గతేడాది నుంచి ఏదో వీరిద్దరిపై రూమర్స్ వినిపిస్తూనే ఉన్నాయి. ఓసారి ఎస్‌ఆర్‌హెచ్ ఓనర్ కావ్యమారన్- అనిరుధ్ రవిచందర్ న్యూయార్క్‌లో జంటగా కనిపించారు. అప్పటి నుంచే ఈ జంటపై డేటింగ్ రూమర్స్ మొదలయ్యాయి. ఆ తర్వాత కూడా చాలాసార్లు వీరి రిలేషన్‌షిప్ గురించే నెట్టింట చర్చ జరుగుతూ వస్తోంది. ఈ ఏడాదిలోనే ఈ జంట పెళ్లి పీటలెక్కనున్నారని టాక్ కూడా వినిపించింది.
తాజాగా ఈ రూమర్స్‌పై ప్రముఖ నటుడు వైజీ మహేంద్రన్ స్పందించారు. వీరిద్దరు త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నారా? అని ఆయను ప్రశ్నించగా.. అవుననే సమాధానమిచ్చారు. కావ్య మారన్ ప్రస్తుతం వ్యాపారవేత్తగా రాణిస్తున్నారని ఆయన అన్నారు. మ్యూజిక్ డైరెక్టర్‌గా అనిరుధ్ ఇప్పటికే గుర్తింపు తెచ్చుకున్నారని తెలిపారు. వీరిద్దరు పెళ్లి చేసుకుంటే మ్యూజికల్ బిజినెస్ అవుతుందని సరదాగా మాట్లాడారు. కాగా.. వైజీ మహేంద్రన్..మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్‌కు వరుసకు పెద్దనాన్న కావడం విశేషం. వైజీ మహేంద్రన్ కామెంట్స్‌తో ఏడాదికి పైగా వస్తున్న రూమర్స్‌కు తెరపడనుంది.
(ఇది చదవండి: ఎస్‌ఆర్‌హెచ్ ఓనర్ కావ్య మారన్ పెళ్లి.. అతనే ఫిక్సా?)


