ్రేయస్ అయ్యర్ ఉన్నారు. బ్యాటింగ్‌లో చెలరేగుతూ మీడియం పేస్ బౌలింగ్ చేసే హార్దిక్ పాండ్యాను అతను అభిమానిస్తాడు. తండ్రి ముత్యాల రెడ్డి హిందుస్తాన్ జింక్ సంస్థలో ఉద్యోగిగా పని చేసేవాడు. అయితే రాజస్తాన్‌కు బదిలీ కావడంతో ఆయన ఉద్యోగంకంటే కొడుకు భవిష్యత్తే ముఖ్యమని భావిస్తూ రాజీనామా చేశారు. ఆ తర్వాత పూర్తిస్థాయిలో నితీశ్‌కు మార్గనిర్దేశం చేసి నడిపించారు. ఇప్పుడు ఐపీఎల్లో మెరుపు ఇన్నింగ్స్‌తో నితీశ్ అందరికీ తెలిశాడు. 2023 సీజన్లో సన్‌రైజర్స్ తరఫున 2 మ్యాచ్‌లు ఆడినా బ్యాటింగ్ రాకపోగా, వికెట్ కూడా దక్కలేదు. ఈ సీజన్లో చెన్నైతో మ్యాచ్‌లో 8 బంతుల్లో ఫోర్, సిక్స్‌తో 14 పరుగులు చేసి ట్రైలర్ చూపించిన నితీశ్ తానేంటే ఈ మ్యాచ్‌లో అసలు షో ప్రదర్శించాడు. చాలా కాలం తర్వాత సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టులో ఒక స్థానిక ఆటగాడు చెలరేగి జట్టును గెలిపించడం మరో విశేషం. - (సాక్షి క్రీడా విభాగం) -
హైదరాబాద్: నేడు రాజస్తాన్‌తో హైదరాబాద్ మ్యాచ్
సాక్షి, హైదరాబాద్: ఉప్పల్ క్రికెట్ స్టేడియం మరోసారి అభిమానులతో హోరెత్తనుంది. వరుసగా మూడు సీజన్లు టీవీల్లో, మొబైల్ ఫోన్లలో ఐపీఎల్ మ్యాచ్‌లు చూసి సంతృప్తి చెందిన క్రికెట్ ఫ్యాన్స్ ఇప్పుడు ప్రత్యక్షంగా మైదానంలో ఎంజాయ్ చేసేందుకు సిద్ధమవుతున్నారు. నేటితో మొదలు పెట్టి మే 18 వరకు ఏడు ఐపీఎల్ మ్యాచ్‌లు స్టేడియంలో అలరించనున్నాయి. ఐపీఎల్ మ్యాచ్... ఆపై ఆదివారం.. వేసవి వినోదాన్ని ఆస్వాదించేందుకు ఈ కాంబినేషన్ సరిగ్గా సరిపోతుంది. నేడు సొంతగడ్డపై సన్‌రైజర్స్ హైదరాబాద్ టీమ్ రాజస్తాన్ రాయల్స్‌తో జరిగే పోరులో తలపడనుంది. ఈ రోజు మాత్రమే కాదు, వచ్చే ఆదివారం కూడా హైదరాబాద్‌లో ఐపీఎల్ మ్యాచ్ ఉండటంతో వరుసగా రెండు వారాంతాలు ఫ్యాన్స్‌కు పండుగే. సీజన్లో తొలి మ్యాచ్‌కు హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (హెచ్‌సీఏ) అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. ఈ ఏడాది భారత్‌లో జరిగే వన్డే వరల్డ్ కప్ కోసం షార్ట్ లిస్ట్ చేసిన వేదికల్లో హైదరాబాద్ కూడా ఉంది. దాంతో అవుట్‌ఫీల్డ్, పిచ్ విషయంలో కూడా అన్ని జాగ్రత్తలు తీసుకుంటూ ప్రతిష్టాత్మకంగా ఐపీఎల్ జరపాలని హెచ్‌సీఏ పట్టుదలగా ఉంది. ఫ్యాన్స్ రెడీ... ఐపీఎల్లో వినోదం గురించి నగర అభిమానులకు కొత్తగా చెప్పాల్సిన పని లేదు. మ్యాచ్ ఫలితాలతో సంబంధం లేకుండా స్థానిక జట్టుకు పెద్ద సంఖ్యలో మద్దతు లభించడం ఖాయం. దాంతో మరోసారి మైదానం ఆరెంజ్ రంగుతో నిండిపోనుంది. ప్రస్తుతానికి నేడు, వచ్చే ఆదివారం జరిగే రెండు మ్యాచ్‌ల కోసమే సన్‌రైజర్స్ టికెట్లను అందుబాటులో ఉంచింది. రెండు మ్యాచ్‌లకు సంబంధించి తక్కువ విలువ ఉన్న టికెట్లన్నీ పూర్తిగా అమ్ముడుపోయాయి. ‘పేటీఎం ఇన్సైడర్’ ద్వారా ఆన్లైన్లో టికెట్లు విక్రయిస్తున్నారు. ప్రస్తుతానికి రూ. 1367 ఆపై విలువ గల టికెట్లు లభిస్తున్నాయి. జింఖానా మైదానం, 24 సెవెన్, మేకర్స్ ఆఫ్ మిల్క్‌షేక్స్ అవుట్లెట్లలో కూడా నేరుగా టికెట్లు కొనుక్కునే అవకాశం ఉంది. నాటి మ్యాచ్ గుర్తుందా... సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు ఉప్పల్ స్టేడియంలో 2019 ఏప్రిల్ 29న చివరిసారి మ్యాచ్ ఆడింది. పంజాబ్‌తో జరిగిన ఆ మ్యాచ్‌లో రైజర్స్ 45 పరుగులతో గెలిచింది. సుదీర్ఘ కాలం పాటు హైదరాబాద్ అభిమానులకు ఆత్మీయులుగా మారిపోయిన పలువురు క్రికెటర్లు ఈసారి ఆ జట్టులో లేరు. ముఖ్యంగా తన డ్యాన్స్‌లు, తెలుగు టిక్‌టాక్ పాటలతో మన అభిమానులకు ఎంతో చేరువైన డేవిడ్ వార్నర్, ‘కేన్ మామా’ విలియమ్సన్, వరుసగా మ్యాచ్‌లు గెలిపించిన రషీద్ ఖాన్ కూడా ప్రత్యర్థి టీమ్‌లలో ఉన్నారు. దాంతో ఈసారి జట్టు కాస్త కొత్తగా కనిపించనుంది. 2019 సీజన్ ఐపీఎల్ ఫైనల్ మ్యాచ్‌ను కూడా మన అభిమానులు ఆస్వాదించారు. చైన్నెతో జరిగిన ఈ మ్యాచ్‌లో ముంబై 1 పరుగు తేడాతో గెలిచి చాంపియన్‌గా నిలిచింది. ఈసారి చైన్నె జట్టు హైదరాబాద్‌లో ఆడబోవడం లేదు. కాబట్టి మహేంద్ర సింగ్ ధోని ఆటను చూసే అవకాశం మన ప్రేక్షకులు కోల్పోయినట్లే! ఉప్పల్ స్టేడియంలో సన్‌రైజర్స్ హైదరాబాద్ మ్యాచ్‌లు.. ప్రత్యర్థి జట్లు ఏప్రిల్ 2 – ప్రత్యర్థి జట్టు రాజస్తాన్ – మధ్యాహ్నం 3.30 గంటల నుంచి ఏప్రిల్ 9 – పంజాబ్ – రాత్రి 7.30 గం. నుంచి ఏప్రిల్ 18 – ముంబై – రా.7.30 గం. నుంచి ఏప్రిల్ 24 – ఢిల్లీ – రా. 7.30 గం. నుంచి మే 4 – కోల్‌కతా – రా. 7.30 గం.నుంచి మే 13 – లక్నో – మ.3.30 గం. నుంచి మే 18 – బెంగళూరు – రాత్రి 7:30 గంటల నుంచి -
అతడు డెత్ ఓవర్స్ స్పెషలిస్ట్: స్టీవ్ స్మిత్
లండన్: టీమిండియా బౌలర్, సన్ రైజర్స్ హైదరాబాద్ స్టార్ పేసర్ భువనేశ్వర్ కుమార్ పై ఆస్ట్రేలియా కెప్టెన్ స్టీవ్ స్మిత్ ప్రశంసల జల్లులు కురిపించాడు. ఛాంపియన్స్ ట్రోఫీ సన్నాహకాలపై స్మిత్ లండన్ లో మీడియాతో మాట్లాడాడు. ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)-10 లో పర్వుల్ క్యాప్ విన్నింగ్ బౌలర్ భువనేశ్వర్ కుమార్ సన్ రైజర్స్ కు అద్భుతమైన విజయాలు అందించాడని కొనియాడాడు. ఐపీఎల్ లాంటి ట్వంటీ20 ఫార్మాట్ లో ముఖ్యంగా డెత్ ఓవర్లలో బౌలింగ్ చేయడం కష్టమని, కానీ భువీ మాత్రం డెత్ ఓవర్స్ బౌలింగ్ స్పెషలిస్ట్ అని కితాబిచ్చాడు. ఐపీఎల్-10 ఫైనల్లో ముంబై ఇండియన్స్ చేతిలో పరుగు తేడాతో ఓటమిని జీర్ణించుకోవడం కష్టమని చెప్పిన రైజింగ్ పుణే సూపర్ జెయింట్ కెప్టెన్ స్టీవ్ స్మిత్.. అంతర్జాతీయ క్రికెటర్ గా ఇలాంటి వాటిని అధిగమించి ముందుకు సాగాలని అభిప్రాయపడ్డాడు. ప్రతి టోర్నీని ఛాలెంజింగ్ గా తీసుకుని అంతర్జాతీయ ఆటగాళ్లు ముందుకు సాగుతారని, ఒత్తిడిని ఎలా జయిస్తారన్న ప్రశ్నకు ఇలా బదులిచ్చాడు. ఐపీఎల్లో ఆడటం ఎంతో కలిసొచ్చిందని, గత రెండేళ్ల కాలంలో ఐపీఎల్లో ఆడటం ద్వారా ఎన్నో విషయాలు నేర్చుకున్నట్లు స్మిత్ చెప్పుకొచ్చాడు. జూన్ 1నుంచి ప్రారంభం కానున్న ఐసీసీ ఛాంపియన్స్ లో పాల్గొనేందుకు ఆసీస్ జట్టు లండన్ చేరుకుంది.